వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తాలిబన్ల ఘన విజయం: కాబూల్ వశం -అఫ్గాన్‌లో ప్రభుత్వ ఏర్పాటు -ఘని రాజీనామా -కొత్త అధ్యక్షుడు బరాదర్

|
Google Oneindia TeluguNews

హిస్టరీ రిపీట్స్ అనే నానుడిని మరోసారి నిజం చేస్తూ దక్షిణాసియా దేశం అఫ్గానిస్థాన్ మళ్లీ తాలిబన్ ముష్కరులు చేతుల్లోకి వెళ్లిపోయింది. అమెరికా, నాటో దళాల నిష్క్రమణ తర్వాత దేశాన్ని ఆక్రమించుకునేందుకు వేలాది మంది తాలిబన్లు సాగించిన ప్రయత్నం ఎట్టకేలకు విజయవంతమైంది. ఒక్కొక్క రాష్ట్రాన్నీ స్వాధీనం చేసుకుంటూ తాలిబన్ సేనలు ఆదివారం తెల్లవారుజాము నాటికి రాజధాని కాబూల్ చేరగా.. హైడ్రామా నడుమ సాగిన శాంతి చర్చల్లో అధికార మార్పిడికి అంగీకారం కుదిరింది. ఆ వెంటనే అష్రఫ్ ఘని అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం, ముల్లా బరాదర్ కొత్త అధ్యక్షుడు కావడం చకాచకా జరిగిపోయాయి. తద్వారా తాలిబన్లు ఘన విజయం సాధించినట్లయింది. వివరాలివి..

మరో లక్ష కోట్ల అప్పుకు జగన్ పథకం -అందుకే ఎయిడెడ్ జీవో -2ఏళ్లలో కట్టింది 5ఇళ్లు: ఎంపీ రఘురామ బాంబుమరో లక్ష కోట్ల అప్పుకు జగన్ పథకం -అందుకే ఎయిడెడ్ జీవో -2ఏళ్లలో కట్టింది 5ఇళ్లు: ఎంపీ రఘురామ బాంబు

ఆఫ్గాన్ పతనంలో ఆఖరి క్షణాలు..

ఆఫ్గాన్ పతనంలో ఆఖరి క్షణాలు..

అమెరికా సహా పాశ్చాత్య దేశాల ప్రమేయం లేకుండా తమను తామే పరిపాలించుకోవాలనే లక్ష్యంతో ''ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ అఫ్గానిస్థాన్'' స్థాపనే ధ్యేయంగా పుట్టుకొచ్చిన తాలిబన్లు దశాబ్దాల ఆటుపోటుల తర్వాత అఫ్గానిస్థాన్ లో మళ్లీ అధికారం కైవసం చేసుకున్నారు. రాజధాని కాబూల్ నగరంలో ఆదివారం జరిగిన నాటకీయ పరిణామాలతో పాలనా పగ్గాలు తాలిబన్ల చేతుల్లోకి వెళ్లాయి. వేలాది మంది తాలిబన్లు భారీ ఆయుధాలతో సైన్యం మాదిరిగా కదులుతూ ఒక్కో రాష్ట్రాన్ని కైవసం చేసుకున్నారు. అఫ్గాన్ లో మొత్తం 34 ప్రావిన్స్(రాష్ట్రాలు) ఉండగా, ఇప్పటికే అన్నిటినీ స్వాధీనం చేసుకున్న తాలిబన్లు.. శనివారం రాత్రి కీలకమైన జలాలాబాద్ పై పట్టు బిగించి, ఆదివారం తెల్లవారేసరికి రాజధాని కాబూల్ సిటీని అన్ని వైపులా చుట్టు ముట్టారు. అఫ్గాన్ సర్కారు పతం ఆఖరి నిమిషాల్లో..

మరో లక్ష కోట్ల అప్పుకు జగన్ పథకం -అందుకే ఎయిడెడ్ జీవో -2ఏళ్లలో కట్టింది 5ఇళ్లు: ఎంపీ రఘురామ బాంబుమరో లక్ష కోట్ల అప్పుకు జగన్ పథకం -అందుకే ఎయిడెడ్ జీవో -2ఏళ్లలో కట్టింది 5ఇళ్లు: ఎంపీ రఘురామ బాంబు

అష్రఫ్ ఘని రాజీనామా..

అష్రఫ్ ఘని రాజీనామా..

కాబూల్ నగరాన్ని చుట్టుముట్టిన తాలిబన్ సైన్యాలు ఏ క్షణమైనా యుద్ధభేరి మోగించి, రాజధానిని ఆక్రమించుకుంటాయనే వార్తల నడుమ నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. కాబూల్ సిటీపై దాడి జరగబోదని, శాంతియుతంగా అధికార మార్పిడికి సిద్ధంగా ఉన్నామని అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి ప్రకటించారు. ఆ వెంటనే తాలిబన్ మధ్యవర్తుల బృందం ఒకటి అధ్యక్షభవనంలో చర్చలకు వెళ్లింది. రెండు మూడు గంటల చర్చల అనంతరం.. అఫ్గాన్ అధ్యక్ష పదవికి అష్రఫ్ ఘని రాజీనామా చేసినట్లు ప్రకటన వెలువడింది. అదే సమయంలో అధికార పగ్గాలను తాలిబన్ నేతలకు అప్పగిస్తున్నట్లూ వెల్లడైంది..

అఫ్గాన్ కొత్త అధ్యక్షుడు బరాదర్

అఫ్గాన్ కొత్త అధ్యక్షుడు బరాదర్

శనివారం నాటి ప్రసంగంలో అధ్యక్షుడు ఘని సైనిక సమీకరణపై మాట్లాడటంతో తాలిబన్లు ప్రవేశించే సమయంలో కాబూల్ నగరంలో రక్తపాతం తప్పదనే అంచానలు పెరిగాయి. కానీ అందుకు భిన్నంగా ఆయన ఎలాంటి ప్రతిఘటన లేకుండానే లొంగిపోయారు. ఘని రాజీనామాతో పరిపాలన పగ్గాలు తాలిబన్ల చేతుల్లోకి వెళ్లాయి. ప్రస్తుతం తాలిబన్లు తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పనిలో బిజీ అయ్యారు. ఈ మేరకు కొత్త అధ్యక్షుడిగా తాలిబన్ల సీనియర్ నేత ముల్లా అబ్దుల్ ఘని బరాదర్ ను ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బరాదర్ బాధ్యతలు చేపట్టడంతో అఫ్గాన్ లో తాలిబన్లకు సంబంధించి నూతన శకం మొదలయినట్లవుతుంది..

ముల్లా ఒమర్‌ కుడి బుజం బరాదర్

ముల్లా ఒమర్‌ కుడి బుజం బరాదర్

అష్రఫ్ ఘని రాజీనామాతో పూర్తిగా తాలిబన్ల వశమైపోయిన అఫ్గానిస్థాన్ కు కొత్త అధ్యక్షుడిగా ముల్లా అబ్దుల్ ఘని బరాదర్ నియమితుడయ్యాడు. తాలిబన్ వ్యవస్థాపకుడు ముల్లా మొహ్మద్ ఒమర్ కు అత్యంత ఆప్తుడిగా పేరుపొందిన బరాదర్.. అధికారికంగా సంస్థ సహ వ్యవస్థాపకుడు కూడా. ప్రస్తుతం తాలిబన్ల రాజకీయ వ్యూహాలకు ఇంచార్జిగా ఉన్న ఆయన.. అధికార మార్పిడికి సంబంధించి పలు అంతర్జాతీయ వేదికలపై జరిగిన చర్చల్లోనూ ప్రాతినిధ్యం వహించాడు. ''ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ అఫ్గానిస్థాన్'' తమ ధ్వేయమని, పాశ్చాత్య శక్తులు అఫ్గాన్ ను విడిచివెళ్లాలని బలంగా వాదించారాయన. నిజానికి తాలిబన్ అధ్యక్ష పదవి ముల్లా ఒమర్ కొడుకైన మొహ్మద్ యాకూబ్ కు దక్కాల్సి ఉన్నా, అతని వయసు మూడు పదులే కావడం, యుద్ద క్షేత్రంలో అనుభవ లేమి తదితర కారణాలతో బరాదర్ కు సంపూర్ణ మద్దతుగా నిలిచాడు. బరాదర్ గతంలో ఓసారి పాకిస్తాన్ లోని కరాచీలో భద్రతా బలగాలకు పట్టుపడి, కొన్నాళ్లు జైలులోనూ ఉండి ఆ తర్వాత విడుదలై మళ్లీ అఫ్గాన్ వెళ్లిపోయాడు.

ప్రతీకారాలు ఉండబోవన్న తాలిబన్లు..

ప్రతీకారాలు ఉండబోవన్న తాలిబన్లు..


అమెరికా ఇంటెలిజెన్స్ ఊహించినట్లు 90 రోజుల్లో కాకుండా కేవలం కొద్ది రోజుల్లోనే తాలిబన్లు కాబూల్ నగరాన్ని కైవసం చేసుకోవడం గమనార్హం. తాలిబన్లు కాబూల్ సరిహద్దులకు చేరే నాటికే అమెరికా, బ్రిటన్ సహా పలు దేశాలు తమ రాయబార కార్యాలయాలను మూసేసి, సిబ్బందిని హెలికాప్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. ఇప్పటికీ మూడు నాలుగు వేల మంది సైనికులు అఫ్గాన్ గడ్డపై ఉన్నారు. ఇటు ఘని నిష్క్రమణతో ఆయన పార్టీకి సహకరించిన అధికారులు, మందీమాగధులపై తాలిబన్లు దాడులకు పాల్పడొచ్చనే, ఊచకోతలు ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో తాము ప్రతీకారాల గురించి ఆలోచించడం లేదని తాలిబన్ అధికార ప్రతినిధులు చెప్పారు. అంతర్జాతీయంగా తమ ప్రభుత్వానికి మద్దతు కూడగట్టుకోవడమే తాలిబన్ తాత్కాలిక ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని వారు చెబుతున్నారు. కాగా,

Recommended Video

Afghanistan VS PAK VS IND: U.S. Forces Out Of Afghanistan | Oneindia Telugu
తాలిబన్ల ఘనవిజయం.. భారత్‌కు తిప్పలు

తాలిబన్ల ఘనవిజయం.. భారత్‌కు తిప్పలు

2001లో 9/11 దాడుల తర్వాత అల్ ఖాయిదాను దానికి బాస్ బిన్ లాడెన్ ను అంతం చేయడానికి అమెరికా యుద్ధం ప్రకటించే సమయానికి అఫ్గానిస్థాన్ లో సగం కంటే తక్కువ భాగమే తాలిబన్ల చేతుల్లో ఉండేది. అమెరికా, నాటో దళాలు 20 ఏళ్ల పాటు సాగించిన యుద్ధంతో తాలిబన్లు అంతకంతకూ బలపడుతూ, 2016నాటికే దేశం మొత్తం వ్యాపించారు. ప్రస్తుతం అమెరికా సేనల నిష్క్రమణ తర్వాత గతంలో తమకు పట్టులేని ప్రాంతాలను, ఇతర గ్రూపుల నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదుర్కొన్న ఏరియాల్లో సైతం తాలిబన్ల జెండాలు ఎగరడం గమనార్హం. ఆడవాళ్ల దుస్తులు, చదువులపై ఆంక్షలతో పాపులరైన తాలిబన్లు, గడిచిన 20 ఏళ్లలో రాజకీయంగా, సమాజికంగా మరింత బలపడుతూ అఫ్గాన్ పై ఇప్పుడు పూర్తి పట్టు సాధించారు. ఈ పరిణామం పొరుగున ఉన్న భారత్ కు ఇబ్బందికరంగా మారొచ్చనే విశ్లేషణలున్నాయి. తాలిబన్ సర్కారును గుర్తించబోమని భారత్ ఇదివరకే స్పష్టం చేయగా, వ్యాపార ప్రయోజనాల రీత్యా పాకిస్తాన్ ను లోబర్చుకున్నట్లే తాలిబన్లను సైతం చైనా ఆదరించే అవకాశముంది. అప్పుడు భారత్ కు మరిన్ని తిప్పలు తప్పకపోవచ్చు.

English summary
Taliban commander Mullah Abdul Ghani Baradar will become the new President of Afghanistan as Ashraf Ghani has reportedly stepped down from the post. Meanwhile, the Taliban fighters have been ordered to wait at the gates of Kabul and not enter the city, an insurgent spokesman said, after the complete collapse of the country's security forces. Kabul won’t be attacked, power transition to happen ‘peacefully’, says Acting Interior Minister
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X