తాలిబన్లలో ముసలం: వాళ్లల్లో వాళ్లే రక్తం వచ్చేలా కొట్టుకుంటున్నారుగా

కాబుల్: ఇస్లామిక్ కంట్రీ ఆప్ఘనిస్తాన్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సమాయాత్తమౌతోన్న తాలిబన్లలో ముసలం పుట్టింది. అంతర్యుద్ధం మొదలైంది. వారిలో వారే కొట్టుకుంటున్నట్లు వార్తలొస్తున్నాయి. పదవుల పంపకాలకు సంబంధించిన సమాచారం వెలువడిన తరువాత వారిలో వారికి గొడవలు మొదలయ్యాయని, తాలిబన్ అగ్ర నాయకత్వం రెండుగా చీలిపోయిందని తెలుస్తోంది. పదవుల పంపకాల్లో ఏర్పడిన అసంతృప్తి ఈ ఘర్షణలకు కారణమైనట్లు విదేశీ మీడియా కథనాలను ప్రచురించింది.

పదవుల పంపకాల్లో తనకు ప్రాధాన్యత దక్కకపోవడం వల్లే అబ్దుల్ ఘనీ బరాదర్.. రాజధాని కాబుల్‌ను వీడి వెళ్లిపోయాడని, కాందహార్‌లో నివసిస్తున్నాడని సమాచారం. కాందహార్‌లో హక్కానీ నెట్‌వర్క్ చీఫ్ సిరాజుద్దీన్ హక్కానీ-అబ్దుల్ ఘనీ బరాదర్ మధ్య పెద్ద ఎత్తున గొడవలు చోటు చేసుకున్నాయని తెలుస్తోంది ఈ సందర్భంగా సిరాజుద్దీన్ హక్కానీ, ఖలీల్-వుర్-రెహ్మాన్ హక్కానీ-బరాదర్‌ను తీవ్రంగా కొట్టాడని విదేశీ మీడియా అంచనా వేస్తోంది.

Afghanistan: Major clash between Taliban leaders after they set up a new government: Report

ఈ కారణంతోనే బరాదర్ మరణించినట్లు వార్తలు సైతం వెలువడ్డాయి. దీన్ని తోసిపుచ్చుతూ- బరదార్ ఓ సెల్ఫీ వీడియోను మీడియాకు విడుదల చేశాడు. బరాదర్‌ను దాదాపుగా తాలిబన్ అగ్ర నాయకత్వం బహిష్కించినట్లు చెబుతున్నారు. అమెరికా తన సైనిక బలగాలను ఉపసంహరించుకోవడం మొదలు పెట్టిన అతి కొద్దిరోజుల్లోనే తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌ను ఆక్రమించుకున్న విషయం తెలిసిందే. సైనిక బలగాల తరలింపు కూడా పూర్తికాక ముందే- వారు రాజధాని కాబుల్‌ను సైతం తమ గుప్పిట్లోకి తెచ్చుకున్నారు.

ఇంత మెరుపువేగంతో ఆఫ్ఘనిస్తాన్‌ను ఆక్రమించుకోవడంలో తాలిబన్ టాప్ క్యాడర్ నాయకులు పన్నిన పక్కా వ్యూహాలు, వేసిన ప్లానింగ్, దాన్ని అంతే పకడ్బందీగా అమలు చేయడం అమెరికాను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. శరవేగంతో ఆప్ఘనిస్తాన్‌ను ఆక్రమించుకున్న ఘనత తనదేనంటూ అబ్దుల్ ఘనీ బరాదర్ ప్రకటించుకోవడాన్ని ఇతర టాప్ క్యాడర్ నాయకులు జీర్ణించుకోలేకపోయారని అంటున్నారు. ఈ కారణంతోనే తనను ఆప్ఘనిస్తాన్ అధ్యక్ష పదవి లేదా ప్రధానమంత్రి హోదాను కోరుకోగా.. అంగీకరించలేదని చెబుతున్నారు.

కొత్తగా ఏర్పాటు కానున్న తాలిబన్ ప్రభుత్వానికి ఆఫ్ఘనిస్తాన్‌లో ముల్లా మహ్మద్ హసన్ అఖుంద్ ప్రధానమంత్రిగా నియమితులయ్యారు. ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్, మౌల్వీ హనాఫీలు డిప్యూటీ ప్రధాన మంత్రులుగా అపాయింట్ అయ్యారు. ప్రభుత్వ కూర్పు, అధికారాల పంపిణీల విషంయలో తాలిబన్లు-హక్కానీ గ్రూప్ మధ్య తీవ్రమైన విభేధాలు తలెత్తాయి. అబ్దుల్ ఘనీ బరాదర్ ప్రభుత్వాధినేతగా హక్కానీ గ్రూప్ వ్యతిరేకించింది.

ఆఫ్ఘనిస్తాన్ కొత్త ప్రధానిగా ఎంపికైన ముల్లా మహమ్మద్ హసన్ అఖుంద్ తాలిబన్ వ్యవస్థాపకుడైన ముల్లా ఒమర్‌కు అత్యంత సన్నిహితుడు. ఇదివరకు తాలిబన్ ప్రభుత్వంలో ఉప ప్రధానిగా, విదేశాంగ మంత్రిగా పనిచేశారు. అమీర్ ఖాన్-విదేశాంగ శాఖ, షేర్ మహ్మద్ అబ్బాస్ స్టానెక్ జాయ్-విదేశాంగ సహాయమంత్రి, సిరాజుద్దీన్ హక్కానీ-హోంశాఖ, ముల్లా యాకూబ్-రక్షణ శాఖ, అబ్దుల్లా హకీం-న్యాయ శాఖ, హిదాయతుల్లా-ఆర్ధిక శాఖ, షేక్ మవ్లానీ నూరుల్లా-విద్యాశాఖ మంత్రి, నూర్ మహ్మద్ సకీబ్-మతపరమై కార్యక్రమాల పర్యవేక్షణ మంత్రిగా నియమితులయ్యారు.

పదవుల పంపకాల విషయంలో తమ మధ్య ఘర్షణలు చోటు చేసుకున్న విషయాన్ని తాలిబన్లు కొట్టిపారేశారు. అలాంటివేమీ లేవని తేల్చి చెప్పారు. రాజధాని కాబుల్‌లోని అధ్యక్ష భవనంలో ఎలాంటి ఉద్రిక్తతలు చోటు చేసుకోలేదని స్పష్టం చేశారు. అబ్దుల్ ఘనీ బరాదర్‌-హక్కానీ నెట్‌వర్క్ మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. బరాదర్ కనిపించకపోవడానికి ప్రత్యేకించి ఎలాంటి కారణాలు లేవని, ఆయన తమతో రోజూ సంప్రదింపులు నిర్వహిస్తున్నారని, ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ఆయన సలహాలను తీసుకుంటున్నామని తాలిబన్లు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+