వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎయిర్ ఆసియా ఫ్లైట్ క్రాష్: మరో ఏడు శవాల వెలికితీత

By Pratap
|
Google Oneindia TeluguNews

ఇండోనేషియా: ఎయిర్ ఆసియా విమానం కూలిన ఘటనలో సెర్చ్ ఆపరేషన్‌ను వేగవంతం చేశారు. మరో ఏడు శవాలను వెలికి తీశారు. దీంతో మొత్తం 16 శవాలను ఇప్పటి వరకు వెలికితీసినట్లయింది. శకలాలను కూడా వెలికి తీశారు. సముద్రం అడుగు నుంచి శకలాలను వెలికి తీసే కార్యక్రమం నడుస్తోంది.

విమానం బ్లాక్ బాక్సుల సిగ్నల్స్‌ను కనుక్కోవడానికి ఫ్రెంచ్, సింగపూర్ దర్యాప్తు అధికారులు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఆదివారంనాడు రాడార్ నుంచి తప్పిపోయి సిగ్నల్స్ అందకుండా పోయింది. జావా సముద్రంలో ఆ విమానం కూలిపోయింది. కూలిన సమయంలో విమానంలో ప్రయాణికులు, విమాన సిబ్బంది కలిపి 162 మంది ఉన్నారు.

AirAsia plane crash: 7 more bodies recovered as search operation speeds up

శుక్రవారంనాడు సెర్చ్, సహాయక చర్యలు సముద్రంలో 1,575 నాటికల్ స్క్వేర్ మైళ్ల ప్రాంతంలో సాగుతున్నాయి. ఇందుకు 29 ఓడలను, 17 ఎయిర్ క్రాఫ్ట్‌లను నియోగించారు. విమానం అతి పెద్ద భాగాన్ని కనుక్కోవడంపైన, బ్లాక్స్ బాక్సుల ఆచూకీని తెలుసుకోవడంపైన దృష్టి కేంద్రీకరించి సెర్చ్ ఆపరేషన్ సాగుతోంది. విమానం అతి పెద్ద శకలాన్ని కనుక్కోవడానికి డైవర్స్ సిద్ధంగా ఉన్నారు.

అతి చిన్న ప్రదేశంలోనే మృతదేహాలు, శకలాలను కనిపెట్టి వెలికి తీసినట్లు సెర్చ్ అధికారి ఎస్‌బి సుప్రియాది చెప్పారు. వింగ్ లేదా విమానం ఇంటీరియర్‌కు చెందిన శకలలాలను కనిపెట్టినట్లు తెలిపారు. వింగ్ ఫ్లాప్ కనిపించినట్లు చెబుతున్నారు. జావా సముద్రంలో డజన్ల కొద్ది ఓడశకలాలు ఉన్నాయని, అవి ఈ కాలంనాటివి మాత్రమే కాకుండా రెండో ప్రపంచ యుద్ధ కాలంనాటివి కూడా అని సుప్రీయాది అన్నారు. జపాన్‌కు, మిత్రదేశాలకు మధ్య సముద్ర యుద్ధం జరిగిన ప్రదేశం ఇది.

సముద్రం నుంచి వెలికి తీసిన శవాల్లో ఒక్కదాన్ని గుర్తించి బంధువులకు అప్పగించారు. గురువారంనాడు సురబయాలో ఆ మృతదేహానికి అంత్యక్రియలు జరిగాయి. ఫింగర్ ప్రింట్స్, సర్జరీ మచ్చ, ఐడి, గొలుసు ఆధారంగా ఆమెను హయతి లుత్ఫియా హమీగా గుర్తించారు. సురబయాలోని పోలీసు ఆస్పత్రిలో 150 పడకలతో మృతదేహాలను గుర్తించడానికి క్రైసిస్ సెటర్‌ను ఏర్పాటు చేశారు. మృతులను గుర్తించడానికి ఫింగర్ ప్రింట్స్, డెంటల్ రికార్డులు, డిఎన్ఎ వాడుతు్నారు.

English summary
Indonesian recovery teams narrowed the search area for AirAsia Flight 8501 Friday, hopeful they were closing in on the plane's crash site, with a total of 16 bodies and more debris recovered from the sea.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X