గాల్లోనే ఢీ కొన్న రెండు చైనా విమానాలు..?
మరో విమాన ప్రమాదం కొద్దిలో మిస్ అయినట్లు తెలుస్తోంది. రెండు చైనా విమానాలు గాల్లో ప్రయాణిస్తుండగా అనుకోకుండా దగ్గరగా వచ్చాయి. కొద్ది క్షణాల్లో రెండు ఒకదాన్నొకటి ఢీ కొట్టబోతున్న సమయంలో ఇరు వైపులా పైలెట్లు చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన సైబీరియాలో జరిగింది.
ఇటీవలి కాలంలో విమాన ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. నిత్యం సాంకేతిక సమస్యలతో విమానాలు ఎక్కడపడితే అక్కడ ల్యాండింగ్ అవుతున్నాయి. ఇటీవల గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన ఘటనలో 265 మంది ప్రయాణికులు మృతి చెందారు. ఆ తర్వాత ఉత్తరాఖండ్ లో ఓ హెలికాప్టర్ కుప్పకూలి ఏడుగురు మృతిచెందారు. ఇటీవలి కాలంలో అనేక విమానాలు టేకాఫ్, ల్యాండింగ్ సమయాల్లో సాంకేతిక ఇబ్బందులు ఎదుర్కొన్నాయి.

తాజాగా రెండు చైనా విమానాలు పెను ప్రమాదం నుంచి బయట పడ్డాయి. ఎయిర్ చైనా పాసింజర్ జెట్, చైనాకు చెందిన కార్గో విమానం రెండూ ఒకదాన్నొకటి ఢీ కొనే సమయంలో పైలట్ విమానాన్ని ఒక్కసారిగా 2 వేల అడుగుల ఎత్తుకు తీసుకెళ్లడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే పైలట్ రష్యన్ ఎయిర్ స్పేస్ లోకి సమాచారం ఇవ్వకుండా ప్రవేశించినట్లు సమాచారం. అందువల్లనే రెండు విమానాలు ఒకే లైన్ లోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఘటన సమయంలో ప్యాసింజర్ విమానంలో వందకు పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
ఇటీవల ఇలాంటి ఘటనే జరిగింది. జపాన్ కు చెందిన ఎయిల్ లైన్స్ విమానం పెను ప్రమాదం నుంచి బయటపడింది. విమానంలో సాంకేతిక లోపం కారణంగా 36 వేల అడుగుల ఎత్తు నుంచి 26 వేల అడుగుల ఎత్తుకు పడిపోయింది. షాంగై నుంచి టోక్యో వెళ్తున్న బోయింగ్ 737 విమానంలో ఈ ఘటన జరిగింది. విమానం ఒక్కసారిగా కిందకి దూసుకొస్తున్న సమయంలో ప్రయాణికులు భయబ్రాంతులకు లోనయ్యారు. విమానం కుప్పకూలుతోందన్న భయంతో ఆక్సిజన్ మాస్కులు ధరించారు. తాజాగా సైబీరియాలోనూ ఇలాంటి ఘటనే జరగడంతో విమాన ప్రయాణాల భద్రతపై పలు అనుమానాలు, భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
-
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ?












Click it and Unblock the Notifications