నేపాల్ కు పట్టిన గతే పాకిస్థాన్ కు.. అడ్డంగా దొరికిపోయిందిగా..!
పాకిస్థాన్ ఓ వైపు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది. మరోవైపు దేశ ప్రజలపై ఆర్థిక భారం మోపుతోంది. భారత్ తో యుద్ధం కారణంగా ఇప్పటికే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం అయింది. అప్పు తెచ్చుకుని మరీ నెట్టుకువస్తోంది. పాకిస్థాన్ లో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, రాజకీయ అస్థిరత, ఆర్థిక సంక్షోభం తదితర సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. ఈ క్రమంలో సంచలన నివేదిక బయటకు వచ్చింది. ప్రముఖ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఈ రిపోర్టును ప్రచురించింది. ఈ రిపోర్టు ద్వారా కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Amnesty International says Pakistan is using a phone-tapping system and a Chinese-built internet firewall that censors social media to spy on millions of its citizens.
— Business Standard (@bsindia) September 9, 2025
Details https://t.co/vSlA9l6tyi#AmnestyInternational #Pakistan #Spying #Surveillance | @swatigandhi08
ప్రస్తుతం పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్.. ఆర్మీ జనరల్ అసిమ్ మునీర్ చెప్పినట్లుగా నడుచుకుంటున్నారు. ఆపరేషన్ సింధూర్ అనంతరం అసిమ్ మునీర్ పాక్ లో నియంతృత్వ ప్రభుత్వాన్ని నడుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అసిమ్ మునీర్ సూచనల మేరకు దేశ ప్రజలపై పాకిస్థాన్ ప్రభుత్వం నిఘా పెట్టినట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ వ్యవస్థ ద్వారా దేశ ప్రజలపై స్పైయింగ్ చేస్తున్నట్లు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ స్పష్టం చేసింది. చైనా నిర్మించిన ఇంటర్నెట్ ఫైర్ వాల్ అనే నూతన టెక్నాలజీ ద్వారా పాకిస్థాన్ లో సోషల్ మీడియాను సెన్సార్ చేస్తున్నారని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.
పాకిస్థాన్ లో పొలిటికల్, మీడియా స్వేచ్ఛపై ఇప్పటికే కఠిన ఆంక్షలు ఉన్నాయి. పాకిస్థాన్ లో ప్రజలకు ప్రజాస్వామ్య హక్కు లేకుండా పోయినట్లు రిపోర్టు స్పష్టం చేస్తోంది. దేశ భద్రతకు లేదా ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా.. దేశవ్యాప్తంగా వెబ్ సైట్లు, సోషల్ మీడియాను బ్లాక్ చేసే విధంగా పాకిస్థాన్ దగ్గర టెక్నాలజీ ఉందని ఆమ్నెస్టీ రిపోర్టు వెల్లడించింది. చైనా అందించిన ఈ టెక్నాలజీ ప్రకారం.. దాదాపు 40 లక్షల మొబైల్ ఫోన్లను ట్యాపింగ్ చేసే సామర్థ్యం ఉన్నట్లు తేలింది.

నేపాల్ లోనూ సోషల్ మీడియాపై ఇలాంటి ఆంక్షలు పెట్టి ప్రజల హక్కులను హరించింది అక్కడి ప్రభుత్వం. దీంతో అక్కడ రాజకీయ సంక్షోభం తలెత్తింది. ఇప్పటికే ఆ దేశ ప్రధాని ఓలీ రాజీనామా చేశారు. దుబాయ్ కు పరారయ్యే ప్లానింగ్ లో ఉన్నారు. ఇక అక్కడి మంత్రులను పరిగెత్తించి మరీ దాడులు చేస్తున్నారు ప్రజలు. ఈ క్రమంలో త్వరలో పాకిస్థాన్ లోనూ ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యే అవకాశం ఉందని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
-
అప్పటి వరకూ పాకిస్థాన్ కు నో వాటర్: భారత్ సంచలనం -
ప్రపంచంలోనే తొలి స్థానంలో పాకిస్థాన్.. ఆ ఒక్క విషయంలో.. -
లష్కరే తోయిబా ఉగ్రవాది హత్య.. చంపేసింది సొంత కుటుంబ సభ్యులే! -
ఇరాన్ పై దాడికి పాకిస్తాన్ ? తెరపైకి సౌదీతో రక్షణ ఒప్పందం..! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications