సింధూ జలాల నిలిపివేతపై పాకిస్థాన్ కీలక వ్యాఖ్యలు..
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ కు భారత్ సింధూ జలాల నిలిపివేత చేసిన విషయం తెలిసిందే. అయితే సింధూ జలాల నిలిపివేతపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది పాకిస్థాన్. సింధూనదీ జలాల పంపిణీ ఒప్పందంలో భాగంగా ఇరు దేశాలు కో- ఆపరేషన్ ను తిరిగి ప్రారంభించుకోవాలని అంబాసిడర్ అసిమ్ పేర్కొన్నారు. నీటి యుద్ధాలు తగదని అన్నారు. అలాగే వాతావరణ, బయోడైవర్సిటీ ప్రాజెక్ట్స్ కు ఫండింగ్ అవసరం అని స్పష్టం చేశారు. యుద్ధాలు, ఘర్షణలతో దెబ్బతిన్న దేశాల్లో క్లైమేట్ ఫైనాన్స్ సైతం తగ్గిపోతుందని అన్నారు.
ఇదే విషయంపై యూఎన్ఈపీ డైరెక్టర్ ఇంగర్ ఆండర్సన్ మాట్లాడుతూ.. యుద్ధాలు, ఘర్షణల కారణంగా స్థాన చలనం, వ్యాధులు, ఆకలి.. లాంటి విపత్తులు వస్తాయని తెలిపారు. అందుకే ఉదాహరణే గాజా, హైతీ అన్నారు. అక్కడి నేలలు కూడా తమ స్వభావాన్ని కోల్పోయాయని ఇది క్లైమేట్ ఛేంజ్ కు ఉదాహరణ అని అన్నారు.
ఇక సింధు జలాల ఒప్పందం భారత్, పాకిస్థాన్ మధ్య జరిగింది. 1960 సెప్టెంబర్ 19న కరాచీలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఆనాటి భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ, పాకిస్థాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ ల మధ్య ఈ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంలో భాగంగా రావి, బియాస్, సట్లెజ్ నదుల్లోని నీటిపై భారత్ కు హక్కులు లభించాయి. ఇక సింధు, చీనాబ్, జీలం నదులపై పాకిస్థాన్ కు నియంత్రణ ఉంది.

మరోవైపు పాకిస్థాన్ కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ కు చెందిన మెరైన్ అధికారులు భారత్ కు చెందిన జాలర్లను అదుపులోకి తీసుకున్నారు. 8 మంది భారత జాలర్లను అరెస్ట్ చేశారు. గుజరాత్ లోని జూనాగఢ్ జిల్లా వేరావల్ తీరం నుంచి వేటకు బయల్దేరిన భారత జాలర్లు.. నో ఫిషింగ్ జోన్ లోకి ప్రవేశించడంతో పాకిస్థాన్ మెరైన్ అధికారులు పడవను స్వాధీనం చేసుకున్నారు. అందులోని 8 మంది జాలర్లను అరెస్ట్ చేశారు. ఇక ఈ ఏడాది మార్చి నుంచి ఇప్పటివరకు మొత్తం 125 మంది భారత్ కు చెందిన జాలర్లను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం అందుతోంది.












Click it and Unblock the Notifications