• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పిచ్చి పీక్స్‌కు చేరింది: అమెరికాలో 91 ఏళ్ల వృద్ధుడిపై జాత్యాహంకార దాడులు

|

అమెరికాలో జాత్యాహంకారదాడులు ఎక్కువయ్యాయి. 2016లో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక ఈ దాడుల సంఖ్య మరింత పెరిగింది. తాజాగా అమెరికా స్వాతంత్ర దినోత్సవం రోజున అంటే జూలై 4న ఓ 91 ఏళ్ల వృద్ధుడిపై కొందరు జాత్యాహంకార దాడులకు పాల్పడ్డారు. ఆ సమయంలో ఆ వృద్ధుడు మార్నింగ్ వాక్ చేస్తున్నారు.

రొడోల్ఫ్ రాడ్రిగ్జ్ అనే ఈ వృద్ధుడు ఉదయం వాకింగ్ చేస్తున్న సమయంలో కొందరు యువకులు కనీస ఇంకిత జ్ఞానం లేకుండా ప్రవర్తించారు. వృద్ధుడనే జాలి లేకుండా మానవత్వం మరిచి ఆ పెద్దాయనపై పిడిగుద్దులు గుద్దారు. ముఖానికి తీవ్ర గాయాలు చేశారు. ఆ దుండగులు రాడ్రిగ్స్‌ను చితకబాదటంతో తీవ్రగాయాలయ్యాయి. కనీసం లేచి నిలబడలేకున్నాడు. చాలా నొప్పితో బాధపడుతున్నట్లు స్పానిష్‌భాషలో చెప్పాడు. ఇక నేను నడవలేనేమోనని కన్నీరు పెట్టుకున్నాడు. ఇంతవరకు తనను ఇలా ఎవరూ కొట్టిందిలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. కాలిఫోర్నియాలో ఉన్న తన కుటుంబ సభ్యులను చూసేందుకు మెక్సికో నుంచి వచ్చాడు. పొరిగింటి వారికి చుట్టుపక్కల వారందరికీ రాడ్రిగ్స్ పరిచయమే.

91 year old man attacked in US, asked to go back to Mexico

తాను మార్నింగ్ వాక్ కోసమని పార్క్‌కు వెళుతున్న సమయంలో ఓ మహిళ మరో చిన్నారితో తనకు ఎదురైందని రాడ్రిగ్స్ చెప్పాడు. వెంటనే ఆ మహిళ తనపై తిట్ల దండకం అందుకుందని... ఆపై ఆ పక్కనే ఉన్న మనుషులను బిగ్గరగా కేకలు వేసి పిలిచిందని ఆ చేదు జ్ఞాపకాన్ని రాడ్రిగ్స్ వెల్లడించాడు. అక్కడికి వచ్చిన వారు ఎందుకు కొడుతున్నారో కూడా చెప్పకుండా చితకబాదారని కన్నీటిపర్యంతం అయ్యాడు 91 ఏళ్ల రాడ్రిగ్స్.

రాడ్రిగ్స్ పరిస్థితిని తెలుసుకున్న బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మహిళతో పాటు మరో దాడి చేసిన మరో నలుగురు పురుషుల కోసం గాలిస్తున్నారు. ఆ మహిళ మరో నలుగురి దగ్గరకు వెళ్లి తన కూతురును కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని చెప్పిందని రాడ్రిగ్స్ వెల్లడించాడు. దీంతో కోపోద్రిక్తులైన పురుషులు అతనిని చితకబాదారని...రక్తం వస్తున్న పట్టించుకోకుండా కొట్టారని కన్నీరు పెట్టుకున్నారు రాడ్రిగ్స్.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A 91 year old Mexican was thrashed by a group of unknown men in America on the lines of racisim. Rodolfo Rodriguez while going for a walk, was attacked by men with bricks. The old man laid bleeding on the sidewalk."I can't walk anymore," Rodriguez said in Spanish.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more