అమెరికా ఎంట్రీతో మారిపోయిన సీన్- అమల్లోకి భారత్-పాక్ కాల్పుల విరమణ..!
పహల్గాం దాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ఓవైపు ఉధృతంగా సాగుతున్న వేళ ఇవాళ అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ ఉదయం కూడా భారత్ లోని పలు నగరాలపై పాకిస్తాన్ డ్రోన్ దాడులు చేసింది. అలాగే భారత్ కూడా వాటిని దీటుగా తిప్పికొట్టింది కూడా. అయితే అదే సమయంలో కీలక పరిణామాలు జరిగాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలతో రంగంలోకి దిగిన ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, రక్షణ కార్యదర్శి మార్కో రుబియో భారత్-పాక్ లతో చర్చలు జరిపారు. ఇవి ఫలించాయి. దీంతో ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచే కాల్పుల విరమణ అమల్లోకి వచ్చేసింది.
పాకిస్తాన్ తో జరుగుతున్న యుద్ధంలో కాల్పుల విరమణకు దారి తీసిన పరిణామాలపై విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ సాయంత్రం కీలక ప్రకటన చేశారు. పాకిస్తాన్ డైరెక్టర్స్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ ఈ మధ్యాహ్నం 3.35 గంటలకు ఇండియన్ డిజిఎంఓను పిలిచారని తెలిపారు. దీంతో సాయంత్రం 5 గంటల నుంచి ఇరుపక్షాలు భూమిపై, గాలి, సముద్రంలో అన్ని కాల్పులు, సైనిక చర్యలను నిలిపివేసేందుకు అంగీకారం కుదిరిందన్నారు.

పాకిస్తాన్ మిలిటరీ ఆపరేషన్స్ జనరల్ భారత మిలిటరీ ఆపరేషన్స్ జనరల్ తో జరిపిన చర్చల తర్వాత ఇరుదేశాలూ కాల్పుల విరమణను అమల్లోకి తెచ్చేశాయి. ఇరువైపులా ఎలాంటి చర్యలూ లేకుండా అన్ని కార్యకలాపాల్ని ఆపేసాయి. మరోసారి ఎల్లుండి ఇరుదేశాల మిలిటరీ ఆపరేషన్స్ జనరల్స్ చర్చలు జరుపుకుంటారని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ వెల్లడించారు. దీంతో ఎల్లుండి జరిగే చర్చలపై ఉత్కంఠ నెలకొంది.













Click it and Unblock the Notifications