
Viral Video: పిల్లికి చుక్కలు చూపించిన పాము.. వీడియో వైరల్..
సోషల్ మీడియాలో వచ్చే కొన్ని వీడియోలు ఆశ్చర్యాన్ని కలిగిస్తే మరికొన్ని వీడియోలు వినోదాన్ని పంచుతాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు నవ్వులు పూయిస్తాయి. అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోలో పిల్లితో పాము ఆడే ఆట చూస్తే నవ్వు రాక మానదు.
కొండ గొర్రె
ఈ వీడియోలో ఓ పాము పడుకున్న పిల్లిని ఆట పట్టిస్తుంది. పిల్లికి గిలిగింతలు పుట్టించి దానికి నిద్ర పట్టకుండా చేస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు నవ్వుకుంటున్నారు. ఓ కొండ గొర్రెను ఓ డేగ వేటాడిన వీడియో కూడా కొద్ది రోజుల క్రితం వైరల్ అయింది.
పిల్లి మత్తు దించిన పాము.. ఒక్కసారిగా షాకై..!!#Cat #Snake #OneIndiaTelugu pic.twitter.com/tptdRYD4ql
— oneindiatelugu (@oneindiatelugu) August 22, 2022

చిరుత
రోజుల క్రితం ఓ చిరుత ఆవును వేటాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోను IFS అధికారి సాకేత్ బడోలా ట్విట్టర్ లో షేరు చేశారు. ఈ వీడియోలో చిరుతపులి ఆవును వేటాడినట్లు చూడవచ్చు. చిన్న క్లిప్‌లో, చిరుతపులి ప్రాణాంతకమైన పట్టులో ఆవు కనిపిస్తుంది. అడవి పిల్లి ఆవును రెయిలింగ్ కింద నుంచి లాగడానికి తీవ్రంగా ప్రయత్నించింది, కానీ ఆవు నుంచి కూడా మంచి పోటీ వచ్చింది. అయితే, చిరుతపులి దవడ బలంతో ఆవును చాలా సేపు పట్టి ఉంచింది. ఈ పోరాటంలో చివరికి చిరుత విజయం సాధించింది.