వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

908కు చేరిన కరోనా మృతుల సంఖ్య, మరో 3,067 మందికి వైరస్, షిప్ నుంచి 1800 మంది విడుదల..

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ వల్ల చనిపోయే వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. ఆదివారం 813 ఉన్న మృతుల సంఖ్య సోమవారానికి 908కి చేరింది. ఆదివారం ఒక్కరోజు 97 మంది చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. మరో 3 వేల 62 మందికి వైరస్ సోకినట్టు చైనా జాతీయ హెల్త్ మిషన్ ప్రక్రటించింది. చైనాలో వైరస్ సోకిన వారి సంఖ్య 40 వేల మందికి చేరింది.

ఇక్కడే 91 మంది..

ఇక్కడే 91 మంది..

వైరస్ వ్యాప్తి చెందిన హ్యుబీలో ఆదివారం 91 మంది చనిపోయారు. అన్హులో ఇద్దరు, హెలొంగ్‌జియాంగ్‌లో ఒకరు, జిన్‌జ్గీలో ఒకరు, హైనాన్‌, గన్హులో ఒకరు చనిపోయారని హెల్త్ మిషన్ పేర్కొన్నది. వైరస్ బారినపడి చనిపోయే మంది మరింత పెరిగే అవకాశం ఉండటంతో ఆందోళన నెలకొంది.

మరో ఇద్దరు

మరో ఇద్దరు

కరోనా వైరస్ సోకి అమెరికాకు చెందిన 60 ఏళ్ల వ్యక్తి గురువారం వుహన్‌లో మృతిచెందారు. దీనిని అమెరికా రాయబార కార్యాలయం కూడా ధృవీకరించింది. వుహన్‌లో జపాన్‌కు చెందిన 60 ఏళ్ల వ్యక్తి కూడా చనిపోయారని జపాన్ విదేశాంగ శాఖ పేర్కొన్నది.

నెగిటివ్ అని తేలడంతో

నెగిటివ్ అని తేలడంతో

వైరస్ సోకి కోలుకున్న 630 మందిని ఆదివారం వైద్యులు ఇంటికి పంపించారు. ఇందులో హ్యుబీకి చెందిన 356 మంది ఉన్నారు. మరోవైపు హంకాంగ్ పడవలో ఉన్న వేలాదిమంది కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించారు. 1800 మందికి వైరస్ సోకలేదని నిర్దారణ కావడంతో వారిని బయటకు వదిలేశారు.

ఇలా వచ్చింది..

ఇలా వచ్చింది..

హుబీ రాజధాని వుహన్‌లో గల క్రూర మృగాలను విక్రయించే మార్కెట్ గుండా వైరస్ వ్యాప్తి చెందిదని చైనా హెల్త్ కమిషన్ చెబుతోంది. అదీ క్రమంగా విస్తరించి చైనా గాక ప్రపంచంలోని ఇతర దేశాలకు కూడా వ్యాపించిందని పేర్కొన్నారు.

English summary
death toll in China due to novel coronavirus epidemic has gone up to 908 and the number of confirmed cases rose over 40,000, Chinese health officials said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X