Earthquake: 7.7 తీవ్రతతో వణికిన తీరం: సునామీ అలర్ట్ జారీ..!!
పోర్ట్ మోర్స్‌బై: పపువా న్యూగినియాలో పెను భూకంపం సంభవించింది. తూర్పు తీర ప్రాంతంలో సమీపంలో భూగర్భంలో సంభవించిన ఈ ప్రకంపనల తీవ్రత ప్రభావం అనూహ్యంగా ఉంటోంది. అధికారులు సునామీ హెచ్చరికలను జారీ చేశారు. కొద్దిసేపటి తరువాత వాటిని ఉపసంహరించుకున్నారు. తీరంలో పలు భవనాలు కంపించాయి. భూకంప తీవ్రతకు ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. రోడ్ల మీదికి పరుగులు తీశారు.
Purported damage in Lae, Papua New Guinea from today's M7.6 earthquake (photos: Johnny Bomai - Facebook) #earthquake #PNG pic.twitter.com/0Ri1aJJ3Kc
— Brian Olson (@mrbrianolson) September 11, 2022
ప్రధాన భూకంపం తరువాత కూడా స్వల్పంగా ప్రకంపనలు నమోదైనట్లు యునైటెడ్ స్టేట్స్ జియాలాజికల్ సర్వే (యూఎస్‌జీఎస్) తెలిపింది. భూకంపం వల్ల ప్రాణ, ఆస్తినష్టం సంభవించినట్లు ఇప్పటివరకు సమాచారం లేదు. కొన్ని చోట్ల భవనాలు బీటలు వారినట్ల వార్తలొచ్చాయి. పపువా న్యూగినియా తూర్పు ప్రాంతంలోని కైనంటు సిటీ తీరానికి 67 నాటికన్ మైళ్ల దూరంలో సముద్రంలో ఈ ప్రకంపనలు సంభవించాయి. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.7గా రికార్డయింది.
A dormitory building at the University of Goroka suffered moderate damage to what appears to be decorative awnings & some wall spalling & parapet collapse. Overall building seems intact, but LOTS of falling debris that could hurt or kill someone below. #PNG #earthquake pic.twitter.com/0tZCN3qA36
— Brian Olson (@mrbrianolson) September 11, 2022
దీని తీవ్రత కైనంటు సిటీ, లే టౌన్, మడంగ్ టౌన్‌పై పడింది. భూకంపం తీవ్రత 7.7 కావడం వల్ల ముందు జాగ్రత్త చర్యగా అధికారులు సునామీ హెచ్చరికలను జారీ చేశారు. తీర ప్రాంతాలు, రిసార్టుల ఖాళీ చేయించారు. తీరానికి ఎవరూ వెళ్లొద్దంటూ మైకుల ద్వారా ప్రకటించారు. సునామీ భయాలకు అనుగుణంగా ప్రకంపనలు సంభవించిన కొద్దిసేపటికే అలల తీవ్రత పెరిగింది. సాధారణ స్థాయి కంటే అరమీటర్ నుంచి మీటర్ ఎత్తు వరకు తీరానికి దూసుకొచ్చాయి.
Some earthquake damage to the main highway linking the highlands to the coast #PNG pic.twitter.com/naW9oR321e
— MARTYN AWAYANG NAMORONG (@MartynNamorong) September 11, 2022

మడంగ్ టౌన్ సమీపంలో సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. ముందుజాగ్రత్త చర్యగా తీరప్రాంత పట్టణాల్లో విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేశారు. మండంగ్‌లో పలు భవనాలు బీటలు వారాయి. ప్రహరీగోడలు కుప్పకూలిపోయాయి. కొన్నిచోట్ల రోడ్లు కుంగిపోయాయి. పపువా న్యూగినియాలో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. రింగ్ ఆఫ్ ఫైర్‌లో ఉందీ దేశం. పపువాతో పాటు బొలీవియా, చిలీ, ఈక్వెడార్, పెరు, కోస్టారికా, గ్వాటెమాలా, మెక్సికో, అమెరికా, కెనడ, రష్యా, జపాన్, ఫిలిప్పీన్స్, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, న్యూజిలాండ్, అంటార్కిటాలకు రింగ్ ఆఫ్ ఫైర్ దేశాలుగా పిలుస్తారు.
A tsunami information statement has been issued after the M7.7 earthquake at 6.4°S, 146.5°E (in the eastern New Guinea Region, PNG) - AK/BC/US West Coast Informational #1 https://t.co/HZYSgsavp1 pic.twitter.com/jzsyR0FGSY
— tsunami watch (@tsunamiwatch) September 11, 2022
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications