45 ఏళ్ల తర్వాత: పోలండ్‌లో అడుగుపెట్టిన ప్రధాని మోడీ, ఘనస్వాగతం
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పోలెండ్‌లో అడుగుపెట్టారు. ఆ దేశ రాజధాని వార్సాలో మోడీకి ఘనస్వాగతం లభించింది. భారత్, పోలండ్ మధ్య ఉన్న దౌత్య సంబంధాలకు 70 ఏళ్లు పూర్తైన సందర్భంగా మోడీ ప్రస్తుతం అక్కడ పర్యటించారు. అయితే, గత 45 ఏళ్లలో భారత ప్రధాని పోలెండ్‌లో పర్యటించడం ఇదే తొలిసారి కావడం విశేషం. 1979లో చివరిసారిగా నాటి భారత ప్రధాని మొరార్జీ దేశాయ్ పోలెండ్‌కు వెళ్లారు.
రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ పోలాండ్ అధ్యక్షుడు, ప్రధాన మంత్రితో భేటీ కానున్నారు. పొలాండ్‌కు చెందిన వ్యాపార దిగ్గజాలు, పర్యావరణవేత్తలతోనూ మోడీ చర్చలు జరపనున్నారు. భారత సంతతి ప్రజలను కలవనున్నారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఏర్పడి 70 ఏళ్లు పూర్తైన సందర్భంగా జరుగుతన్న ఈ పర్యటన ప్రత్యేకమైనదని ప్రధాని మోడీ పేర్కొన్నారు. సెంట్రల్ యూరప్‌లో పోలాండ్ కీలక ఆర్థిక భాగస్వామి అని తెలిపారు.

కాగా, పోలెండ్‌లో ప్రవాస భారతీయులు స్వాగతం పలికిన ఫొటోలను మోడీ పోస్ట్ చేశారు. పెద్ద ఎత్తున ప్రవాస భారతీయులు మోడీని చూసే హర్షం వ్యక్తం చేశారు. మోడీ మోడీ అంటూ నినాదాలు చేశారు. ఆయనతో ఫొటోలు దిగిందేకు పోటీ పడ్డారు. ప్రధాని మోడీ కూడా వారిని ఆత్మీయంగా పలకరించారు. ప్రవాసులు చూపిస్తున్న ఆదరాభిమానలకు ప్రధాని మోడీ ముగ్ధుడయ్యారు.
#WATCH | Prime Minister Narendra Modi arrives in Warsaw, Poland.
— ANI (@ANI) August 21, 2024
PM Modi is on a two-day official visit to Poland. This is the first visit by an Indian Prime Minister to Poland in the past 45 years. pic.twitter.com/AjIVYw75SC
అయితే, పోలెండ్‌లో రెండు రోజులపాటు పర్యటించనున్న మోడీ.. అక్కడ నుంచి ఆ తర్వాత ఉక్రెయిన్ వెళ్లనున్నారు. ఆగస్టు 23న ఓ స్పెషల్ ట్రైన్లో సుమారు 10 గంటల పాటు ప్రయాణించి ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు చేరుకుంటారు. ఆ తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో భేటీ అవుతారు. ఆ తర్వాత తిరిగి మళ్లీ రైలులోనే పోలెండ్ చేరుకుంటారు. అక్కడ పర్యటన ముగించుకొన్నాక మోడీ తిరిగి స్వదేశానికి తిరిరానున్నారు. కాగా, ఈ పర్యటనకు ముందు ప్రధాని మోడీ ఓ ప్రకటనను విడుదల చేశారు. ఉక్రెయిన్‌లో శాంతి, స్థిరత్వం త్వరగా తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.
Landed in Poland. Looking forward to the various programmes here. This visit will add momentum to the India-Poland friendship and benefit the people of our nations. pic.twitter.com/KniZnr4x8g
— Narendra Modi (@narendramodi) August 21, 2024
'మధ్య ఐరోపాలో భారత్‌కు పోలెండ్ కీలక ఆర్థిక భాగస్వామిగా ఉంది. ఇరుదేశాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు పోలెండ్ అధ్యక్షుడు ఆండ్రెజ్ దుడా, ప్రధాని డొనాల్డ్ టస్క్ తో నా భేటీ కోసం ఎదురుచూస్తున్నా. అక్కడి భారతీయులతోనూ ముచ్చటిస్తా. ఆ పర్యటనను ముగించుకొని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదమిర్ జెలెన్‌స్కీ ఆహ్వానం మేరకు కీవ్ వెళ్లనున్నా. ఆ దేశంలో భారత ప్రధాని చేపట్టబోయే తొలి పర్యటన ఇదే కానుంది. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడమే ప్రధానాంశంగా ఈ పర్యటన సాగనుంది. గత రెండేళ్లుగా కొనసాగుతున్న ఉక్రెయిన్ వివాదానికి శాంతియుత పరిష్కారంపై జెలెన్‌స్కీతో నా ఆలోచనలు పంచుకొనే అవకాశం కోసం ఎదురుచూస్తున్నా. అక్కడ శాంతి, స్థిరత్వం త్వరగా తిరిగిరావాలని ఆకాంక్షిస్తున్నా' అని ప్రధాని మోడీ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
PM @narendramodi sets foot in the historic city of Warsaw.
— Randhir Jaiswal (@MEAIndia) August 21, 2024
Accorded a ceremonial welcome at the airport.
This visit holds special significance as 🇮🇳 & 🇵🇱 are commemorating 70 years of diplomatic relations this year. pic.twitter.com/IB432SKoda
-
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్"












Click it and Unblock the Notifications