వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Afghanistan: తాలిబన్లకు కరెక్టు మొగుడు ఆయనే: గుండె బరువెక్కుతోందంటోన్న జార్జ్ బుష్

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ఆఫ్ఘనిస్తాన్‌లో తలెత్తిన తాజా పరిణామాలు ప్రపంచ దేశాలను తీవ్ర ఆందోళనలోకి నెట్టేశాయి. గందరగోళానికి దారి తీస్తోన్నాయి. తమ విదేశీ విధానాలను పునఃసమీక్షించుకునేలా చేస్తోన్నాయి. ఉగ్రవాదంపై సమష్టిగా పోరాడటానికి ఇప్పటి నుంచే ఓ ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాల్సిన అవసరం ఉందనే విషయాలను గుర్తు చేస్తోన్నాయి. ఈ క్రమంలోనే ఐక్యరాజ్య సమితి భద్రత మండలి సమావేశం కానుంది. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం వేదికగా..ఈ సమావేశానికి విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ సారథ్యం వహించనున్నారు.

Afghanistan: రంగంలో దిగిన ట్రబుల్ షూటర్ అజిత్ దోవల్: ప్రయారిటీ అదే: అమెరికాకు ఫోన్ కాల్Afghanistan: రంగంలో దిగిన ట్రబుల్ షూటర్ అజిత్ దోవల్: ప్రయారిటీ అదే: అమెరికాకు ఫోన్ కాల్

జో బిడెన్ వ్యాఖ్యల దుమారం..

జో బిడెన్ వ్యాఖ్యల దుమారం..

ఆఫ్ఘన్ తాజా పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారాన్ని రేపుతోన్నాయి. ఆ దేశం నుంచి సైనిక బలగాలను ఉపసంహరించుకోవడాన్ని సమర్థించుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వాధినేతలను ఆయన తప్పు పట్టారు. 20 సంవత్సరాల తరువాత కూడా ఆ దేశాధినేతలు సైనికపరంగా బలోపేతం కాలేకపోయారంటూ వ్యాఖ్యానించారు. అదే సమయంలో అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్ కూడా ఆప్ఘనిస్తాన్‌లో నెలకొన్న సంక్షోభ పరిస్థితులపై స్పందించారు.

 తాలిబన్లకు గుండెదడ..

తాలిబన్లకు గుండెదడ..

జార్జ్ బుష్.. తాలిబన్లకు అమెరికా దెబ్బ రుచి చూపించిన నేత. న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై విమానాలతో దాడికి పాల్పడిన అల్-ఖైదా ఉగ్రవాద సంస్థకు షెల్టర్ ఇచ్చారనే కారణంతో- తాలిబన్లపై విరుచుకు పడ్డారాయన. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల పరిపాలనను అంతమొందించాడు. వారిని అజ్ఙాతంలోకి పంపించేశారు. ఉనికి లేకుండా చేశారు. మళ్లీ తాలిబన్ల సమస్య తల ఎత్తకుండా ఉండేలా కఠిన చర్యలను తీసుకున్నారు. వేల మంది సైన్యాన్ని ఆప్ఘనిస్తాన్‌లో మోహరింపజేశారు.

జార్జ్ బుష్.. కఠిన చర్యల వల్లే

జార్జ్ బుష్.. కఠిన చర్యల వల్లే

జార్జ్ బుష్ తీసుకున్న చర్యల వల్లే ఇప్పటిదాకా కూడా తాలిబన్ల పేరు కూడా వినిపించకుండా పోయింది. తాజాగా- ఆ దేశం నుంచి అమెరికా తన సైన్యాన్ని ఉపసంహరించుకోవడంతో వాళ్లు మళ్లీ పేట్రేగిపోయారు. జవసత్వాలను అందిపుచ్చుకున్నారు. ఏకంగా దేశాన్నే ఆక్రమించుకున్నారు. అమెరికా తన సైనిక బలగాలను ఉపసంహరించుకున్న అతి కొద్దిరోజుల్లోనే ఈ పరిణామాలు సంభవించాయి ఆప్ఘనిస్తాన్‌లో. ఒకరకంగా జార్జ్ బుష్ పేరు వింటే తాలిబన్లకు దడపుడుతుంది.

Recommended Video

Who Are Talibans | Afghanistan a Graveyard of Superpowers | Oneindia Telugu
తెరమీదికొచ్చిన జార్జ్ బుష్

తెరమీదికొచ్చిన జార్జ్ బుష్

ఈ సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో- జార్జ్ బుష్ తెరమీదికి వచ్చారు. ఆప్ఘన్ పరిణామాలపై స్పందించారు. భార్య లారా బుష్‌తో కలిసి ఓ ప్రకటన విడుదల చేశారు. తన పదవీకాలం ముగిసిన తరువాత జార్జ్ బుష్.. డల్లాస్‌లో నివసిస్తోన్నారు. అక్కడి నుంచే ఈ ప్రకటన స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఆప్ఘన్ సంక్షోభం తనను కలిచి వేస్తోందని వ్యాఖ్యానించారు. అక్కడి వార్తలు తెలుసుకుంటూ ఉంటే గుండె బరువెక్కుతోందని వ్యాఖ్యానించారు.

ఉగ్రవాదానికి అవకాశం ఇవ్వొద్దు..

ఆప్ఘనిస్తాన్ పౌరులతో పాటు.. ఇన్ని సంవత్సరాలుగా ఆ దేశం కోసం అమెరికా సైనిక బలగాలు, నాటో సంకీర్ణ దళాలు చేసిన త్యాగాలు, సేవలు వృధా అయ్యాయని పేర్కొన్నారు. ఆప్ఘనిస్తాన్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోయే వారు.. దేశం పట్ల, దేశ ప్రజల పట్ల బాధ్యతాయుతంగా మెలగాల్సి ఉంటుందని హితబోధ చేశారు. ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ఆఫ్ఘనిస్తాన్ ప్రజల సంక్షేమం కోసం తోటి అమెరికన్లతో కలిసి తాను కూడా ప్రార్థనలు చేస్తానని అన్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఉగ్రవాదానికి బీజం పడకుండా బాధ్యతగా మసలు కోవాలని తాను ఆఫ్ఘన్‌లో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే వారిని కోరుతున్నానని చెప్పారు. ఉగ్రవాదానికి బదులుగా 65 శాతం వరకు ఉన్న యువత కోసం పని చేయాలని, ప్రజలకు ప్రాథమిక సౌకర్యాలను కల్పించాలని అన్నారు.

English summary
former US President George Bush expresses his concern over the situation on Afghanistan crisis in a statement. Bush and former First Lady Laura Bush said that the statement, Our hearts are heavy for Afghan people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X