ఐసిస్ ఉగ్రవాదం: అమెరికా వైమానిక దాడులు
ఇరాక్: ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదుల అరాచకాలు ఎక్కువ అవుతుండటంతో అమెరికా జోక్యం చేసుకుంది. బుధవారం రాత్రి నుండి ఇరాక్‌లోని తిక్రిత్ నగరంలో ఐసిస్ ఉగ్రవాదులు తలదాచుకున్న ప్రాంతాలలో అమెరికా సైనికులు వైమానిక దాడులు చేస్తున్నారు.
ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదుల స్థావరాల మీద అమెరికా సైనికులు చేస్తున్న దాడులకు ఇరాక్ సైనికులు సహకరిస్తున్నారు. సద్దాం హుస్సేన్ పుట్టిన బాగ్దాద్ నగరం ప్రస్తుతం ఐసిస్ తీవ్రవాదుల ఆదీనంలో ఉంది.
బాగ్దాద్‌ను స్వాదీనం చేసుకోవాలని ఇరాన్ సైనికులు కొన్ని నెలల నుండి ప్రయత్నిస్తున్నారు. మిత్ర దేశాలతో కలిసి ఇరాక్‌లో ఉగ్రవాదులను అంతం చేస్తామని ఇరాక్ ప్రధాని హైదర్ ఆల్ ఆబాది అంటున్నారు.

ఐసిస్ ఉగ్రవాదుల మీద ఇది తమ చివరి పోరాటమని, ఎలాగైనా వారిని అంతం చేసి వారి ఆదీనంలో ఉన్న నగరాలను స్వాధీనం చేసుకుంటామని ఇరాక్ ప్రధాని హైదర్ అల్ అబాది ధీమా వ్యక్తం చేశారు. గత సంవత్సరం ఆగస్టులో తిక్రిత్ నగరాన్ని ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు ఆక్రమించుకున్నారు.
అప్పటి నుండి తిక్రిత్ నగరాన్ని కేంద్ర బిందువుగా చేసుకుని వారి అరాచకాలను కొనసాగిస్తున్నారు. అమెరికా యుద్ద విమానాలు, క్షిపణులు, మిత్ర దేశాల మిలటరీ బలగాల సహాయంతో ఐసిస్ ఉగ్రవాదులను అంతం చెయ్యాలని ఇరాక్ ప్రభుత్వం నిర్ణయించింది.












Click it and Unblock the Notifications