చంపాలని చూస్తున్నారు: ప్లేన్‌లో నటి వింత ప్రవర్తన
లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ నటి సెమ్లా బ్లెయిర్ విమానంలో హడావుడి చేసింది. విమానంలో విచిత్రంగా ప్రవర్తించి అందులోని వారందరినీ కంగారు పెట్టింది. తన నాలుగేళ్ల కొడుకుతో కలిసి డెల్టా విమానంలో మెక్సికో నుంచి లాస్ ఏంజిల్స్ బయలుదేరిన ఆమె వైన్‌లో ఏవో మందులు కలుపుకొని తాగింది.
అనంతరం, అతను కొడుతున్నాడని, తిననీయకుండా, తాగకుండా అడ్డుకుంటున్నాడని, నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నాడని గట్టిగా కేకలు వేసింది. ఆమె అలా ఎందుకు ప్రవర్తించారో తెలియక విమాన సిబ్బంది, ప్రయాణీకులు ఆశ్చర్యపోయారు.

లాస్ ఏంజిల్స్‌లో ఆమె విమానం దిగిన తర్వాత స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆమె ఏ మందులు కలుపుకొని తాగిందో తెలుసుకునేందుకు ఆమె బ్యాగును వెదికారు. ఆమె రుగ్మతతో బాధపడుతుండవచ్చునని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.












Click it and Unblock the Notifications