సెహ్వాగ్ పంచ్ సరిపోలేదేమో.. మళ్లీ రెచ్చగొడుతోన్న మోర్గాన్
న్యూఢిల్లీ : నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు.. అన్నట్లుంది బ్రిటీష్ జర్నలిస్ట్ పియర్స్ మోర్గాన్ వ్యవహారం. ఒలింపిక్స్ పతకాల విషయంలో ఇండియాను తక్కువ చేస్తూ మాట్లాడిన మోర్గాన్ కు.. సెహ్వాగ్ ఇచ్చిన దిమ్మతిరిగే పంచ్ సరిపోనట్లుంది. అందుకే మరోసారి తన పైత్యాన్ని బయటపెట్టుకుంటూ కయ్యానికి కాలు దువ్వుతున్నాడు.

ఈ దఫా ఆయన గారు చేసిన ట్వీట్ ఏంటంటే.. 'ఇండియన్ ట్విట్టర్ ఈరోజెందుకు సైలెంట్ అయిపోయారు?, మీ గాయాలకు మందు రాసుకుంటున్నారా..?' అంటూ తన నోటి దురుసును బయటపెట్టుకున్నాడు మోర్గాన్. అంతేకాదు.. తాజా వివాదం వల్ల తన ఫాలోయింగ్ 12వేలకు పెరిగిందని, దీనంతటికీ కారణం భారతీయ అభిమానులేనని చెప్పాడు మోర్గాన్. మోర్గాన్ తాజా కామెంట్స్ ను ఇండియన్స్ ఎలా తిప్పికొడుతారో వేచి చూడాలి.
You're a bit quiet today, #IndianTwitter.... nursing your bruises? 👊👊👊👊💪💪💪💪
— Piers Morgan (@piersmorgan) August 25, 2016












Click it and Unblock the Notifications