Pakistan: ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ ను అడ్డుకున్న కార్యకర్తలు.. లాహోర్‍లో ఉద్రిక్తత..
పాకిస్థాన్ లోని లాహోర్ లో ఆ దేశ మాజీ ప్రధానిని అరెస్ట్ చేయకుండా కార్యకర్తలు అడ్డుకున్నారు.
పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) పార్టీకి చెందిన వందలాది మంది కార్యకర్తలు లాహోర్‌లోని మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నివాసం వెలుపల ఆయనను అరెస్టు చేయకుండా పోలీసులు అడ్డుకున్నారు. గత ఏడాది ఎన్నికల కమిషన్‌కు వ్యతిరేకంగా నిరసనకు సంబంధించిన కేసులో ఇమ్రాన్ ఖాన్ బెయిల్‌ను పాకిస్తాన్ ఉగ్రవాద వ్యతిరేక కోర్టు బుధవారం రద్దు చేసింది.

PTI కార్యకర్తలు
కోర్టు తీర్పు వెలువరించిన వెంటనే, లాహోర్‌లోని జమాన్ పార్క్ ప్రాంతంలోని ఖాన్ ఇంటి వెలుపల PTI కార్యకర్తలు గుమిగూడడం ప్రారంభించారు. పోలీసులు తమ నాయకుడు ఇమ్రాన్ ఖాన్ ను అరెస్టు చేసేందుకు తరలిస్తున్నారనే వార్తతో కార్యకర్తలు అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఇమ్రాన్ ఖాను అరెస్ట్ చేసేందుక పోలీసులు రావడంతో వారికి వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలు చేశారు.

పార్టీ నిధులు
జెండాలు ఊపుతూ ధర్నాకు దిగారు. పరిస్థితి అదుపు తప్పకుండా ఆ ప్రాంతంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గత ఏడాది అక్టోబర్‌లో పోలీసులు ఇమ్రాన్ ఖాన్ పై ఉగ్రవాద నిరోధక చట్టాల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో మాజీ ప్రధాని మధ్యంతర బెయిల్‌పై ఉన్నారు. పార్టీ నిధుల వివరాలను దాచిపెట్టినందుకు ఖాన్‌ను అనర్హులుగా ప్రకటించడంతో, ECP దగ్గర సహా దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని PTI నాయకత్వం పార్టీ కార్యకర్తలను కోరింది.

క్షీణిస్తున్న ఆర్థిక పరిస్థితి
మరో వైపు పాకిస్థాన్ ఆర్థికంగా రోజు రోజుకు దిగజారుతోంది. మరో వైపు పాక్ పెట్రోల్ రేటు భారీగా పెరిగింది. ట్రోల్ లీటర్‌కు 22 పాక్ రూపాయలు పెంచుతున్నట్లు ఆ దేశ ఆర్థికశాఖ విభాగం ఒక ప్రకటన విడుదలచేసింది. బుధవారం అర్ధరాత్రి అమల్లోకి వచ్చిన కొత్త ధరల ప్రకారం పాక్‌లో ఒక లీటర్ పెట్రోల్ ధర 272 పాక్ రూపాయలకు చేరింది. మరోవైపు కీలకమైన బెయిలౌట్ ప్యాకేజీని విడుదల చేయడం కోసం అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF)తో ఒప్పందం కుదుర్చుకోవడానికి పాకిస్తాన్ ప్రభుత్వం తన వంతు ప్రయత్నం చేస్తోంది.
-
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!!












Click it and Unblock the Notifications