యెమెన్‌లో వైమానిక దాడులు: 40 మంది మృతి
సనా: యెమెన్‌లో సౌదీ అరేబియా నేతృత్వంలో గత 24 గంటల్లో జరిపిన వైమానిక దాడుల్లో 40 మంది మృతిచెందారు. యెమెన్ సెంట్రల్ ప్రావిన్స్ బైడాలో తిరుగుబాటుదారులు స్వాధీనం చేసుకున్న ముకైరిస్ నగరంపై దాడి చేసి తిరిగి ప్రభుత్వ మద్దతుదారులు నగరాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఈ దాడుల్లో 19 మంది తిరుగుబాటు దారులు, 15 మంది వారి మద్దతుదారులు, ఆరుగురు సాధారణ పౌరులు మరణించినట్లు అక్కడి అధికారులు తెలిపారు. బైడా ప్రావిన్స్‌లో సౌదీ ఆధ్వర్యంలో దాడులు కొనసాగుతున్నాయి.
గ్యాస్ కంపెనీలో విస్ఫోటం : 11 మంది మృతి

ఆఫ్ఘనిస్థాన్‌లోని హెరత్ నగరంలో మంగళవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గ్యాస్ కంపెనీలో భారీ విస్ఫోటం సంభవించడంతో 11 మంది అక్కడికక్కడే మరణించారు. మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారని ఉన్నతాధికారులు వెల్లడించారు.
సదరు కంపెనీలో ద్రవరూపంలో గ్యాస్‌ని నిల్వ ఉంచడంతో ప్రమాదవశాత్తు విస్ఫోటం చోటు చేసుకుందని తెలిపారు. ఈ ప్రమాదంలో అగ్నికీలలు భారీగా ఎగసిపడ్డాయి. దీంతో చుట్టుపక్కల నివాసాలకు మంటలు వ్యాపించాయని పేర్కొన్నారు.
క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications