భారత్ తో బంధంపై తేల్చేసిన తాలిబన్లు..! పాక్ కు బిగ్ షాక్..!
పశ్చిమాసియాలో కీలకమైన ఆప్ఘనిస్తాన్ తో బంధాన్ని బలోపేతం చేసుకునే దిశగా భారత్ చేస్తున్న ప్రయత్నాలు ఫలమిస్తున్నాయి. దీంతో అక్కడి తాలిబాన్ ప్రభుత్వంలో మంత్రులు భారత్ కు అనుకూలంగా స్వరం పెంచుతున్నారు. ఇప్పటికే తాలిబాన్ విదేశాంగమంత్రి భారత్ లో వారం రోజుల పాటు పర్యటించి వెళ్లారు. దీంతో పొరుగుదేశం పాక్ లో ఆందోళన పెరుగుతోంది. ఈ నేపథ్యంలో భారత్-ఆప్ఘన్ బంధంపై పాకిస్తాన్ విమర్శలకు దిగుతోంది.
ఇప్పటికే భారత్ తో సంబంధాలు పెంచుకుంటున్న తాలిబాన్లపై గుర్రుగా ఉన్న పాకిస్తాన్ వారి సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు దిగుతోంది. దీంతో ఈ వ్యవహారంలో మళ్లీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తలదూర్చాల్సి వస్తోంది. అయినా పాకిస్తాన్ తీరు మారడం లేదు. ఈ నేపథ్యంలో భారత్ తో బంధం విషయంలో పాకిస్తాన్ చేస్తున్న ఆరోపణల్ని ఆప్ఘనిస్తాన్ రక్షణమంత్రి మవ్లావీ మొహమ్మద్ యాకూబ్ ముజాహిద్ ఇవాళ తోసిపుచ్చారు. భారత్ తో తమ బంధం తమ స్వతంత్ర నిర్ణయమని, ఈ విషయంలో పాకిస్తాన్ వాదన అసంబద్దమైనదని ఆయన కౌంటర్ ఇచ్చారు.

ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలకు భారతదేశాన్ని నిందిస్తున్న పాకిస్తాన్ వాదనను ఆఫ్ఘనిస్తాన్ రక్షణ మంత్రి మౌలావి మొహమ్మద్ యాకూబ్ ముజాహిద్ నిరాధారమైనది, అశాస్త్రీయమైనది, ఆమోదయోగ్యం కానిదని తోసిపుచ్చారు. ఆఫ్ఘనిస్తాన్ స్వతంత్ర దేశంగా భారతదేశంతో సంబంధాలను కొనసాగిస్తుందని, అదే సమయంలో పాకిస్తాన్‌తో మంచి పొరుగు సంబంధాలను కూడా కోరుకుంటుందని అన్నారు. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు ఎవరికీ ఉపయోగపడవన్నారు. తమ విధానంలో ఆఫ్ఘన్ భూభాగాన్ని ఇతర దేశాలకు వ్యతిరేకంగా ఉపయోగించడం ఎప్పుడూ ఉండదన్నారు.

పాకిస్తాన్ దోహా ఒప్పందాన్ని గౌరవించడంలో విఫలమైతే సమస్యలు తలెత్తవచ్చని ముజాహిద్ హెచ్చరించారు. అలాగే దాడి జరిగితే ఆఫ్ఘనిస్తాన్ తన భూభాగాన్ని ధైర్యంగా రక్షించుకుంటుందని స్పష్టం చేశారు. రాజకీయ ప్రత్యర్థులను ఉగ్రవాదులుగా పాకిస్తాన్ ముద్ర వేయడాన్ని కూడా ఆయన విమర్శించారు. ఈ పదానికి స్పష్టమైన నిర్వచనం లేకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు.












Click it and Unblock the Notifications