Afghanistan: ప్రతీకారం మొదలుపెట్టిన అమెరికా-ఆఫ్గన్‌లో ఐసిస్ స్థావరాలపై వైమానిక దాడులు-ఆ సూత్రధారి హతం?
ఆఫ్గనిస్తాన్‌లో ఐసిస్ ఆత్మాహుతి దాడులకు అమెరికా ప్రతీకార చర్యలు మొదలుపెట్టింది. ఆఫ్గన్‌లోని ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ లెవంట్(ISIL-K) స్థావరాలే లక్ష్యంగా వైమానిక దాడులకు దిగింది. ఆఫ్గన్-పాకిస్తాన్ సరిహద్దులోని నంగహర్ ప్రావిన్స్‌లోని ఐసిస్ స్థావరాలపై దాడులు జరిపింది. ఈ దాడుల్లో ఐసిస్ ఉగ్రవాది ఒకరు హతమయ్యారు. సాధారణ పౌరులెవరూ ఈ దాడుల్లో మరణించలేదని అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రతినిధి కెప్టెన్ బిల్ వెల్లడించారు.

ఆ సూత్రధారి హతం...?
అమెరికా జరిపిన తాజా వైమానిక దాడుల్లో హతమైన ఉగ్రవాది కాబూల్ పేలుళ్ల సూత్రధారిగా తెలుస్తోంది. కాబూల్ విమానాశ్రయంపై దాడి జరిగిన 48 గంటల్లోనే అమెరికా వైమానిక దాడులకు దిగడం గమనార్హం. పేలుళ్లకు బాధ్యులైన ఐసిస్‌ను వదిలిపెట్టేది లేదని... వేటాడి,వెంటాడి హతం చేస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. బైడెన్ ఆదేశాల మేరకు అమెరికా డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్ వైమానిక దాడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

మరో దాడి జరిగే ఛాన్స్..?
ఆగస్టు 31 లోపు ఆఫ్గనిస్తాన్ నుంచి తమ దళాలతో పాటు అక్కడ చిక్కుకుపోయిన అమెరికన్లను తరలించాల్సి ఉంది. ఆ డెడ్ లైన్ దాటితే తీవ్ర పరిణామాలు తప్పవని ఇప్పటికే తాలిబన్లు హెచ్చరించారు.మరోవైపు తరలింపు ప్రక్రియకు ఆటంకం సృష్టించేలా కాబూల్ విమానాశ్రయాన్ని టార్గెట్ చేసి ఐసిస్ దాడులకు తెగబడింది. ఈ దాడుల్లో దాదాపు 13 మంది అమెరికా సైనికులతో పాటు 200 మంది సాధారణ పౌరులు మృతి చెందారు. అమెరికా డెడ్ లైన్ ముగిసే లోపు మరోసారి ఐసిస్ దాడులకు పాల్పడవచ్చునని అమెరికా అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలోనే విమానాశ్రయం గేట్లకు దూరంగా ఉండాలని అమెరికన్లకు సూచించింది.

ఒకే ఆత్మాహుతి దాడి... అమెరికా రిపోర్ట్...
కాబూల్ విమానాశ్రయం వద్ద గురువారం(ఆగస్టు 25) జరిగిన ఆత్మాహుతి దాడులకు సంబంధించి కొత్త విషయాలు వెలుగుచూశాయి. అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ దీనిపై రిపోర్ట్‌ను విడుదల చేసింది. మొదట విడుదల చేసిన రిపోర్టుకు సవరణలు చేసి రెండో రిపోర్టును విడుదల చేసింది. మొదటి రిపోర్టులో రెండు ఆత్మాహుతి దాడులు జరిగినట్లు పేర్కొనగా... రెండో రిపోర్టులో కేవలం ఒకే ఆత్మాహుతి దాడి జరిగినట్లు స్పష్టం చేసింది. అబ్బే గేటు వద్ద మాత్రమే ఆత్మాహుతి దాడి జరిగిందని.. బరోన్ హోటల్ సమీపంలో ఆత్మాహుతి దాడి జరిగినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలిపింది.

మృతుల్లో 13 మంది అమెరికన్ నేవీ దళ సభ్యులు...
ప్రాథమిక అంచనా ప్రకారం... ఆత్మాహుతి దాడిలో 169 మంది ఆఫ్గనిస్తానీలు,13 మంది అమెరికన్లు మృతి చెందారు. 13 మంది ఆమెరికన్లలో 11 మంది నేవీ సైనికులుగా చెబుతున్నారు. ఇందులో ఒక నేవీ సైనికుడికి ఇదే మొదటి ఆఫ్గనిస్తాన్ టూర్. ప్రస్తుతం ఆయన గర్భవతి కాగా.. మరో 3 వారాల్లో ఆమె ప్రసవించనుంది. మృతుల్లో మిసౌరీకి చెందిన 20 ఏళ్ల యువ సైనికుడు,టెక్సాస్‌కి చెందిన మరో 20 ఏళ్ల సైనికుడు ఉన్నారు. అమెరికన్ సైనికుల అమరత్వానికి సంతాపంగా దేశంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై జాతీయ జెండాను అవనతం చేయాలని జో బైడెన్ ఆదేశించారు. 20 ఏళ్ల పాటు అమెరికా ఆఫ్గనిస్తాన్‌లో ఉగ్రవాదంపై జరిపిన పోరులో దాదాపు 2400 మంది అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయారు.

శక్తివంతమైన పేలుడు పదార్థం...
సాధారణంగా ఆత్మాహుతి బాంబు 25 పౌండ్ల మేర పేలుడు పదార్థాలతో నిండి ఉంటుంది. కానీ కాబూల్ విమానాశ్రయం వద్ద జరిపిన ఆత్మాహుతి దాడిలో 25 పౌండ్ల పేలుడు పదార్థాలను ఉపయోగించినట్లు అంచనా వేస్తున్నారు. ఐసిస్ మరో దాడికి గనుక పాల్పడితే కాబూల్ విమానాశ్రయం వద్ద పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యే ప్రమాదం ఉంది. కాబూల్ విమానాశ్రయం నుంచి అమెరికన్ల తరలింపును ఉద్దేశించి... చరిత్రలోనే ఇది అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియగా బైడెన్ పేర్కొన్న సంగతి తెలిసిందే. అమెరికన్లందరినీ అక్కడి నుంచి తరలిస్తామని... కానీ అంతిమంగా ఏం జరుగుతుందనేది తమ చేతుల్లో లేదని బైడెన్ స్పష్టం చేశారు.

ఇప్పటివరకూ 12500 మంది తరలింపు
శుక్రవారం(ఆగస్టు 26) వరకూ కాబూల్ విమానాశ్రయం నుంచి దాదాపు 12,500 మందిని అమెరికా తరలించింది. ఇంకా ఎంతమందిని తరలించాల్సి ఉందనే దానిపై స్పష్టత లేదు. నిజానికి అమెరికా తమ డెడ్ లైన్‌ను పొడగించాలని బ్రిటన్ సహా పలు దేశాలు విజ్ఞప్తి చేశాయి. అమెరికా ఆఫ్గన్‌ను వీడితే ఇతర దేశాలు అక్కడినుంచి తరలింపు ప్రక్రియను చేపట్టడం దాదాపు అసాధ్యంగా మారతుంది. అయితే అమెరికా మాత్రం అందుకు సుముఖంగా లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టు 31న అక్కడి నుంచి వచ్చేయాలని భావిస్తోంది.
Recommended Video

ఆ విషయంలో తమను సమర్థించుకున్న జో బైడెన్...
ఆఫ్గనిస్తాన్ తాలిబన్ల నియంత్రణలోకి వెళ్లిన వేళ అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మౌనం వహించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఆఫ్గన్ ప్రజలను నిస్సహాయ స్థితిలో వదిలి అమెరికా తమ సైన్యాన్ని అక్కడి నుంచి ఉపసంహరించుకోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అయితే బైడెన్ తమ చర్యను సమర్థించుకున్నారు. ఒక దేశంగా ఆఫ్గనిస్తాన్‌ను నిలబెట్టడమో లేక అక్కడ ప్రజాస్వామ్యాన్ని స్థాపించడమో అమెరికా మిషన్ కాదన్నారు. ఆఫ్గన్ గడ్డ పైనుంచి అమెరికాపై దాడి జరగకుండా చూసుకోవడమే ఇప్పటికీ తమ ఏకైక జాతీయ ఎజెండాగా చెప్పారు. ఆఫ్గనిస్తాన్‌లో తిరుగుబాటును అణచివేయడమో లేక ఆ దేశాన్ని నిలబెట్టడమో మా పని కాదు... ఉగ్రవాదాన్ని అణచివేయడంపైనే మా ఫోకస్ ఉంటుందని చాలా ఏళ్లుగా తన వాదన వినిపిస్తున్నట్లు చెప్పారు. తమది కాని యుద్ధంలో అమెరికా సైనికులను కోల్పోదలుచుకోలేదన్నారు. ఆఫ్గన్ కోసం ఇప్పటికే భారీగా డబ్బు ఖర్చు చేశామని... అన్ని విధాలా సహాయ సహకారాలు అందించామని చెప్పారు. అయితే పోరాడాలనే సంకల్పాన్ని మాత్రం ఇవ్వలేకపోయామన్నారు.
ఆఫ్గన్ నుంచి అమెరికా దళాలను ఉపసంహరించుకోవడానికి ఇక సరైన సమయం అంటూ ఉండదని తాను గ్రహించానన్నారు. సైన్యాన్ని ఉపసంహరించుకుంటే ఎదురయ్యే రిస్క్ పట్ల తమకు స్పష్టమైన అవగాహన ఉందన్నారు. అయితే పరిస్థితులు ఇంత త్వరగా దిగజారుతాయని భావించలేదన్నారు. ఆఫ్గన్ నాయకులు చేతులెత్తేసి దేశం విడిచి పెట్టి పారిపోవడం వల్ల మిలటరీ పతనమైందన్నారు.
-
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్!












Click it and Unblock the Notifications