వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోడ్లన్నీ రద్దీ .. 700 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ .. పారిస్ లో లాక్ డౌన్ ఎఫెక్ట్

|
Google Oneindia TeluguNews

ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో ఏడు వందల కిలోమీటర్ల మేర భారీ ట్రాఫిక్ జామ్ అయింది. ఇది వినటానికి షాకింగ్ గా అనిపించినా నిజం . కరోనాకు సంబంధించి సెకండ్ వేవ్ మొదలైందని హెచ్చరికలు జారీ అవుతున్న సమయంలో, ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా మళ్లీ విజృంభించడం ప్రారంభించాయి. దీంతో ప్యారిస్లో మరోమారు శుక్రవారం నుండి లాక్ డౌన్ విధించడంతో గురువారం రాత్రి ప్యారిస్ చుట్టూ ఏడు వందల కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది.

యూఎస్ ఎలక్షన్ టైమ్ లో కరోనా ఉధృతి .. కోటికి చేరువగా కేసుల వేగం .. ట్రంప్ కొంప ముంచేస్తుందా ? యూఎస్ ఎలక్షన్ టైమ్ లో కరోనా ఉధృతి .. కోటికి చేరువగా కేసుల వేగం .. ట్రంప్ కొంప ముంచేస్తుందా ?

ఒకేసారి రోడ్ల మీదకు వేలాదిగా వాహనాలు .. వందల కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్

గురువారం సాయంత్రం నుంచే దేశంలోని ప్రధాన నగరాల్లో నివసించే ప్రజలు తమ స్వస్థలాలకు బయలుదేరారు. దీంతో రహదారులన్నీ క్రిక్కిరిసి పోయాయి. వాహనాల రణగొణ ధ్వనులతో రోడ్లన్నీ కిటకిటలాడాయి వేల సంఖ్యలో వాహనాలు ఒకేసారి రోడ్డుమీదకు రావడంతో వందల కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించడంతో ఇరుకు గదుల ఇళ్లలో బందీలుగా ఉండడానికి ఇష్టపడని చాలామంది ప్రజలు తమ సొంత ఊళ్లకు బయలుదేరినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు పారిస్ వాసులు ఇంతగా బయటకు వెళ్లడానికి మరో ప్రధాన కారణం లాంగ్ వీకెండ్ అని కూడా చెబుతున్నారు.

ఫ్రాన్స్ లో భారీగా పెరుగుతున్న కేసులు.. శుక్రవారం నుండి లాక్ డౌన్

ఫ్రాన్స్ లో భారీగా పెరుగుతున్న కేసులు.. శుక్రవారం నుండి లాక్ డౌన్

ఒకపక్క లాక్ డౌన్ విధింపుతో నిత్యావసర వస్తువుల షాపులు, మార్కెట్లు జనంతో కిక్కిరిసిపోయాయి. లాక్ డౌన్ విధించిన ప్రభుత్వం శుక్రవారం నుండి 67 మిలియన్ల ప్రజలను ఇళ్లలోనే ఉండాలని కోరింది. ఎలాంటి సందర్శనలకు అనుమతించమని స్పష్టం చేసింది . ఎవరైనా లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలతో పాటుగా, శిక్షలు కూడా విధించనున్నట్లుగా ఫ్రాన్స్ ప్రభుత్వం పేర్కొంది . దేశ వ్యాప్తంగా భారీగా పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు నియంత్రించటం కోసం ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మాక్రాన్ లాక్డౌన్ మార్గాన్ని ఎంచుకున్నారు .

 తగ్గినట్టే తగ్గి పెరిగిన కేసులు ... కరోనా కంట్రోల్ కి లాక్ డౌన్ ఒక్కటే మార్గం

తగ్గినట్టే తగ్గి పెరిగిన కేసులు ... కరోనా కంట్రోల్ కి లాక్ డౌన్ ఒక్కటే మార్గం

నెల క్రితం వరకు ఫ్రాన్స్ లో కరోనా కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపించినా గత కొన్ని రోజులుగా మళ్లీ ఉగ్రరూపం దాలుస్తోంది.గురువారం ఒక్క రోజే 47 వేలకు పైగా కేసులు నమోదు కావడం తాజా పరిస్థితికి అద్దం పడుతోంది. దీంతో కరోనా కట్టడి కోసం లాక్ డౌన్ విధించింది ఫ్రాన్స్ ప్రభుత్వం. 700 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ కావడానికి కూడా కరోనా కారణంగా విధించిన లాక్డౌన్ ప్రధాన కారణంగా తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్యారిస్ ట్రాఫిక్ జామ్ కు సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి.

English summary
Seven hundred kilometers in the French capital, Paris, there is a huge traffic jam. This is true even if it seems shocking to hear. At a time when warnings are being issued that a second wave has begun for the corona, corona cases around the world have dwindled and started booming all at once. A 700 kilometer traffic jam around Paris on Thursday night led to another lockdown in Paris from Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X