Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

షాకింగ్ : తాలిబన్లతో స్నేహానికి సిద్ధమన్న చైనా, ఆఫ్ఘనిస్థాన్ పునర్నిర్మాణంలోనూ ; బుద్ధి బయటపడిందిగా !!

ఆఫ్ఘనిస్థాన్ ను తాలిబన్లు వశం చేసుకున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆఫ్ఘనిస్తాన్ పై ఆసక్తి నెలకొంది. ఎవరూ ఊహించని రీతిలో కాబూల్ ను హస్తగతం చేసుకున్న తాలిబన్లకు పాకిస్తాన్, రష్యా, చైనా దేశాలు మద్దతు ఇస్తున్నాయని గత కొంతకాలంగా ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఇక చర్చకు ఊతం ఇస్తూ కీలక పరిణామం చోటు చేసుకుంది. డ్రాగన్ కంట్రీ చైనా తాలిబన్లతో స్నేహ సంబంధాలు కొనసాగిస్తామని షాకింగ్ వ్యాఖ్యలు చేసింది.

Recommended Video

    Imran Khan Supports Taliban, Afghanistan plunges Into Chaos | Oneindia Telugu
    ఆఫ్ఘనిస్తాన్‌తో స్నేహపూర్వక సంబంధాలను బలోపేతం చేస్తామన్న చైనా

    ఆఫ్ఘనిస్తాన్‌తో స్నేహపూర్వక సంబంధాలను బలోపేతం చేస్తామన్న చైనా

    ఆఫ్ఘనిస్తాన్‌తో స్నేహపూర్వక, సహకార సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి చైనా సిద్ధంగా ఉందని ప్రభుత్వ ప్రతినిధి సోమవారం చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్ నుండి అమెరికా సైన్యం వైదొలగడంతో తాలిబన్లతో అనధికారిక సంబంధాలను కొనసాగించడానికి బీజింగ్ ప్రయత్నించింది. ఆఫ్ఘనిస్తాన్ తో స్నేహానికి సిద్ధమంటున్న డ్రాగన్ కంట్రీ ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని హస్తగతం చేసుకున్న తాలిబన్లతో తాము స్నేహపూర్వక సంబంధాలను కొనసాగిస్తామని వెల్లడించింది.

    తాలిబన్ల చర్యను చాలా దేశాలు వ్యతిరేకిస్తున్నా చైనా మాత్రం మద్దతు

    తాలిబన్ల చర్యను చాలా దేశాలు వ్యతిరేకిస్తున్నా చైనా మాత్రం మద్దతు


    ఆఫ్ఘనిస్తాన్ దేశ భవిష్యత్తుపై అక్కడ మహిళలు, మైనారిటీల రక్షణపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న సమయంలో, బ్రిటన్ ప్రధాని తాలిబన్ల ప్రభుత్వాన్ని ఎవరు గుర్తించకూడదని తాజాగా తమ ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఇక చాలావరకూ ప్రజాస్వామ్య దేశాలన్నీ తాలిబన్ల కబంధహస్తాల నుండి ఆఫ్ఘనిస్తాన్ పౌరులను కాపాడటం కోసం, పౌర హక్కులను రక్షించడం కోసం యునైటెడ్ నేషన్స్ రంగంలోకి దిగాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. తాలిబన్ల చర్యను ముక్త కంఠంతో ఖండిస్తున్నాయి. కానీ మొదటి నుండి తాలిబన్లకు మద్దతునిస్తున్న పాకిస్తాన్, పాక్ మిత్ర దేశంగా ఉన్న చైనా స్పందన ప్రపంచ వ్యాప్త ఆసక్తికి కారణం అయింది.

    ఆఫ్ఘనిస్తాన్ పునర్నిర్మాణం కోసం చైనా ఆర్థిక మద్దతు, ప్రతిగా తాలిబన్ల వాగ్దానం

    ఆఫ్ఘనిస్తాన్ పునర్నిర్మాణం కోసం చైనా ఆర్థిక మద్దతు, ప్రతిగా తాలిబన్ల వాగ్దానం


    ఇక చైనావిషయానికి వస్తే ఆఫ్ఘనిస్తాన్‌తో 76-కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంది చైనా . జింజియాంగ్‌లోని ముస్లిం మైనారిటీ ఉయ్ఘుర్ వేర్పాటువాదులకు ఆఫ్ఘనిస్తాన్ ఒక వేదికగా మారుతుందని బీజింగ్ చాలాకాలంగా భయపడుతోంది. అయితే ఆఫ్ఘనిస్థాన్ ఉగ్రవాదుల స్థావరంగా ఉపయోగించబడదని వాగ్దానం చేస్తూ అత్యున్నత స్థాయి తాలిబన్ ప్రతినిధి బృందం గత నెలలో టియాంజిన్‌లో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యిని కలిసింది. బదులుగా, ఆఫ్ఘనిస్తాన్ పునర్నిర్మాణం కోసం చైనా ఆర్థిక మద్దతు ఇస్తూ పెట్టుబడిని అందించింది.

    ఆఫ్ఘన్ పాలన, అభివృద్దిలో తాలిబన్లకు మద్దతుగా చైనా

    ఆఫ్ఘన్ పాలన, అభివృద్దిలో తాలిబన్లకు మద్దతుగా చైనా

    పెద్ద శక్తులు తమ భౌగోళిక-వ్యూహాత్మక ప్రాముఖ్యత కోసం తరతరాలుగా కోరుకునే దేశమైన ఆఫ్ఘనిస్తాన్‌తో సంబంధాలను మరింత పెంచుకునే అవకాశాన్ని చైనా స్వాగతించిందని సోమవారం తెలిపింది. తాలిబన్లు చైనాతో సత్సంబంధాలను పెంపొందించుకోవాలని తమ ఆశను పదేపదే వ్యక్తం చేశారు . ఆఫ్ఘనిస్తాన్ పునర్నిర్మాణం, అభివృద్ధిలో చైనా భాగస్వామ్యం కోసం వారు ఎదురుచూస్తున్నారు అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి హువా చున్యింగ్ విలేకరులతో అన్నారు. మేము దీనిని స్వాగతిస్తున్నాము. ఆఫ్ఘన్ ప్రజలు తమ గమ్యాన్ని స్వతంత్రంగా నిర్ణయించే హక్కును చైనా గౌరవిస్తుందని వెల్లడించారు. అధికారం సజావుగా పరివర్తన చెందడానికి తాలిబన్లకు హువా పిలుపునిచ్చారు.

     కాబూల్‌లోని చైనా రాయబార కార్యాలయం పనిచేస్తోందని వెల్లడి

    కాబూల్‌లోని చైనా రాయబార కార్యాలయం పనిచేస్తోందని వెల్లడి

    బహిరంగ, సమగ్రమైన ఇస్లామిక్ ప్రభుత్వాన్ని స్థాపించడానికి , ఆఫ్ఘన్ మరియు విదేశీ పౌరుల భద్రతకు భరోసా ఇస్తానని హామీ ఇచ్చారు. భద్రతా పరిస్థితి క్షీణిస్తున్న నేపథ్యంలో నెలరోజుల క్రితం బీజింగ్ ఆఫ్ఘనిస్తాన్ నుండి చైనా పౌరులను తరలించడం ప్రారంభించినప్పటికీ, కాబూల్‌లోని చైనా రాయబార కార్యాలయం పనిచేస్తోందని హువా చెప్పారు. సోమవారం ఒక ప్రకటనలో, రాయబార కార్యాలయం ఆఫ్ఘనిస్తాన్‌లో ఉంటున్న చైనా పౌరులను భద్రతపై దృష్టి సారించాలని, పరిస్థితులు చక్కబడే వరకు ఇళ్లలోనే ఉండాలని సూచించింది.

    వక్ర బుద్ధి చూపించిన చైనా .. తాలిబన్లతో దోస్తీ

    వక్ర బుద్ధి చూపించిన చైనా .. తాలిబన్లతో దోస్తీ

    రెండు దశాబ్దాల యుద్ధానికి ముగింపు పలుకుతూ సెప్టెంబర్ 11 నాటికి అమెరికా సైన్యాన్ని పూర్తిగా ఉపసంహరించుకుంటామని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ తీసుకున్న నిర్ణయంతో ఆఫ్ఘన్ ప్రభుత్వం వేగంగా కూలిపోవడం చూసి యూఎస్ ప్రభుత్వం షాక్ కు గురైంది. తాలిబాన్ల భారీ పురోగతితో వాషింగ్టన్ దిగ్భ్రాంతికి గురైంది. ఆఫ్ఘన్ లు భయపడవద్దని, అమెరికా సంకీర్ణ కూటమికి మద్దతు ఇచ్చిన వారిపై ప్రతీకారం తీర్చుకోబోమని కూడా తాలిబన్ అంతర్జాతీయ సమాజానికి భరోసా ఇచ్చింది. అయినప్పటికీ ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్ల పాలన ఆందోళన కలిగిస్తుంది. ఇక వీరితో స్నేహ సంబంధాలను కొనసాగిస్తామని చెప్పిన చైనా తన వక్ర బుద్ధిని చూపించింది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+