వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్ ప్రధానికి అఫ్గాన్ ప్రధాని షాక్: ఫోన్‌లో మాట్లాడేందుకు నిరాకరణ, మోడీకి ఓకే

|
Google Oneindia TeluguNews

కాబూల్‌: పాకిస్థాన్‌ ప్రధాని షాహిద్‌ అబ్బాసీకి ఆఫ్ఘనిస్థాన్ ప్రధాని అష్రాఫ్ ఘనీ షాకిచ్చారు. అబ్బాసీతో ఫోన్లో మాట్లాడేందుకు అఫ్గానిస్థాన్‌ అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీ తిరస్కరించారు. వరుస ఉగ్రదాడులతో ఆ దేశం అతలాకుతలం అవుతున్న నేపథ్యంలో తన సంతాపాన్ని తెలిపేందుకు మంగళవారం రాత్రి అబ్బాసీ ఫోన్‌ చేయగా అష్రఫ్‌ తిరస్కరించారని ఆ దేశ మీడియా వెల్లడించింది.

ఇటీవల అఫ్గానిస్థాన్‌లో జరిగిన వరుస ఉగ్రదాడుల్లో సుమారు 150 మంది చనిపోయారు. వందల సంఖ్యలో పౌరులు గాయాలపాలయ్యారు. తమ దేశంలో ఉగ్రవాద గ్రూపులకు పాకిస్థాన్‌ వెన్నుదన్నుగా నిలుస్తోందని అఫ్గాన్‌ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.

Afghan President speaks to Modi, not to Pakistan PM

ఈ మేరకు ఇటీవల జరిగిన దాడులకు సంబంధించిన సాక్ష్యాలను ఆ దేశం సేకరించిందని, వాటిని పాక్‌ ఆర్మీతో పంచుకునేందుకు కొంతమంది ప్రతినిధులను పంపిందని ఆ దేశ మీడియా పేర్కొంది.

ఇది ఇలా ఉంటే, భారత ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేయగా ఆఫ్ఘనిస్థాన్ ప్రధాని అష్రాఫ్ ఘనీ మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ.. ఆఫ్ఘనిస్థాన్ దాడులను ఖండించారు. మృతులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అఫ్ఘాన్‌కు అండగా ఉంటామని తెలిపారు.

English summary
Afghan President Ashraf Ghani on Wednesday refused to take a call from Pakistan Prime Minister Shahid Khaqan Abbasi but discussed the "need for an end to terrorist sanctuaries" with Indian Prime Minister Narendra Modi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X