వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా కొత్త అధ్యక్షుడితో బిజీ: విధ్వంసానికి రష్యా సిద్ధం !

|
Google Oneindia TeluguNews

మాస్కో/సిరియా: రష్యా అనుకున్నంత పని చెయ్యడానికి సిద్దం అయ్యింది. ప్రపంచం అంతా అమెరికా అధ్యక్ష ఎన్నికలు, వాటి ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో రాష్యా భారీ యుద్దం చెయ్యడానికి సిద్దం అయ్యింది.

ఈ విషయాలను స్వయంగా రష్యా మీడియా తెలిపింది. సిరియా అధ్యక్షుడు అసద్ కు వ్యతిరేకంగా అల్లర్లు జరుగుతున్న ప్రాంతాల్లో భారీ విధ్వంసం చెయ్యాలని, దాడులు ఎలా చెయ్యాలి అనే విషయంపై రష్యా ఆలోచించి తగిన నిర్ణయం తీసుకుందని స్థానిక మీడియా తెలిపింది.

సిరియా అధ్యక్షుడికి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్న ప్రాంతాల్లో క్రూస్ మిసైల్, యుద్ధ విమానాలతో విరుచుకుపడి భారీ విధ్వంసం చెయ్యాలని రష్యా సిద్దం అయ్యింది. సిరియాలోని అలెప్పో నగర శివార్లలో ఆందోళనలు ఎక్కువగా జరుగుతున్నాయి.

Americans vote: Russia to launch Large-Scale airstrikes on Syria !

అక్కడి ప్రజల మీద దాడులు చెయ్యాలని రష్యా సిద్దం అయ్యిందని సమాచారం. అమెరికా అధ్యక్ష ఎన్నికలు, వాటి ఫలితాల కోసం అందరూ ఆ దేశం వైపు ఆసక్తిగా చూస్తున్న సమయంలో తమ పని పూర్తి చెయ్యాలని రష్యా ప్లాన్ వేసింది.

అమెరికా అధ్యక్ష ఎన్నికలు, ఫలితాలు వెలువడే అవకాశాన్ని రష్యా తనకు అనుకూలంగా మార్చుకోవడానికి సిద్దం అయ్యిందని స్థానిక మీడియా వివరించింది. అయితే దాడులకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు.

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నిక అయిన సమయంలో రష్యా చేస్తున్న విధ్వంసకర దాడులు ఎటు దారి తీస్తోందో అని ప్రపంచం అంతా ఎదురు చూస్తోంది. అయితే ప్రప్రంచ దేశాలు సైతం రష్యా తీరుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

English summary
The Aleppo attack would be a show of strength and military capability on the day of the US election. Putin observers have consistently said he puts heavy emphasis on restoring Russian status as a global power.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X