Viral Video: చెమటలు పట్టించిన కింగ్ కోబ్రా.. స్నేక్ క్యాచర్‌కు త్రుటిలో తప్పిన ప్రమాదం..
సోషల్ మీడియాలో చాలా వీడియోలు కనబడుతుంటాయి.అందులో కొన్ని చాలా ప్రమాదకరమైన వీడియోలు ఉంటాయి. ఇలాంటి వీడియో చూసి మీరు కూడా భయపడి పోతారు. తాజాగా సోషల్ మీడియాలో కింగ్ కోబ్రా చెందిని ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి నాగుపామును పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. కానీ ఆ పాము మాత్రం భయకరంగా బుసలు కొడుతూ తప్పించుకోవాలని చూస్తోంది.
కింగ్ కోబ్రా
ఈ వీడియోలో ఓ వ్యక్తి పామును కింగ్ కోబ్రాను పట్టుకున్నాడు. దాని తోకను పట్టుకుని ఆడించాలని చూస్తున్నాడు. కానీ పాము ఆగ్రహం దాడి చేయడానికి ప్రయత్నించింది. అతను పాము కాటు నుంచి తృుటిలో తప్పించుకున్నాడు. ఈ పాము చాలా పొడవుగా పెద్దదిగా ఉంది. కానీ ఇలాంటి పాములతో జాగ్రత్తగా ఉండాలి లేకుంటే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.

4 లక్షలకు పైగా వ్యూస్
ఈ వీడియోకు ఇప్పటి వరకు 4 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. లక్షల్లో లైక్స్ వచ్చాయి. కింగ్ కోబ్రాను చూస్తేనే ప్రాణం పోయేలా ఉందని ఒకరు కామెంట్ చేయగా.. అతను తన ప్రాణాలతో చెలగాటమడుతున్నాడని మరొకరు కామెంట్ చేశారు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో therealtarzann అనే యూజర్ షేర్ చేశాడు.












Click it and Unblock the Notifications