షరతులు: పీవోకే డ్యాంపై చైనాకు దిమ్మతిరిగే షాకిచ్చిన పాకిస్తాన్, డ్రాగన్ షాక్
మిత్ర దేశం చైనాకు పాకిస్తాన్ దిమ్మతిరిగే షాకిచ్చింది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)లో నిర్మించనున్న డ్యాంకు నో చెప్పింది.
Recommended Video

బీజింగ్/ఇస్లామాబాద్: మిత్ర దేశం చైనాకు పాకిస్తాన్ దిమ్మతిరిగే షాకిచ్చింది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)లో నిర్మించనున్న డ్యాంకు నో చెప్పింది.
చైనా - పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (సీపీఈసీ) విషయంలో చైనా ఆఫర్‌ను పాక్ తిరస్కరించింది. పీవోకేలో డైమర్ భాష డ్యాం నిర్మాణానికి 14 బిలియన్ డాలర్ల రుణం అందించేందుకు చైనా ముందుకు రాగా, పాక్ నిరాకరించడం గమనార్హం.

పీవోకేలో రుణం ఇచ్చేందుకు ఆసియా అభివృద్ధి బ్యాంక్ నో
60 బిలియన్లతో చేపడుతున్న సీపీఈసీ నుంచి ఈ ప్రాజెక్టును తప్పించాలని, ఈ డ్యాంను తామే కట్టుకుంటామని పాకిస్తాన్ నేరుగా చైనాకు చెప్పిందని తెలుస్తోంది. భారత్ తన ప్రాంతంగా పేర్కొంటున్న పీవోకేలో ఈ డ్యాం నిర్మిస్తుండటంతో ఈ ప్రాజెక్టుకు రుణం అందించేందుకు ఇప్పటికే ఆసియా అభివృద్ధి బ్యాంకు నిరాకరించింది.

అంతర్జాతీయ సంస్థల నిరాకరణ
ఈ వివాదాస్పద ప్రాంతంలో పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ సంస్థలు కూడా నిరాకరించాయి. ఈ నేపథ్యంలో సీపీఈసీలో ఈ డ్యాంకు రుణం ఇచ్చేందుకు చైనా కంపెనీలు ముందుకు వచ్చాయి.

చైనా కంపెనీల షరతులు
అయితే ఈ ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని 5 బిలియన్ డాలర్ల నుంచి ఏకంగా 14 బిలియన్ డాలర్లకు పెంచడం, అలా రుణం ఇచ్చేందుకు చైనా కంపెనీలు పలు షరతులు పెట్టాయి. దీంతో పాక్.. చైనాకు నో చెప్పింది. సొంతగా ప్రాజెక్టు చేపడుతామని తల్చి చెప్పింది.ఈ మేరకు ఆ దేశ జాతీయ పత్రికలో వార్త వచ్చింది.

చైనా షరతులు ఆమోదయోగ్యం కాదని
డైమర్ - భాషా డ్యాం విషయంలో చైనా షరతులు ఆమోదయోగ్యం కాదని, దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయని పాక్ వాటర్, విద్యుత్ అభివృద్ధి సంస్థ చైర్మన్ చెప్పారు.

పాక్ వైఖరిపై చైనా ఆశ్చర్యం
మరోవైపు, పాకిస్తాన్ వైఖరిపై చైనా ఆశ్చర్యం వ్యక్తం చేస్తోందని తెలుస్తోంది. మొత్తం సీపీఈసీ ప్రాజెక్టును ప్రమాదంలో పడేసేలా చైనా ఆఫర్‌ను పాక్ తిరస్కరించలేదని భావిస్తున్నారు. ప్రాజెక్టు యాజమాన్యం, నిర్వహణ, నిర్వహణ ఖర్చులు, భద్రత తామే చూసుకుంటామని చైనా కంపెనీలు పెడుతున్న షరతులు దేశ ప్రయోజనాలకు భంగకరమని పాక్ అధికారులు చెబుతున్నాయి.
-
మన వాయుసేనలో పాక్ గూఢచారి: దేశ భద్రతను పాకిస్థాన్‌కు తాకట్టు -
ప్రపంచంలోనే తొలి స్థానంలో పాకిస్థాన్.. ఆ ఒక్క విషయంలో.. -
లష్కరే తోయిబా ఉగ్రవాది హత్య.. చంపేసింది సొంత కుటుంబ సభ్యులే! -
ఇరాన్ పై దాడికి పాకిస్తాన్ ? తెరపైకి సౌదీతో రక్షణ ఒప్పందం..! -
అప్పటి వరకూ పాకిస్థాన్ కు నో వాటర్: భారత్ సంచలనం -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు












Click it and Unblock the Notifications