వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అబ్రహామీ: అరబ్ దేశాల్లో కలకలం రేపుతున్న కొత్త మతం.. ఇది ఏంటి, ఎందుకు?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
అబ్రహమీ

ఈజిఫ్టులో మత ఐక్యత కోసం ప్రారంభించిన 'ఈజిఫ్టు ఫామిలీ హౌస్' పదో వార్షికోత్సవం సందర్భంగా అల్ అజహర్ అత్యున్నత ఇమామ్ అహ్మద్ అల్ తయ్యబ్.. 'అబ్రహామీ' మతాన్ని తీవ్రంగా విమర్శించారు.

ఆయన విమర్శలతో అబ్రహామీ మతం మరోసారి పతాక శీర్షికలకు ఎక్కింది. ఈ మతం గురించి గత ఏడాదిగా అరబ్ దేశాల్లో వివాదం నెలకొంది.

అబ్రహామీ మతం అంటే ఏంటి? ఎందుకు?

అబ్రహామీ మతం ఉనికిలోకి రావడం గురించి ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ప్రకటనలూ రాలేదు. ఈ మతం స్థాపనకు ఇప్పటివరకూ ఎవరైనా పునాదులు వేసినట్లుగానీ, దానికి అనుచరులు ఉన్నట్లు గానీ లేదు. అంతే కాదు, అబ్రహామీ మతానికి సంబంధించి ఎలాంటి మత గ్రంథాలు కూడా అందుబాటులో లేవు.

అలాంటప్పుడు అసలు అబ్రహామీ మతం ఏంటి అనే ప్రశ్న వస్తుంది.

ప్రస్తుతానికి దీనిని మతానికి సంబంధించిన ఒక ప్రాజెక్టుగా భావించవచ్చు. ఈ ప్రాజెక్ట్ కింద గత కొంతకాలంగా ఇస్లాం, క్రిస్టియానిటీ, జుడాయిజం మూడు మతాల్లో ఇమిడి ఉన్న సారాంశాన్ని తీసుకుని ప్రవక్త అబ్రహాం పేరిట ఒక మతాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.

మూడు మతాల్లో భక్తి విశ్వాసాలకు సంబంధించి ఒకేలా ఉన్న అంశాలపై విశ్వసించడం, వాటిని పాటించడంతోపాటూ, పరస్పరం మత విభేదాలను పెంచే ఎలాంటి విషయాలకు తావు ఇవ్వకపోవడం లాంటివి కూడా ఇందులో ఉన్నాయి.

పరస్పర విభేదాలు పట్టించుకోకుండా ప్రజలు, దేశాల మధ్య శాంతి స్థాపన చేయాలనే ఉద్దేశంతో అబ్రహామీ మతం అనే ఆలోచనకు ప్రోత్సాహం కూడా లభిస్తోంది.

అబ్రహమీ

క్రిస్టియానిటీ, జుడాయిజం, ఇస్లాంలను ఒకే మతంలో కలిపేయాలనే..

నిజానికి ఈ మతం గురించి చర్చ దాదాపు ఏడాది క్రితమే మొదలైంది. దీని గురించి అరబ్ దేశాల్లో వివాదాలు రేగడం కూడా కనిపించింది.

అయితే, చాలా మంది అసలు ఇమామ్ ఈ అంశాన్ని ఇప్పుడు ఎందుకు లేవనెత్తారు అని తెలుసుకోడానికి ప్రయత్నిస్తున్నారు.

ఎందుకంటే, ఈ మతం గురించి చాలా మందికి అల్ తయ్యబ్ మాటల ద్వారా ఇప్పుడే మొదటి సారి తెలిసింది.

అల్ అజహర్ షేక్ చేసిన ప్రసంగంలో వివిధ మతాల అనుచరుల మధ్య సహ జీవనం అనే మాట కూడా ఉంది.

ఈజిఫ్ట్‌లోని అలెగ్జాండ్రియా నగరంలో 2011 విప్లవం తర్వాత పోప్ మూడవ షొనౌదా, అల్ అజహర్‌కు చెందిన ఒక ప్రతినిధి బృందం మధ్య చర్చల తర్వాత 'ఈజిఫ్ట్ ఫామిలీ హౌస్' ఏర్పాటు గురించి ఆలోచించారు.

రెండు మతాల మధ్య సహ జీవనం, సహనం గురించి చర్చించడం అనేది ఊహించదగినదే. ఇప్పుడు షేక్ అల్ అజహర్ కూడా ఫామిలీ హౌస్ నుంచి అబ్రహామీ మతాన్ని సమర్థించేవారి గురించి మాట్లాడడం సముచితమేనని చాలా మంది భావిస్తున్నారు.

ఈ మతం గురించి మాట్లాడుతూ "వారు కచ్చితంగా రెండు మతాలు అంటే ఇస్లాం, క్రిస్టియానిటీ మధ్య ఉన్న సోదరభావంలో గందరగోళం సృష్టించడానికి, రెండు మతాలను కలపడంపై వెల్లువెత్తే సందేహాల గురించి మాట్లాడాలని అనుకుంటున్నారు" అని అల్ తయ్యద్ అన్నారు.

"క్రిస్టియానిటీ, జుడాయిజం, ఇస్లాంలను ఒకే మతంలో కలిపేయాలనే కోరికతో పిలుపునిచ్చేవారు వస్తారు, అన్ని చెడుల నుంచి విముక్తి అందిస్తామని చెబుతారు" అని ఆయన అన్నారు.

తయ్యబ్ విమర్శలు

కొత్త అబ్రహామీ మతం పిలుపును అల్ తయ్యబ్ తిరస్కరించారు. వారు మాట్లాడుతున్న ఆ కొత్త మతానికి రంగు, రుచీ, వాసనా ఏవీ లేవని అన్నారు.

అబ్రహామీ మతానికి అనుకూలంగా ప్రచారం చేసే బోధకులు ప్రజల మధ్య పరస్పర వివాదాలు, సంఘర్షణలకు తాము తెర దించుతామని చెబుతారని, కానీ వాస్తవానికి ఆ పిలుపు భక్తి విశ్వాసాలను ఎంచుకునే స్వేచ్ఛను స్వాధీనం చేసుకోవడమేనని ఆయన ఆరోపించారు.

వివిధ మతాలను ఏకం చేయాలనే ఈ పిలుపు నిజానికి ఆ మతం గురించి నిజానికి సరైన అవగాహన పెంపొందించుకోడానికి బదులు ఒక కలత కలిగించే అంశంగా ఆయన వర్ణించారు.

అన్ని మతాల వారినీ ఒకే చోటుకు తీసుకురావడం అసాధ్యం అని ఆయన చెబుతున్నారు.

ఇతర మత విశ్వాసాలను గౌరవించడం అనేది వేరే విషయం, ఆ విశ్వాసాలను పాటించడం అనేది మరో విషయం అంటారు తయ్యబ్.

ప్రశంసలు

అబ్రహామీ మతం గురించి అల్ తయ్యబ్ చెప్పిన దానిని సోషల్ మీడియాలో చాలా మంది ప్రశంసిస్తున్నారు.

వీరిలో అబ్దుల్లా రష్దీ కూడా ఉన్నారు. అల్ తయ్యబ్ అబ్రహాంవాదం ఆలోచనను తయ్యబ్ ప్రాథమిక దశలోనే చంపేశారని ఆయన అన్నారు.

మరికొందరు మాత్రం వివాదాలు, సంఘర్షణలకు ముగింపు పలికే ఈ పిలుపుపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదంటున్నారు.

మతం ముసుగులో రాజకీయాలు

అబ్రహామీ మతం కోసం ఇచ్చిన పిలుపు గురించి మాట్లాడిన అల్ అజహర్ షేక్ తన ప్రసంగంలో దాని వెనుక ఎలాంటి రాజకీయ కోణాన్నీ ప్రస్తావించలేదు.

కానీ, సోషల్ మీడియాలో కొందరు దీనిని మతం ముసుగులో రాజకీయ ఆహ్వానంగా చెబుతూ తిరస్కరించారు.

వీరిలో ఈజిఫ్టులోని కాప్టిక్ మతపెద్ద, హెగోమెన్ సన్యాసి నియామీ కూడా ఉన్నారు. మోసం, దోపిడీ ముసుగులో ఒక రాజకీయ ఆహ్వానంగా వారు అబ్రహామీ మతాన్ని వర్ణించారు.

https://twitter.com/abdullahrushdy/status/1458157914573742090

https://twitter.com/sameh_asker/status/1458321514097479683

కొత్త మతాన్ని తిరస్కరించే వారిలో ఇది సైద్ధాంతికంగా సరైనదేనని భావించేవారు కూడా ఉన్నారు. ముఖ్యంగా, ఇజ్రాయెల్‌తో అరబ్ దేశాల సంబంధాలు సాధారణం కావడం, మెరుగు పరచడమే లక్ష్యంగా వారంతా ఈ మతాన్ని ఒక రాజకీయ శిబిరంలా చూస్తున్నారు.

దీనితో ఇజ్రాయెల్, యూఏఈకి ఏం సంబంధం

పరిస్థితులను సాధారణ స్థితికి తీసుకురావడానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్ గత ఏడాది సెప్టెంబర్‌లో ఇజ్రాయెల్‌తో ఒక ఒప్పందం పై సంతకాలు చేసిన తర్వాత అబ్రహామియా అనే పదం వాడుకలోకి రావడం, దాని చుట్టూ వివాదం మొదలవడం జరిగింది.

అమెరికా అప్పటి అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, ఆయన సలహాదారు జెరేడ్ కుష్నర్ స్పాన్సర్ చేసిన ఈ ఒప్పందాన్ని అబ్రహామీ ఒప్పందం అని అన్నారు.

"మూడు అబ్రహామిక్ మతాలు, మొత్తం మానవాళి మధ్య శాంతిని పెంపొందించడానికి సాంస్కృతిక, మతాంతర చర్చకు మద్దతిచ్చే ప్రయత్నాలను మేం ప్రోత్సహిస్తున్నాం" అని ఈ ఒప్పందంపై అమెరికా విదేశాంగ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Abrahami: A new religion that is causing a stir in Arab countries .. What is it and why
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X