జపాన్ ప్రధానిగా అబే మళ్ళీ గెలుపు: మోడీ, బాబు అభినందన
టోక్యో: జపాన్ ప్రధానిగా షింజో అబె మరోసారి గెలుపొందారు. అబె సారథ్యంలోని అధికార లిబరల్ డెమొక్రటిక్ పార్టీ ఘనవిజయం సాధించింది. ఆయన ప్రవేశపెట్టిన ఆర్థిక విధానాలపై రిఫరెండంగా ఆదివారం ఈ ఎన్నికలు జరిగాయి.
ఆయన నేతృత్వంలోని లిబరల్ డెమోక్రటిక్ పార్టీ(ఎల్డీపి), ఆయన భాగస్వామి కొమిటో కలిసి ఈ ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో 2/3 మెజార్టీతో తిరుగులేని ఆధిక్యత సాధించింది. మొత్తం 475 స్థానాలకు గాను అబే పార్టీ 333 సీట్లు గెలుచుకుంది.

కాగా, జపాన్ ప్రధానిగా మరోసారి ఎన్నికైన షింజో అబెకు భారత ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్‌లో అభినందనలు తెలిపారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు మరింత పటిష్టపరిచేందుకు ఆయనతో పని చేసేందుకు ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.
Congratulations @AbeShinzo on your victory in the elections. Japan will scale newer heights of progress under your able leadership.
— Narendra Modi (@narendramodi) December 15, 2014 ‘ఎన్నికల్లో విజయం సాధించిన షింజో అబేకు నా అభినందనలు. మీ సమర్థవంతమైన నాయకత్వంలో జపాన్ పురోగతిలో కొత్త శిఖరాలకు వెళుతుందని ఆశిస్తున్నాం' అని మోడీ పేర్కొన్నారు.
ఇది ఇలా ఉండగా అబే ఎన్నిక పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఆయనకు అభినందనలు తెలిపారు. ఇటీవల చంద్రబాబు తన బృందంతో కలిసి జపాన్ పర్యటనకు వెళ్లినప్పుడు అబేతో సమావేశమైన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఎన్నికల్లో విజయం సాధించాలంటూ అబేకు తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి శేషవస్త్రం కప్పి ప్రసాదం అందజేశారు.












Click it and Unblock the Notifications