సముద్రంలో నౌక మునక, 70 మంది మృతి
సనా: ఆఫ్రికన్ ప్రవాసితులు ప్రయాణిస్తున్న నౌక ఎర్ర సముద్రంలో బోర్లాపడటంతో 70 మంది మృతి చెందారని యెమెన్ రక్షణాధికారులు తెలిపారు. దేశ పశ్చిమ తీరంలో ఈ సంఘటన జరిగింది. మృతుల్లో ఎక్కువమంది ఇథియోపియాకు చెందిన వారిని తెలిపారు.
వేగంగా వీస్తున్న గాలులు, తరంగాల వల్ల వారు ప్రయాణిస్తున్న చిన్న నౌక ఆదివారం ప్రమాదానికి గురైందని తెలిపారు. అయితే, దీని పైన అధికారికంగా వ్యాఖ్యానించడానికి తమకు అధికారం లేదని వారు పేర్కొన్నారు. వేలాది మంది మైగ్రేంట్స్ ప్రతి ఏడాది ఆఫ్రికాకు చెందిన హోర్న్ నుండి యెమెన్‌కు ప్రయాణిస్తుంటారని శరణార్థ ఆర్గనైజేషన్స్ తెలిపాయి.
నైజీరియాలో 200 మంది ఖైదీల పరారీ

నైజీరియాలో మరో జైలుపై సాయుధులు దాడి చేశారు. 200 మంది ఖైదీలను విముక్తం చేశారు. సెంట్రల్ నైజర్ రాష్ట్రంలోని జైలు నుంచి పరారైన ఖైదీల్లో పదిమందిని పోలీసులు తిరిగి బంధించారు. గత రెండు నెలల కాలంలో జైళ్లపై జరిగిన మూడో దాడి ఇది. ఇంతకుముందు రెండు దాడులు బోకో హరామ్ ఇస్లామిక్ ఉగ్రవాదుల ఆధ్వర్యంలో జరిగాయి.
నల్లజాతీయుల కాల్చివేతపై ఆగని నిరసనలు
నిరాయుధులైన నల్లజాతీయులను పోలీసులు పొట్టనబెట్టుకుంటున్న తీరుపై న్యూయార్క్‌లో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. పోలీసు హత్యలను ఖండిస్తూ న్యూయార్క్‌వీధుల్లో జోరున కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఆందోళనను కొనసాగించారు.
టైమ్స్‌స్క్వేర్, అనంతరం యూనియన్ స్క్వేర్ వద్ద పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాలిఫోర్నియాలో నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో.. పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. దీంతో పలువురు గాయపడ్డారు.












Click it and Unblock the Notifications