ఇరాన్ పై మెరుపుదాడికి ఇజ్రాయెల్ ప్లాన్? ట్రంప్ తేల్చుకోలేకపోతున్న వేళ..!
గతంలో ఇరాన్-ఇజ్రాయెల్ యుద్దం సందర్భంగా అమెరికా (US) రంగంలోకి దిగి చేతులు కాల్చుకుంది. అప్పట్లో బిగ్ బాంబ్ వేసి ఇరాన్ (Iran) అణుస్ధావరాలు ధ్వంసం చేసినట్లు ప్రకటించుకున్న అమెరికాకు.. ఆ వెంటనే గల్ఫ్ దేశాల్లోని తమ స్థావరాలపై జరిగిన దాడులు షాకిచ్చాయి. అప్పటి నుంచీ ఇరాన్ పై దాడికి అవకాశం కోసం ఎదురుచూస్తున్న అమెరికా, ఇజ్రాయెల్ (Israel) కు ఆ దేశంలో ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు వరంగా మారాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ పై దాడికి రంగం సిద్ధమవుతోంది.
ఇరాన్ లో నిరసనల్ని సాకుగా చూపుతూ దాడి చేసేందుకు ఓవైపు అమెరికా భారీ ఎత్తున యుద్ధ నౌకలు, ఇతర బలగాల్ని పంపుతుంటే .. ఆలోపే మెరుపుదాడి చేసేందుకు ఇజ్రాయెల్ సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. గతంలో ఇరాన్ తో యుద్దం సందర్భంగా భారీ నష్టాలు చవి చూసిన ఇజ్రాయెల్ ఇప్పుడు మరోసారి అమెరికా సాయంతో ఆ దేశంపై ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్దమవుతోంది.

ఓవైపు అమెరికా విమాన వాహక నౌక, యుద్ధ విమానాలు వంటి కీలకమైన సైనిక హార్డ్‌వేర్‌ను మధ్యప్రాచ్యంలో మోహరిస్తోంది. ఇజ్రాయెల్ ఆకస్మిక యుద్ధానికి సిద్ధమవుతున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుండి మిశ్రమ సంకేతాలు వచ్చాయి. అటు ఇరాన్ తమపై ఏదైనా దాడి జరిగితే అది మొత్తం పశ్చిమాసియాను విస్తృత సైనిక సంఘర్షణలోకి నెడుతుందని హెచ్చరికలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే మధ్యప్రాచ్యంలో తమ కార్యకలాపాలను పర్యవేక్షించే యునైటెడ్ స్టేట్స్ సెంట్రల్ కమాండ్ ను అమెరికా బలోపేతం చేస్తోందని తెలుస్తోంది.

మరోవైపు ఇరాన్ పై దాడి విషయంలో ట్రంప్ రోజుకో మాట చెప్తుండటాన్ని ఇజ్రాయెల్ జీర్ణించుకోలేకపోతోంది. తాము మాత్రం అమెరికాతో సంబంధం లేకుండా ఇరాన్ పై మెరుపుదాడికి సన్నద్ధమవుతున్న ఇజ్రాయెల్ సైనిక వర్గాలు చెప్తున్నాయి. పోలీసులు, ఫైర్, అత్యవసర సేవలతో సహా సైనిక, పౌర సంస్థలు అన్ని పరిస్థితులకు సిద్ధమవుతున్నాయి. ఇజ్రాయెల్ వైమానిక రక్షణ నెట్‌వర్క్‌ను కూడా హై అలర్ట్‌లో ఉంచారు. మరోవైపు ట్రంప్ మాత్రం ఒక రోజు ఇరాన్ పై యుద్దం చేస్తామని, మరొకసారి అక్కడ నిరసనకారుల ఉరిశిక్షలు ఆగాయి కాబట్టి ఆలోచిస్తున్నా అంటూ అనిశ్చితిలో ఉండటం ఇజ్రాయెల్ ను కలవరపెడుతోంది.
-
నతాంజ్ అణు కేంద్రంపై బాంబుల వర్షం.. భారీ పేలుళ్లతో దద్దరిల్లిన ఇరాన్! -
1967 తర్వాత తొలిసారి.. ‘ఈద్’ ప్రార్థనలు బంద్! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!!












Click it and Unblock the Notifications