• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అల్ జవహిరి: అల్ ఖైదా నాయకుడిని అమెరికా ఎలా వెతికి పట్టుకుంది? ఎక్కడ చంపింది

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

అల్ ఖైదా నాయకుడు అయ్‌మాన్ అల్ జవహిరి డ్రోన్ దాడిలో హతమైనట్టు అమెరికా వెల్లడించింది. అల్ ఖైదాకు ఇది పెద్ద దెబ్బే.

2011లో అమెరికా ఒసామా బిన్ లాడెన్‌ను పట్టుకుని, చంపిన తరువాత అల్ జవహిరి అల్ ఖైదా పగ్గాలు చేపట్టారు.

అఫ్గానిస్తాన్‌లో తీవ్రవాదానికి వ్యతిరేకంగా అమెరికా చేపట్టిన ఆపరేషన్‌లో అల్ జవహిరి మరణించినట్టు అమెరికా తెలిపింది.

అల్ జవహిరిని ఎలా పట్టుకున్నారు, ఆపరేషన్ ఎలా సాగింది మొదలైన వివరాలను రాయిటర్స్ వార్తా సంస్థ అందించింది.

ఆ కథనం మీ కోసం...

అల్ జవహిరి

ఆపరేషన్ ఎలా సాగిందంటే..

అల్ జవహిరి ఎన్నో ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్నారు. ఆయన్ను పట్టుకునేందుకు అమెరికా తీవ్రవాద వ్యతిరేక, ఇంటెలిజెన్స్ కమ్యూనిటీ "జాగ్రత్తగా, ఓపికగా" వ్యవహరించిందని అమెరికాకు చెందిన ఒక సీనియర్ అధికారి తెలిపారు.

గతంలో అల్ జవహిరి పాకిస్తాన్‌లో మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఉన్నారని, అఫ్గానిస్తాన్ లోపల దాక్కున్నారని రకరకాల వదంతులు వచ్చాయి.

"అల్ జవహిరికి మద్దతు ఇచ్చే ఒక నెట్‌వర్క్ గురించి అమెరికాకు చాలా ఏళ్లుగా తెలుసు. గత ఏడాది, అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా దళాలు వెనక్కు మరలిన తరువాత, ఆ దేశంలో అల్ ఖైదా ఉనికికి సంబంధించిన సూచనలపై అధికారులు దృష్టి పెట్టారు" అని ఆ అధికారి తెలిపారు. ఆయన పేరు, వివరాలను గోప్యంగా ఉంచమని కోరారు.

ఈ ఏడాది అల్ జవహిరి కుటుంబం.. ఆయన భార్య, కుమార్తె, ఆమె పిల్లలు కాబూల్‌లో ఒక సురక్షిత ప్రాంతంలోని ఇంటికి మారినట్టు అధికారులకు సమాచారం అందింది. ఆ తరువాత అల్ జవహిరి కూడా అదే ఇంట్లో ఉన్నట్టు అధికారులు గుర్తించారు.

కొన్ని నెలల పాటు అధికారులు అల్ జవహిరి కదలికలను గమనిస్తూ ఉన్నారు. ఆయన అదే ఇంట్లో ఉంటున్నట్టు ధ్రువీకరించుకున్నారు. ఏప్రిల్‌లో ఈ సమాచారాన్ని సీనియర్ అడ్మినిస్ట్రేషన్ అధికారులకు అందించారు. తరువాత, నేషనల్ సెక్యూరిటీ సలహాదారు జాక్ సుల్లివన్ ఈ సమాచారాన్ని జో బైడెన్‌కు అందించారు.

"మాకు వివిధ స్వతంత్ర సోర్సుల నుంచి వచ్చిన సమాచారాన్ని క్రోడీకరించి ఆపరేషన్‌కు అందించాం" అని ఆ అధికారి తెలిపారు.

అల్ జవహిరి కాబుల్‌లో ఇంటికి మారిన తరువాత, ఇల్లు విడిచి బయటకు వెళ్లలేదని, చాలాసార్లు ఆ ఇంటి బాల్కనీలో కనిపించారని ఆయన చెప్పారు.

ఆ ఇంటి నిర్మాణాన్ని, స్వభావాన్ని, అందులో నివసిస్తున్న వారిని నిశితంగా పరిశీలించారు. ఇంటి నిర్మాణాన్ని చెడగొట్టకుండా, ఆ ఇంట్లో నివసిస్తున్న అల్ జవహిరి కుటుంబ సభ్యులకు, ఇతరులకు ఏ హానీ కలగకుండా ఆపరేషన్ నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారని ఆ అధికారి చెప్పారు.

అల్ జవహిరి

గత కొన్ని వారాల్లో అమెరికా అధ్యక్షుడు తన కీలక సలహాదారులతో, క్యాబినెట్ మంత్రులతో సమావేశమై, అల్ జవహిరిని చంపడానికి అవసరమైన ఆపరేషన్ గురించి చర్చించారు.

జూలై 1న సీఐఏ డైరెక్ట విలియం బర్న్స్, ఇతర క్యాబినెట్ మంత్రులు కలిసి బైడెన్‌కు ఆపరేషన్ ప్రణాళికను వివరించారు.

బైడెన్, "అల్ జవహిరి గురించి ఏం తెలిసింది, ఎలా తెలిసిందనే" వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఇంటెలిజెన్స్ కమ్యూనిటీ అల్ జవహిరి నివాసముంటున్న ఇంటి మోడల్‌ను బైడెన్‌కు చూపించింది.

ఆ ఇంట్లో వెలుతురు ప్రసరించే మార్గాలు, వాతావరణం, నిర్మాణంలో ఉపయోగించిన సామగ్రి, ఇతర అంశాల గురించి వివరంగా అడిగి తెలుసుకున్నారు బైడెన్. తమ ఆపరేషన్ విజయవంతం కాకుండా నిరోధించే అంశాలు ఉన్నాయేమో పరిశీలించారని ఆ అధికారి తెలిపారు.

అలాగే, కాబుల్‌లో ఈ ఆపరేషన్ పర్యవసానాలను కూడా అంచనా వేయమని బైడెన్ అధికారులను అడిగారు.

ఇంటర్-ఏజెన్సీ లాయర్లు ఇంటెలిజెన్స్ రిపోర్టులను నిశితంగా పరిశీలించి, అల్ ఖైదా నాయకుడిగా వ్యవహరిస్తున్న అల్ జవహిరిని చంపడానికి చట్టపరమైన సమ్మతి ఉందని నిర్థారించారు.

జూలై 25న బైడెన్, తన క్యాబినెట్ మంత్రులతో, సలహాదారులతో సమావేశమై, ఈ ఆపరేషన్ నిర్వహిస్తే తాలిబాన్లతో అమెరికా సంబంధాలు ఎలా మారుతాయో చర్చించారని ఆ అధికారి చెప్పారు.

సభ్యుల అభిప్రాయాలు కూడా విన్న తరువాత బైడెన్, పౌరులకు ప్రాణనష్టం కలగకుండా ఆపరేషన్ నిర్వహించే షరతుపై "కచ్చితమైన వైమానిక దాడికి" ఆదేశాలిచ్చారు.

ఎట్టకేలకు జులై 30న స్థానిక సమయం ప్రకారం రాత్రి 9.48కి అమెరికా డ్రోన్ అల్ జవహిరిపై 'హెల్‌ఫైర్' అనే రెండు మిసైల్స్ ప్రయోగించిందని రాయిటర్స్ వివరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Al Zawahiri: How did the US track down the leader of Al Qaeda? where killed
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X