ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్-వాటి కోసం పాకిస్తాన్ భారీ ఆర్డర్లు ?
కశ్మిర్ లో పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్దాయికి చేరాయి. ఇదే క్రమంలో తీవ్రవాదనికి మద్దతిస్తున్న పాకిస్తాన్ కు గట్టిగా బుద్దిచెప్పేందుకు భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఇందులో భాగంగా భారత్ సంధించిన మిస్సైళ్లు పాకిస్తాన్ తో పాటు ఆక్రమిత కాశ్మీర్ లోని వివిధ ప్రాంతాలను ధ్వంసం చేశాయి. అలాగే లాహోర్ లోని క్షిపణి రక్షణ వ్యవస్థల్ని, ఎయిర్ బేస్ లను కూడా ధ్వంసం చేశాయి. అయితే పాకిస్తాన్ మాత్రం భారత్ పైకి టర్కీ డ్రోన్లు, చైనా ఫైటర్ జెట్లను పంపినా అవి సరిహద్దుల్లోనే కుప్పకూలాయి.
అయితే భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కు కౌంటర్ గా తాము మొదలుపెట్టిన దాడుల్లో భాగంగా సంధించిన టర్కీ డ్రోన్లు, చైనా ఫైటర్ జెట్లు, యూఏవీలు మెరుగ్గా పనిచేసినట్లు పాకిస్తాన్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో మరిన్ని డ్రోన్లు, రాకెట్ లాంచర్లకు తాజాగా పాకిస్తాన్ ఆర్డర్ పెట్టినట్లు తెలుస్తోంది. చైనా నుంచి యూఏవీలకు, టర్కీ నుంచి డ్రోన్లకు ఆర్డర్ చేసినట్లు భారత నిఘా వర్గాలకు సమాచారం అందింది. అదే సమయంలో టర్కీతో 2021లో కుదుర్చుకున్న రక్షణ ఒప్పందాన్ని పొడిగించింది.

భారత్ తో యుద్ధంలో తగిలిన ఎదురుదెబ్బల తర్వాత భారీగా రక్షణ బడ్జెట్ కేటాయింపులు పెంచిన పాకిస్తాన్.. ఇప్పుడు చైనా నుంచి ఉపరితలం నుంచి ప్రయోగించే మిసైల్ లాంచర్లు, అలాగే 30 వింగ్ లూక్ అటాక్ డ్రోన్లకు ఆర్డర్ పెట్టినట్లు తెలుస్తోంది. చైనాకు ఆర్డర్ పెట్టిన లాంచర్లు రాకెట్లను, గ్రైనెడ్లను, భారీ షెల్స్ ను ప్రయోగించేందుకు ఉపయోగపడతాయి. వీటితో పాటు చైనా కిల్లర్ డ్రోన్లుగా భావిస్తున్న 30 వింగ్ లూక్ యూవీఏ( మానవరహిత ఏరియల్ వాహనాలు) ఉన్నాయి.
అయితే చైనా నుంచి సమకూర్చుకుంటున్న డ్రోన్లను పాక్ అక్రమిత కాశ్మీర్ లో మోహరించేందుకు సిద్దమవుతున్నట్లు భారత నిఘా వర్గాలకు సమాచారం అందింది. అదే సమయంలో టర్కీ కంపెనీతో భారీగా డ్రోన్లు అందించేందుకు 2021లో కుదుర్చుకున్న ఒప్పందాన్ని సైతం పాకిస్తాన్ పొడిగించిందని సమాచారం. ఇవి జూలై కల్లా పాకిస్తాన్ చేతికి అందే అవకాశం ఉంది. వీటిని కూడా పాక్ అక్రమిత కాశ్మీర్ లో మోహరించనున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications