వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

coronavirus:ఆఫ్రికాలో కూడా కరోనా విలయం, 3 లక్షల మంది మృతి: డబ్ల్యూహెచ్‌వో వార్నింగ్..

|
Google Oneindia TeluguNews

ఆసియాలో ఆవిర్భవించిన కరోనా వైరస్.. పలు దేశాలను విలయం సృష్టిస్తోంది. లక్షలాది మంది వైరస్ సోకగా.. వేలాదిమంది చనిపోయారు. అయితే కరోనా వైరస్.. తర్వాత ఆఫ్రికాలో విలయ తాండవం చేస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఆఫ్రికాలో 3 లక్షల మంది ప్రజలు చనిపోతారని... 30 మిలియన్ల మంది ప్రజలు పేదరికంలో మగ్గిపోతారని పేర్కొన్నది.

 Africa could be next epicentre:WHO

గత వారం రోజుల నుంచి ఆఫ్రికాలో కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరిగిపోతున్నాయి. వెయ్యి మంది వైరస్ సోకి చనిపోగా.. 19 వేల మందికి వైరస్ సోకింది. ఇది యూరప్, అమెరికాతో పోలిస్తే తక్కువ అని పేర్కొన్నది. కానీ తర్వాత ప్రభావం పెరిగే అవకాశం ఉంది. ఆఫ్రికా దేశాల్లో వైరస్ క్రమంగా ప్రబలుతుంది అని.. అయితే ఆయా దేశాల్లో సరైన వైద్య సదుపాయాలు లేవని.. అవసరమైన వెంటిలేటర్లు కూడా లేవని తెలియజేసింది. ఆఫ్రికా జనాభాలో మూడింట ఒక వంతు మందికి తగినత మంచినీటి సదుపాయం కూడా లేదు. 60 శాతం పట్టణవాసులు రద్దీగా ఉండే మురికివాడల్లో నివసిస్తున్నారు. దీంతో వైరస్ వేగంగా అభివృద్ది చెందుతోందని డబ్యుహెచ్‌వో తెలియజేసింది.

Recommended Video

Fake News Buster : 07 'హెలికాఫ్టర్ నుంచి ప్రజలకు డబ్బులు జారవిడుస్తున్న ప్రభుత్వం' ఇందులో నిజమెంత ?

ఆఫ్రికా ఖండంలో 1.3 బిలియన్ల ప్రజలు ఉండగా.. 19 వేల కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 970 మంది చనిపోయారు. ఉత్తర ఆఫ్రికాపై కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంది. అల్జిరియా, ఈజిప్ట్, మొరాకోలో 2 వేల పాజిటివ్ కేసులు నమోదు కాగా.. వెయ్యి మంది చనిపోయారు. అల్జిరియాలో వెయ్యి మంది చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. సౌతాఫ్రికాలో కూడా 2 వేల పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 48 మంది చనిపోయారు. నైజీరియాలో 442 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 13 మంది చనిపోయారు.

English summary
UN officials also say it is likely the pandemic will kill at least 300,000 people in Africa and push nearly 30 million into poverty.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X