వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తాలిబన్ దారుణాలు: 'గర్భంలోనే బిడ్డను చంపి, లైంగిక వాంఛ తీర్చుకొని బట్టలు కూడ ఇవ్వలేదు'

నాపై లైంగిక వాంఛ తీర్చుకొన్న తర్వాత కనీసం నా దుస్తులు కూడ తిరిగి ఇచ్చేవారు కాదు.... ఇద్దరు లైంగిక వాంఛ తీర్చుకొంటే ఓ వ్యక్తి డోర్ వద్ద కాపలాగా ఉండేవాడని తాలిబన్ చేతిలో ఐదేళ్ళపాటు నరకయాతన

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: నాపై లైంగిక వాంఛ తీర్చుకొన్న తర్వాత కనీసం నా దుస్తులు కూడ తిరిగి ఇచ్చేవారు కాదు.... ఇద్దరు లైంగిక వాంఛ తీర్చుకొంటే ఓ వ్యక్తి డోర్ వద్ద కాపలాగా ఉండేవాడని తాలిబన్ చేతిలో ఐదేళ్ళపాటు నరకయాతన అనుభవించినట్టు కెనడాకు చెందిన బాధిత కుటుంబం గుర్తు చేసుకొంది.

ఐదేళ్ళపాటు తాలిబన్ ఉగ్రవాదుల చేతిలో బందీలుగా ఉన్న వీరిని ఇటీవల సురక్షితంగా రక్షించారు. అయితే ఐదేళ్ళుగా తాలిబన్లు చేతిలో ఏ రకంగా ఇబ్బందులు పడిన విషయాలను కుటుంబం మీడియాకు వివరించింది.

తాలిబన్లు తమను ఐదేళ్ళపాటు చిత్ర హింసలు పెట్టారని ఆ దంపతులు గుర్తు చేసుకొన్నారు. అంతేకాదు అదే సమయంలో పిల్లలను చంపుతానని బెదిరించి తనపై లైంగిక వేధిపులకు పాల్పడేవారని బాధిత కుటుంబం ఉద్వేగానికి గురైంది.

మాతో చావు ఆటలు ఆడేవారు

మాతో చావు ఆటలు ఆడేవారు

తాలిబన్ ఉగ్రవాదులు మాతో చావు ఆటలు ఆడుకొనేవారని బాధిత కుటుంబం గుర్తు చేసుకొంది. అక్కడ కాపలవాళ్లు చాలా దుర్మార్గులు. మాతో దారుణంగా ప్రవర్తించేవారు. కొన్నిసార్లు పిల్లలని కూడా చూడకుండే వారిని హింసించేవారు. పిల్లలను కొడుతున్నారని నేను అడ్డువెళ్తే నన్ను కూడా కొట్టారు. నేలమీదకు తోసేశారు. మాతో చావు ఆటలు ఆడేవారు. ఎప్పుడూ చంపేస్తామని బెదిరించేవారని కెయిట్‌లాన్‌ కోలెమన్‌ బోయ్‌లే చెప్పారు.

గర్భంలోనే బిడ్డను చంపేశారు

గర్భంలోనే బిడ్డను చంపేశారు

కెనడాకు చెందిన దంపతులను 2012లో ఆఫ్గానిస్థాన్‌లోని తాలిబన్‌ అనుబంధ ముఠా అయిన హక్కానీ నెట్‌వర్క్‌ ఉగ్రవాదులు అపహరించారు. అప్పటికే ఆమె గర్భిణి. బందీలుగా ఉన్నప్పుడే ఆ జంటకు ముగ్గురు పిల్లలు జన్మించారు. ఉగ్రవాదులు గర్భంలోనే ఆ బిడ్డను బలవంతంగా చంపేశారు.

రేప్ చేసి బట్టలివ్వలేదు

రేప్ చేసి బట్టలివ్వలేదు

శారీరక వాంఛ తీర్చుకున్న తర్వాత ఆ ఉగ్రవాదులు కనీసం నా బట్టలు కూడా తిరిగివ్వకుండా ఇబ్బందులు పెట్టేవారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల్ని కొట్టేవారు.నన్నూ హింసించేవారని ఆమె ఉద్వేగానికి గురయ్యారు.మేం ఉండే గదిలోకి వచ్చి నా భర్తను బలవంతంగా బయటకు పంపేవారు. పిల్లలను కూడా బయటకు పంపి. లైంగికంగా దాడికి పాల్పడేవారని ఆమె చెప్పారు.

5 ఏళ్ళపాటు నరకం

5 ఏళ్ళపాటు నరకం

5 ఏళ్ళపాటు నరకాన్ని చూసినట్టు ఆ దంపతులు స్థానిక మీడియాకు చెప్పారు, క్షణముక యుగంలా బతికినట్టు చెప్పారు. ఎప్పుడు ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. ఈ తరుణంలో పిల్లలను తమను చంపుతామని బెదిరించి నరకం చూపేవారని ఆ దంపతులు గుర్తు చేసుకొన్నారు.

English summary
An American woman, her Canadian husband and their three children — all of whom were born in captivity — are opening up about the brutality that marked their five years spent in terrorist custody.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X