ఐక్యరాజ్యసమితి హైలెవెల్ భేటీలో నిత్యానంద కైలాస: భారత్‌పై ఘాటు విమర్శలు

స్వామి నిత్యానంద నెలకొల్పిన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస దేశానికి ఐక్యరాజ్య సమితి గుర్తింపు లభించిందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. జెనీవాలో ఐరాస నిర్వహించిన సమావేశానికి ఆ దేశ ప్రతినిధురాలు హాజరు కావడం చర్చనీయాంశమ

జెనీవా: అత్యాచార ఆరోపణలతో దేశం విడిచి పారిపోయిన వివాదాస్పద స్వామి నిత్యానంద.. ఓ సొంత దేశాన్నే సృష్టించుకున్నారు. ఈక్వెడార్ సమీపంలోని ఓ చిన్న ద్వీపంలో తిష్ఠ వేశారు. ఆ ద్వీపాన్ని హిందూ దేశంగా ప్రకటించారు. దానికి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాసగా పేరు పెట్టారు. దీనికోసం ఓ ప్రత్యేక వెబ్ సైట్ ను రూపొందించారు. https://www.kailaasa.org వెబ్ సైట్ లో కైలాస దేశానికి సంబంధించిన పూర్తి వివరాలను పొందుపరిచారు.

 అక్కడి నుంచే కార్యకలాపాలు..

అక్కడి నుంచే కార్యకలాపాలు..

2019లో స్వామి నిత్యానంద- యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస దేశాన్ని ప్రకటించారు. అక్కడి నుంచే తన కార్యకలాపాలను కొనసాగిస్తోన్నారు. ప్రసంగాలను సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ పై పోస్ట్ చేస్తోన్నారు. నిత్యానంద దేశానికి వెళ్లాలంటే ప్రత్యేక పాస్ పోర్ట్ అవసరం అవుతుంది. సొంతంగా జాతీయ పతాకాన్ని, జాతీయ ధ్వజాన్ని సైతం రూపొందించుకున్నారు. తాను ధ్యానంలో కూర్చున్న ఫొటోను జాతీయ చిహ్నంగా ప్రకటించారు.

 ఐరాసలో..

ఐరాసలో..

యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస దేశాన్ని అధికారికంగా గుర్తించాలని కోరుతూ నిత్యానంద.. ఇదివరకే ఐక్యరాజ్య సమితికి విజ్ఞప్తి చేశారు. దీనికి అవసరమైన ఫార్మాలిటీస్ అన్నింటినీ పూర్తి చేశారు. ప్రపంచంలో హిందూ దేశాల సంఖ్య తగ్గుతోందని, అందుకే తాను కైలాస పేరుతో ప్రత్యేకంగా ఓ దేశాన్ని సృష్టించాల్సి వచ్చిందంటూ అప్పట్లో చెప్పుకొచ్చారాయన. ఐక్యరాజ్య సమితిలో ఆయన ప్రయత్నాలు ఫలించినట్టే కనిపిస్తోంది.

జెనీవా భేటీకి..

జెనీవా భేటీకి..

ఐక్యరాజ్య సమితికి చెందిన ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కుల కమిటీ తాజాగా స్విట్జర్లాండ్ లోని జెనీవాలో నిర్వహించిన అత్యున్నత స్థాయి సమావేశానికి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస ప్రతినిధురాలు పాల్గొనడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కైలాస తరఫున విజయప్రియ నిత్యానంద ఈ భేటీకి హాజరయ్యారు. కీలక అంశాలపై ప్రసంగించారు. విజయప్రియ నిత్యానందను ఐక్యరాజ్య సమితిలో శాశ్వత రాయబారిగా చెబుతున్నారు.

హిందువుల సార్వభౌమాధికారం..

కైలాస దేశం- హిందువుల మొట్ట మొదటి సార్వభౌమధికార దేశమని విజయప్రియ అన్నారు. నిత్యానంద పరమశివం దీన్ని స్థాపించారని గుర్తు చేశారు. హిందూ నాగరికతతో పాటు 10,000 రకాల దేశీయ సంప్రదాయాలను పునరుజ్జీవింపజేస్తోన్నాడని చెప్పారు. ఇందులో ఆది, శైవ దేశీయ వ్యవసాయ తెగలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు.

 తీవ్ర వివక్షతకు..

తీవ్ర వివక్షతకు..

ఈ క్రమంలో నిత్యానంద- తీవ్ర వివక్షను ఎదుర్కొన్నారని, మానవ హక్కుల ఉల్లంఘనకు గురయ్యారని భారత్ ను ఉద్దేశించి పరోక్షంగా విమర్శించారు. హిందుమత సారాన్ని బోధించకుండా నిత్యానందను అడ్డుకున్నారని, పుట్టిన దేశం నుంచి బహిష్కారానికి గురయ్యారని విజయప్రియ వివరించారు. జెనీవా సమావేశంలో తాను చేసిన ప్రసంగానికి సంబంధించిన వీడియోను కైలాస అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+