Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భారం మాపై మోపి వెళ్లిపోయారు... ఆఫ్ఘన్ ప్రజలకు జవాబు చెప్పాల్సిందే.. : అమెరికాపై ఆఫ్ఘన్ మాజీ అధ్యక్షుడు

ఆఫ్ఘనిస్తాన్‌లో శాంతి,సుస్థిరత స్థాపనకు రెండు దశాబ్దాల పాటు అక్కడి ఉగ్రవాదంపై పోరు చేసిన అమెరికా,నాటో దళాలు ఇటీవలే అక్కడినుంచి పూర్తి స్థాయిలో నిష్క్రమించిన సంగతి తెలిసిందే. అమెరికా,నాటో దళాలు ఆఫ్ఘన్ భూభాగాన్ని వీడాయో లేదో తాలిబన్ ఉగ్రవాదులు మరింత రెచ్చిపోతున్నారు. ఇప్పటికే కాబూల్ నగరానికి 500కి.మీ దూరం వరకు చొచ్చుకెళ్లారు. ఆ ప్రాంతాలన్నింటిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా,నాటో దళాలపై ఆఫ్ఘన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఆఫ్ఘన్ ప్రజలపై భారం మోపి...1

ఆఫ్ఘన్ ప్రజలపై భారం మోపి...1

ఉగ్రవాదంపై పోరు పేరుతో 20 ఏళ్ల పాటు ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్న అమెరికా,నాటో దళాలు చివరకు ఆఫ్ఘన్ ప్రజల పైనే భారం మోపి వెళ్లిపోయాయని హమీద్ కర్జాయ్ వ్యాఖ్యానించారు. ఆఫ్ఘన్ ప్రజలుగా ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో తాము విఫలమయ్యామని... కానీ అదే ఉగ్రవాదంపై పోరు చేస్తామని అడుగుపెట్టిన పెద్ద శక్తులు సైతం ఇలా జారుకోవడమేంటని ప్రశ్నించారు. ఇది అవమానకర చర్య అని పేర్కొన్నారు. అంతేకాదు,ఆఫ్ఘన్‌లో అమెరికా సైన్యం వైఫల్యంపై ఆ దేశం ఆఫ్ఘన్ ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఉందన్నారు.

అలా చేస్తే సమస్య పరిష్కారమయ్యే ఛాన్స్

అలా చేస్తే సమస్య పరిష్కారమయ్యే ఛాన్స్

ఆఫ్ఘన్ గడ్డపై ఉగ్రవాద నిర్మూలనకు ఆఫ్ఘన్ పొరుగు దేశాలకు,ప్రపంచ శక్తులుగా వెలుగొందుతున్న దేశాలకు మధ్య పరస్పర అవగాహన,సహకారం అవసరమని పేర్కొన్నారు. ఈ విషయంలో చైనా కీలక పాత్ర పోషించేందుకు అవకాశం ఉందన్నారు. పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య సంబంధాలను బలోపేతం చేయడంలో చైనా కీలకంగా వ్యవహరించగలదని అన్నారు. ఇందుకోసం చైనా కృషి చేయాలని అన్నారు. అలాగే రష్యా,పాకిస్తాన్‌లతో కలిసి సంయుక్త వేదికల ద్వారా ఆఫ్ఘనిస్తాన్‌లో శాంతి స్థాపనకై చైనా ముందడుగు వేయాలన్నారు.

అమెరికా,నాటో దళాల నిష్క్రమణ

అమెరికా,నాటో దళాల నిష్క్రమణ

ఆఫ్ఘనిస్తాన్‌ను పట్టి పీడిస్తున్న తాలిబన్,అల్‌ఖైదా ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు రెండు దశాబ్దాల క్రితం అమెరికా,నాటో దళాలు ఆఫ్ఘన్ గడ్డపై అడుగుపెట్టాయి. అప్పటినుంచి ఉగ్రవాదులతో ఆ సైన్యం పోరు జరుపుతూనే ఉంది. ఓవైపు సాయుధ పోరు జరుపుతూనే మరోవైపు తాలిబన్లతో చర్చలపై అమెరికా దృష్టి సారించింది. ఫలితంగా గతేడాది మే 1న దోహాలో అమెరికా,తాలిబన్ల మధ్య శాంతి ఒప్పందం కుదిరింది.

దీంతో ఆఫ్ఘనిస్తాన్ నుంచి బలగాలను ఉపసంహరించుకుంటామని అమెరికా ప్రకటించింది. ఈ సెప్టెంబర్‌ 11వ తేదీలోగా సైన్యం ఉపసంహరణ ప్రక్రియ పూర్తవుతుందని తెలిపింది. కానీ అంతకు రెండు నెలలు ముందు గానే అక్కడి నుంచి అమెరికా,నాటో దళాలు పూర్తి స్థాయిలో నిష్క్రమించాయి. అగ్రరాజ్య దళాలు అక్కడినుంచి నిష్క్రమించడంతో తాలిబన్లకు ఇక అడ్డూ అదుపు లేకుండా పోయింది. శాంతి ఒప్పందానికి తూట్లు పొడుస్తూ ఆఫ్ఘనిస్తాన్‌లో మళ్లీ వారు విధ్వంసం సృష్టిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+