వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Afghanistan: తాలిబన్ల పాలన ఎలా ఉండబోతుంది-మహిళల పరిస్థితేంటి-ఫస్ట్ ప్రెస్ మీట్‌లో కీలక విషయాలు

|
Google Oneindia TeluguNews

ఆఫ్గనిస్తాన్‌లో తాలిబన్ల రాజ్యం ఏర్పడటంతో ఇక మానవ హక్కులు మృగ్యమేననే ఆందోళన,భయం అక్కడి ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. గతంలో తాలిబన్ పాలనలో జరిగిన ఆకృత్యాలు కళ్ల ముందు మెదులుతుండటంతో వారి మాటలను విశ్వసించే పరిస్థితి కనిపించట్లేదు. ముఖ్యంగా స్త్రీల పట్ల తాలిబన్లు అత్యంత నిర్దయగా,కర్కషంగా వ్యవహరిస్తారు. కాబట్టి ఆఫ్గన్ మహిళల హక్కులు,వారి భవిష్యత్‌పై అంతర్జాతీయ సమాజం తీవ్ర ఆందోళన చెందుతోంది. అయితే ఎలాంటి ఆందోళన అక్కర్లేదని తాలిబన్లు చెబుతున్నారు. ఆఫ్గనిస్తాన్‌ను చేజిక్కించుకున్నాక నిర్వహించిన మొదటి ప్రెస్‌మీట్‌లో పలు కీలక విషయాలు వెల్లడించారు.

మహిళా హక్కులపై క్లారిటీ...

మహిళా హక్కులపై క్లారిటీ...


'ఇక నుంచి ఆఫ్గనిస్తాన్‌లో ఎలాంటి యుద్ధం ఉండదు. అశాంతికి ఆస్కారం లేదు. ఏ దేశంతోనూ మేము యుద్ధాన్ని కోరుకోవట్లేదు. మాకు ఎవరిపైనా పగ లేదు.మేమెవరినీ శత్రువుల్లా భావించట్లేదు. విదేశీ విధానాలను అమలుచేసిన మాజీ సైనిక సభ్యులతో పాటు అందరినీ క్షమించేశాం... వారి ఇళ్ల కోసం ఎవరూ వెతకరు... ఎవరిపైనా మేము ప్రతీకారాన్ని కోరుకోవట్లేదు. ఇస్లామిక్ షరియా చట్ట ప్రకారం మహిళా హక్కులు గౌరవించబడుతాయి.ఎడ్యుకేషన్,హెల్త్ ‌సెక్టార్‌లతో పాటు వారి సేవలు ఏయే రంగాల్లో అవసరమో.. అక్కడ వారు పనిచేయవచ్చు.వారి పట్ల వివక్ష ఉండదు.' అని తాలిబన్ల ప్రతినిధి జబీహుల్లాహ్ ముజాహిద్ తెలిపారు.

ఎవరికి వ్యతిరేకం కాదని...

ఎవరికి వ్యతిరేకం కాదని...

'ఆఫ్గన్ కేంద్రంగా ఇకపై ఏ ప్రపంచ దేశాలకు వ్యతిరేకంగా ఎటువంటి కార్యకలాపాలకు మేము అనుమతించబోమని మా పొరుగు దేశాలకు మేము హామీ ఇస్తున్నాం.ఆఫ్గన్ నేల నుంచి ఏ దేశానికి ఎటువంటి ముప్పు ఉండదని చెబుతున్నాం.' అని తాలిబన్లు పేర్కొన్నారు. దేశం విడిచి పారిపోయేందుకు వేలాదిగా కాబూల్ విమానాశ్రయానికి చేరుకుంటున్నవారికి కీలక విజ్ఞప్తి చేశారు. ఎవరూ భయపడాల్సిన పని లేదని.. అందరి భద్రతకు తాము హామీ ఇస్తున్నామని... అందరూ వెనక్కి వచ్చేయాలని చెప్పారు. కాబూల్‌లోని అన్ని దేశాల దౌత్య కార్యాలయాలకు భద్రత కల్పిస్తామన్నారు.

మీడియా ఇస్లామిక్ చట్టాలను గౌరవించాల్సిందే...

మీడియా ఇస్లామిక్ చట్టాలను గౌరవించాల్సిందే...

'అన్ని మీడియా సంస్థలు వారి ప్రసారాలను,కార్యకలాపాలను కొనసాగించవచ్చు.అయితే వారికి మూడు సూచనలు.ఇస్లామిక్ విలువలకు విరుద్ధంగా ఏ కార్యక్రమాన్ని ప్రసారం చేయరాదు. పారదర్శకంగా వ్యవహరించాలి. దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగించే ప్రసారాలు చేయకూడదు.' అని తాలిబన్లు మీడియాకు సూచనలు చేశారు. ప్రస్తుత సందర్భం ఆఫ్గన్ మొత్తానికి గర్వించదగ్గ క్షణమని పేర్కొన్నారు. మన చట్టబద్దమైన మనం సాధించుకున్నామని చెప్పారు. ఒకసారి ప్రభుత్వ ఏర్పాటు జరిగాక... ఏ రకమైన చట్టాలు అమలు జరగాలనే దానిపై నిర్ణయాలు ఉంటాయన్నారు. దేశంలోని సహజ వనరులను వినియోగించుకుని ఆఫ్గన్‌ను పునర్నిర్మాణానికి,శ్రేయస్సుకు కృషఇ చేస్తామన్నారు. అంతర్గతంగా లేదా ఆఫ్గన్ వెలుపల ఎవరితోనూ తాము శత్రుత్వాన్ని కోరుకోవట్లేదని... ప్రస్తుతం తామొక చరిత్రాత్మక సందర్భంలో ఉన్నామని చెప్పారు.20 ఏళ్ల పోరాటంతో ఎట్టకేలకు ఆఫ్గనిస్తాన్‌కు విముక్తి కల్పించామన్నారు.

నమ్మకం లేదంటున్న ఆఫ్గన్ మేయర్...

నమ్మకం లేదంటున్న ఆఫ్గన్ మేయర్...

అందరి హక్కులు,రక్షణకు తాలిబన్లు హామీ ఇస్తున్నప్పటికీ ఆఫ్గన్ ప్రజల్లో నమ్మకం కుదరడం లేదు. ఆఫ్గన్‌లో తొలి మహిళ మేయర్ అయిన 29 ఏళ్ల జరిఫా గఫారీ తనను తాలిబన్లు చంపేస్తారేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆఫ్గన్‌లో మహిళల సాధికారత కోసం ఆమె కృషి చేశారు. అక్కడి మహిళలకు ఆదర్శంగా నిలిచారు. 2019లో బీబీసీ రూపొందించిన టాప్ 100 ప్రభావవంతమైన మహిళల జాబితాలో చోటు దక్కించుకున్నారు. 2020లో అమెరికా విదేశాంగ శాఖ జరిఫాను ఇంటర్నేషనల్ విమెన్ ఆఫ్ కరేజ్‌ అవార్డుకు ఎంపిక చేసింది. ప్రస్తుతం ఆఫ్గన్‌లో పరిస్థితులు చూసి ఆమె తల్లడిల్లిపోతున్నారు. జరిఫా మేయర్‌గా బాధ్యతలు చేపట్టిన మొదటిరోజే ఆమెను చంపేస్తామని తాలిబన్లు హెచ్చరించాయి. పలుమార్లు హత్యాయత్నం కూడా జరిగింది. ఆమె తండ్రిని కూడా చంపేశారు. ఇప్పుడు ఆఫ్గన్ మరోసారి తాలిబన్ల చేతుల్లోకి వెళ్లడంతో ఆమె తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

ఐరాస స్పందన... అన్ని దేశాలు ఏకం కావాలని...

ఐరాస స్పందన... అన్ని దేశాలు ఏకం కావాలని...

ఆఫ్గనిస్తాన్‌లో నెలకొన్న పరిస్థితులపై ఐక్యరాజ్య సమితి స్పందించిన సంగతి తెలిసిందే. ఆఫ్గనిస్తాన్ కోసం ప్రపంచ దేశాలన్నీ ఏకం కావాలని ఐరాస చీఫ్ ఆంటానియో గుటెరస్ పిలుపునిచ్చారు.యావత్ ప్రపంచానికి ముప్పుగా పరిణమించే ఉగ్రవాదాన్ని ప్రపంచ దేశాలన్నీ కలిసి ఎదుర్కోవాలన్నారు. ఉగ్రవాద కార్యకలాపాలకు ఆఫ్గనిస్తాన్ మరోసారి వేదిక కాకుండా,ఉగ్ర సంస్థలు దాన్ని సురక్షిత స్థావరంగా చేసుకునే అవకాశం ఇవ్వకుండా అంతర్జాతీయ సమాజం ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. ఆఫ్గనిస్తాన్‌లో పరిస్థితులపై ఐరాస అత్యవసరంగా నిర్వహించిన సెక్యూరిటీ కౌన్సిల్ సమావేశంలో గుటెరస్ మాట్లాడారు.

'ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్‌కు,అంతర్జాతీయ సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా... కలిసి నిలబడుదాం... కలిసి పనిచేద్దాం... కలిసి చర్యలు తీసుకుందాం...' అని పిలుపునిచ్చారు.ఆఫ్గనిస్తాన్‌ ప్రజల కనీస మానవ హక్కులకై,ఆఫ్గన్‌లో ఉగ్రవాద ముప్పును అణచివేసేందుకు అన్ని దేశాలు అవసరమైన అన్ని సాధనాలను ఉపయోగించాలన్నారు.ఈ విపత్కర సమయంలో ఆఫ్గన్ల మన మద్దతు అవసరమన్నారు. రాబోయే రోజులు అత్యంత కీలకమని... ప్రపంచమంతా అక్కడి పరిస్థితిని గమనిస్తోందని... ఆఫ్గనిస్తాన్‌ ప్రజలను మనం అలా వదిలేయకూడదని అన్నారు. ఆఫ్గన్ స్త్రీలు,ప్రజలందరి మానవ హక్కులను,స్వేచ్చను తాలిబన్లు గౌరవించాలని అన్నారు.

అమెరికా అధ్యక్షుడు ఏమన్నారు...

అమెరికా అధ్యక్షుడు ఏమన్నారు...


ఆఫ్గనిస్తాన్ తాలిబన్ల నియంత్రణలోకి వెళ్లిన వేళ అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మౌనం వహించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఆఫ్గన్ ప్రజలను నిస్సహాయ స్థితిలో వదిలి అమెరికా తమ సైన్యాన్ని అక్కడి నుంచి ఉపసంహరించుకోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జో బైడెన్ ఎట్టకేలకు మౌనం వీడారు. ఆఫ్గన్‌ పట్ల అమెరికా అవలంభించబోయే వైఖరిపై కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడారు.

'20 ఏళ్ల క్రితం స్పష్టమైన లక్ష్యాలతో మేము ఆఫ్గన్ గడ్డపై అడుగుపెట్టాం. సెప్టెంబర్ 11,2001న అమెరికాపై దాడి చేసిన అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ మరోసారి మాపై దాడి చేసేందుకు ఆఫ్గనిస్తాన్ వేదిక కావొద్దని భావించాం. అనుకున్నట్లుగానే మా లక్ష్యాలను చేరుకున్నాం. అల్ ఖైదా ప్రాబల్యాన్ని తగ్గించేశాం.ఒసామా బిన్ లాడెన్ వేటలో మేమెప్పుడూ వెనక్కి తగ్గలేదు.20 ఏళ్ల క్రితం అతన్ని మట్టుబెట్టాం.' అని జో బైడెన్ పేర్కొన్నారు.

ఒక దేశంగా ఆఫ్గనిస్తాన్‌ను నిలబెట్టడమో లేక అక్కడ ప్రజాస్వామ్యాన్ని స్థాపించడమో అమెరికా మిషన్ కాదన్నారు. ఆఫ్గన్ గడ్డ పైనుంచి అమెరికాపై దాడి జరగకుండా చూసుకోవడమే ఇప్పటికీ తమ ఏకైక జాతీయ ఎజెండాగా చెప్పారు. ఆఫ్గనిస్తాన్‌లో తిరుగుబాటును అణచివేయడమో లేక ఆ దేశాన్ని నిలబెట్టడమో మా పని కాదు... ఉగ్రవాదాన్ని అణచివేయడంపైనే మా ఫోకస్ ఉంటుందని చాలా ఏళ్లుగా తన వాదన వినిపిస్తున్నట్లు చెప్పారు. తమది కాని యుద్ధంలో అమెరికా సైనికులను కోల్పోదలుచుకోలేదన్నారు. ఆఫ్గన్‌ కోసం ఇప్పటికే భారీగా డబ్బు ఖర్చు చేశామని... అన్ని విధాలా సహాయ సహకారాలు అందించామని చెప్పారు. అయితే పోరాడాలనే సంకల్పాన్ని మాత్రం ఇవ్వలేకపోయామన్నారు.

English summary
Taliban Press Meet- 'There will be no more war in Afghanistan. There is no room for unrest. We do not want war with any country. We have no resentment against anyone. We are not considered enemies. We forgive everyone, including ex-military members who have implemented foreign policy ... no one is looking for their homes ... we do not want revenge on anyone. "Women's rights are respected under Islamic Sharia law," said Taliban spokesman Jabihullah Mujahid.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X