మరణించి 42 ఏళ్లు: సాహసవీరుడి మృతదేహం సేఫ్
వెల్లింగ్ టన్: సాహస యాత్రకు వెళ్లి మంచు పర్వతాలలో అనుమానాస్పదంగా అదృశ్యం అయిన అతని ఆచూకీని కనుగొన్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 42 సంవత్సరాల తరువాత ఆ సాహసవీరుడు మరణించాడని న్యూజిలాండ్ పోలీసులు గురువారం అధికారికంగా ధ్రువీకరించారు.
డేవిడ్ ఎరిక్ మ్యూన్ అనే వ్యక్తి మరణించాడని న్యూజిలాండ్ పోలీసు అధికారులు వెల్లడించారు. డేవిడ్ ఎరిక్ మ్యూన్ కు పర్వతారోహణ అంటే చాల ఇష్టం. ఇతను 19 సంవత్సరాల వయస్సులోనే అనేక రికార్డులు సొంతం చేసుకున్నాడు.
1973 సెప్టెంబర్ 16వ తేదిన తన సహచరులతో కలిసి సాహసయాత్రకు బయలుదేరాడు. తరువాత మౌంట్ కుక్ పర్వతాన్ని ఎక్కుతున్న సమయంలో డేవిడ్ ఎరిక్ మ్యూన్ కాలు జారి పడిపోయాడు. సాటి సహచరులు డేవిడ్ కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం అందించారు. అప్పుడు అతని వయస్సు 19 ఏళ్లు.

అప్పటి నుండి డేవిడ్ ఆచూకి లేదు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. 42 సంవత్సరాల తరువాత మంచు పర్వతాలలో మంచు కింద ఒక మృతదేహం గుర్తించారు. వెంటనే డీఎన్ఏ పరీక్షలకు పంపించారు. ఆ మృతదేహం డేవిడ్ ఎరిక్ మ్యూన్ దే అని డీఎన్ఏ పరీక్షలలో వెలుగు చూసింది.
న్యూజిలాండ్ పోలీసులు, డేవిడ్ కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని గురువారం దృవీకరించారు. 42 సంవత్సరాల తరువాత ఎక్కడ తప్పిపోయిన వ్యక్తి అక్కడే శవమై కనిపించడం ఒక రకంగా బాధగా ఉన్నా, వేరే కారణాలు లేవని తెలుసుకున్నందుకు ఆనందగాను ఉందని డేవిడ్ కుటుంబ సభ్యులు అంటున్నారు.












Click it and Unblock the Notifications