వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చచ్చిపోయిన వాళ్లను బతికిస్తారట.. ఒక్క ఏడాది ఆగమంటున్నారు!

చచ్చిపోయిన వాళ్లను బతికిస్తామంటోంది ఫిలడెల్ఫియా కేంద్రంగా పనిచేస్తోన్న బయోక్వార్క్ అనే సంస్థ. అది కూడా సమీప భవిష్యత్తులోనే..

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

ఫిలడెల్ఫియా: చచ్చిపోయిన వాళ్లను బతికిస్తామంటోంది ఫిలడెల్ఫియా కేంద్రంగా పనిచేస్తోన్న బయోక్వార్క్ అనే సంస్థ. అది కూడా సమీప భవిష్యత్తులోనే.. ఒక్క ఏడాది ఆగండి మా ప్రయోగం పూర్తవుతుంది అని ఘంటాపదంగా చెబుతోంది ఈ సంస్థ.

అసలు చావు అంటే ఏంటి? వైద్యశాస్త నిఘంటువు ప్రకారం.. గుండె కొట్టుకోవడం మొదలుకొని మెదడు పనిచేయడం వరకు శరీరంలో అన్ని రకాల జీవక్రియలు ఆగిపోవడాన్ని మరణం అంటారు. కొన్ని దేశాల్లో బ్రెయిన్ డెడ్ ను చావుగా పేర్కొంటారు. అంటే.. మిగిలిన అవయవాల సంగతి అలా ఉంచితే.. మెదడు పనిచేయడం పూర్తిగా నిలిచిపోవడం అన్నమాట.

బ్రెయిన్ డెడ్ కు గురైన వారిని...

బ్రెయిన్ డెడ్ కు గురైన వారిని...

ఇలా బ్రెయిన్ డెడ్ కు గురైన వారిని తిరిగి బతికించేందుకు తామొక వినూత్నమైన పద్ధతిని ఆవిష్కరించినట్లు పేర్కొంటోంది ఈ బయోక్వార్క్ సంస్థ. వచ్చే ఆర్నెల్లలో దక్షిణ అమెరికా దేశాల్లో ఒకదానికి చెందిన వ్యక్తిపై ఈ ప్రయోగం జరగనున్నట్లు ఆ సంస్థ సీఈవో ఇరా పాస్టర్ చెబుతున్నారు. నిజానికి ఏ ప్రయోగమైనా ముందుగా జంతువులపై చేస్తారు. కానీ బయోక్వార్క్ సంస్థ చేయనున్న ఈ ప్రయోగం మాత్రం నేరుగా మనిషిపైనే జరుగుతుండడం విశేషం.

మూలకణాలదే కీలకపాత్ర...

మూలకణాలదే కీలకపాత్ర...

బ్రెయిన్ డెడ్ కు గురైన వారిని తిరిగి బతికించేలా బయోక్వార్క్ చేస్తున్న ఈ ప్రయోగంలో మూలకణాలదే కీలకపాత్ర. రక్తం నుంచి సేకరించిన మూలకణాలను మరణించిన వ్యక్తి శరీరంలోకి మళ్లీ చొప్పించడంతో బయోక్వార్క్ తొలిదశ ప్రయోగం మొదలవుతుంది. రెండో దశలో - ఆ వ్యక్తి వెన్నెముకలోకి రకరకాల పెప్ టైడ్లను ఎక్కిస్తారు. ఎమ్మారై స్కాన్ల ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ మీడియన్ నాడిని లేజర్ కిరణాల సాయంతో ఉత్తేజపరుస్తారు. ఇలా 15 రోజుల పాటు చేస్తే అతడి మెదడు మళ్లీ పనిచేయడం ప్రారంభమవుతుందనేది బయోక్వార్క్ విశ్వాసం.

భారతీయ వైద్యుడి సహకారం...

భారతీయ వైద్యుడి సహకారం...

బ్రెయిన్ డెడ్ కు గురైన వ్యక్తులను తిరిగి బతికించే బయోక్వార్క్ ప్రయత్నానికి భారతీయ వైద్యుడు హిమాన్షు బన్సల్ సహకారం అందిస్తున్నాడు. నిజానికి గత ఏడాది మే నెలలోనే ఈ ప్రయోగాన్ని ఈయన మనదేశంలోని ఉత్తరాఖండ్ లో నిర్వహించాలని భావించారు. వివిధ ప్రమాదాల్లో బ్రెయిన్ డెడ్ అయిన 20 మందిపై ప్రయోగాలు చేసేందుకు అనుమతివ్వాల్సిందిగా కోరుతూ ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్)కు దరఖాస్తు కూడా చేశారు హిమాన్షు బన్సల్.

ముందుకొచ్చిన బయోక్వార్క్...

ముందుకొచ్చిన బయోక్వార్క్...

అయితే ఐసీఎంఆర్ డాక్టర్ హిమాన్షు బన్సల్ విజ్ఞప్తిని గత నవంబర్ లో తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన ప్రయోగాలకు అవసరమైన పెప్ టైడ్లను సరఫరా చేసేందుకు బయోక్వార్క్ సంస్థ ముందుకొచ్చింది. అయితే ఈ ప్రయోగం పూర్తిస్థాయిలో విజయవంతమైనా ఆ వ్యక్తి పూర్తిగా కోలుకోలేడట. కాకపోతే, కళ్లు కదపడం.. వంటి చిన్న చిన్న పనులు మాత్రం చేయగలడట. ఈ మాత్రమైనా చేయగలగడం గొప్పే కదా! ఏమో ఈ ప్రయోగాలు ఇలాగే జరుగుతూ పోతే, భవిష్యత్తులో ఏదో ఒక రోజు చనిపోయిన మనిషి తిరిగి బతుకుతాడేమో.. ఏమంటారూ?

English summary
The scientists hope that they can grow neurons and spur them to connect with each other – bringing the brain back to life. Ira Pastor, CEO of Bioquark, said, ‘It’s our contention that there’s no single magic bullet for this, so to start with a single magic bullet makes no sense. Hence why we have to take a different approach. Last year, Pastor described the company’s work as ‘a step towards the eventual reversal of death in our lifetime.’
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X