రష్యాలో పెను విధ్వంసం: న్యూయార్క్ అల్‌ఖైదా తరహా అటాక్: భయానకం
Russia Ukrain war: రష్యా-ఉక్రెయిన్ మధ్య నెలల తరబడి హోరాహోరీగా యుద్ధం కొనసాగుతోంది. దీనికి విరామం అనేది ఉండట్లేదు. గత ఏడాది ఫిబ్రవరి 24వ తేదీన ఆరంభమైన నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది. రష్యా దాడుల్లో ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని పలు నగరాలు ధ్వంసం అయ్యాయి. పలువురు ప్రాణాలు కోల్పోయారు. అదే స్థాయిలో ఆస్తినష్టం సంభవించింది.
అయినప్పటికీ ఏ దేశం కూడా వెనక్కి తగ్గట్లేదు. ఢీ అంటే ఢీ అంటోన్నాయి. ఇన్ని రోజులుగా సాగుతున్న ఈ యుద్ధం వల్ల ఇప్పటికే ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని పలు నగరాలు నేలమట్టం అయ్యాయి. వాటిని రష్యా సైనిక బలగాలు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి.

మరియోపోల్, మెలిటొపోల్, క్రిమియా, డాన్‌బాస్, డొనెట్స్క్, లుహాన్స్క్, ఖేర్సన్, సుమి, ఒడెస్సా, చెర్న్‌హీవ్.. వంటి నగరాలను రష్యా సైనిక బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. సరిహద్దుల నుంచి కొన్ని కిలోమీటర్ల వరకు చొచ్చుకెళ్లాయి. అటు ఉక్రెయిన్ బలగాలు రష్యా సైన్యాన్ని అడ్డుకోవడానికి తీవ్రంగా ప్రతిఘటిస్తోన్నాయి.
రాజధాని కీవ్‌ను రష్యా సైనికులు చుట్టుముట్టినప్పటికీ.. అంత తేలిగ్గా లొంగట్లేదు. రాజధానిని ఆ దేశ సైన్యం కాపాడుకోగలిగింది. అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ, జపాన్, బ్రిటన్ వంటి దేశాలు సమకూర్చుతోన్న యుద్ధ సామాగ్రితో రష్యా సైన్యం దూకుడును అడ్డుకుంటోంది ఉక్రెయిన్.
🚨#BREAKING: Watch as a drone crashes into the 38-story Volga Sky residential complex in Saratov, Russia, the tallest building in the city.
— R A W S G L 🌎 B A L (@RawsGlobal) August 26, 2024
📌#Saratov | #Russia
At least two people were seriously injured after a drone crashed into the 38-story residential complex "Volga Sky",… pic.twitter.com/lycuyB7r9T
మరోవంక యుద్ధాన్ని నివారించడానికి భారత్ సహా వివిధ దేశాలు తమవంతు ప్రయత్నాలు సాగిస్తోన్నాయి. ఇందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలే ఉక్రెయిన్‌లో పర్యటించారు. ఆ దేశాధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీతో ముఖాముఖి సమావేశం అయ్యారు. శాంతి చర్చలను ప్రతిపాదించారు.
మరోవంక- ఉక్రెయిన్ తన దూకుడును పెంచింది. రష్యాలోని నగరాలపై దాడులకు దిగింది. సరిహద్దులకు సమీపంలో ఉన్న సొరొటొవ్ నగరంపై దాడికి పాల్పడింది. ఈ నగరంలో 38 అంతస్తుల అతి ఎత్తయిన వోల్గా స్కై అపార్ట్‌మెంట్‌పై అన్ మ్యాన్డ్ సూసైడ్ డ్రోన్‌ను ప్రయోగించింది. అపార్ట్‌మెంట్‌ను ఢీ కొట్టిన ఘటనలో భారీగా నష్టం సంభవించింది.
Engels and Saratov were reportedly attacked by drones this morning. So far, reports indicate damaged buildings and at least 20 vehicles. One of the drones crashed into the tallest high-rise building in Saratov, falling about 12 kilometers short of the Engels military airfield. pic.twitter.com/cjsmedAqf3
— NOELREPORTS 🇪🇺 🇺🇦 (@NOELreports) August 26, 2024
దీనికి సంబంధించిన వీడియో క్లిప్‌లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటనలో భారీ నష్టం సంభవించింది. అమెరికా న్యూయార్క్‌లో గల డబ్ల్యూటీసీ టవర్లపై అల్‌ఖైదా ఉగ్రవాదులు రెండు విమానాలతో దాడికి పాల్పడిన ఉదంతాన్ని గుర్తు చేసింది. ఈ దాడిని సొరొటొవ్ గవర్నర్ ధృవీకరించారు.












Click it and Unblock the Notifications