• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆఫ్ఘనిస్తాన్‌లో కిడ్నాప్‌ల పర్వం: హిందూ వ్యాపారి అపహరణ: ఇండియన్ పాస్‌పోర్ట్

|

కాబుల్: తాలిబన్ల ఆధీనంలోకి వెళ్లిపోయిన ఆఫ్ఘనిస్తాన్‌లో ఇక అపహరణల పర్వం మొదలైనట్టు కనిపిస్తోంది. నిరసన ప్రదర్శనలను నిర్వహించినా నడిరోడ్డు మీద పిట్టల్లా కాల్చి పారేయడం తాలిబన్ ఫైటర్లకు అలవాటుగా మారింది. తమకు ఎదురు తిరిగిన వారిని బహిరంగంగా శిక్షించిన సంఘటనలు చాలా ఉన్నాయి. ఇప్పటిదాకా ఇలాంటి చర్యలకే పరిమితమైన తాలిబన్లు కిడ్నాప్‌లకు తెర తీశారు. భారతీయ సిక్ సామాజిక వర్గానికి చెందిన ఓ వ్యాపారిని తుపాకులతో బెదిరించి- కిడ్నాప్ చేశారు.

 విదేశాంగ శాఖ జోక్యం కోసం..

విదేశాంగ శాఖ జోక్యం కోసం..

ఆ వ్యాపారి అపహరణకు గురైన విషయాన్ని ఇండియన్ వరల్డ్ ఫోరం అధ్యక్షుడు పునీత్ సింగ్ చంధోక్ ధృవీకరించారు. ఆయనను విడిపించడంలో భారత్ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. ఆయనను సురక్షితంగా ఆ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి విడిపించాలని విజ్ఙప్తి చేశారు. ఆయనను విడిపించే విషయంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులు.. ఖతర్ ప్రభుత్వ సహాయం కోరవచ్చని తెలుస్తోంది.

కెమిస్ట్‌గా..

కెమిస్ట్‌గా..

ఆ వ్యాపారి పేరు బన్‌శ్రీ లాల్. వయస్సు 50 సంవత్సరాలు. రాజధాని కాబుల్ డిస్ట్రిక్ట్-4 కర్టె పర్వాన్ పరిధిలోని ఖోస్త్‌లో నివసిస్తున్నారు. ఆయన స్వస్థలం ఢిల్లీ సమీపంలోని ఫరీదాబాద్. సిక్ సామాజిక వర్గానికి చెందిన వారు. చాలా సంవత్సరాల కిందటే ఆయన కాబుల్‌లో స్థిరపడ్డారు. కెమికల్ బిజినెస్ చేస్తోన్నారు. కెమిస్ట్‌ అండ్ డ్రగ్గిస్ట్‌గా పని చేస్తోన్నారు. ఫార్మాసూటికల్స్ షాప్‌ను నిర్వహిస్తున్నారు. ఆయన వద్ద భారతీయ పాస్‌పోర్ట్ ఉంది. కుటుంబం ఢిల్లీలో నివసిస్తోంది.

ఇండియన్ పాస్‌పోర్ట్ ఉండటంతో..

ఇండియన్ పాస్‌పోర్ట్ ఉండటంతో..

మంగళవారం సాయంత్రం ఆయన ఖోస్త్ ప్రాంతంలో తాలిబన్ ఫైటర్లు కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఇంటింటినీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బన్‌శ్రీ లాల్ వద్ద ఇండియన్ పాస్‌పోర్ట్ ఉండటం, అతను భారతీయుడిగా తేలడంతో తుపాకితో బెదిరించి- అపహరించినట్లు పునీత్ సింగ్ ఛందోక్ తెలిపారు. ఈ మేరకు ఆఫ్ఘన్ హిందూ-సిక్ అసోసియేషన్ ప్రతినిధులు తనకు సమాచారం ఇచ్చినట్లు చెప్పారు. టయోటా కరోలా కారులో గుర్తు తెలియని ప్రదేశానికి బన్‌శ్రీ లాల్‌ను అపహరించినట్లు చెప్పారు.

ఖతర్ సహకారం..

ఖతర్ సహకారం..

స్థానిక సిక్ సామాజిక వర్గ ప్రతినిధులు కాబుల్ డిస్ట్రిక్ట్-11 అధికారులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. వారు కేసు నమోదు చేసుకున్నారే తప్ప దర్యాప్తును సాగించట్లేదని చెప్పారు. ఆయనను విడిపించే విషయంలో భారత్ జోక్యం చేసుకోవాలని అన్నారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులతో తాము సంప్రదింపులు నిర్వహిస్తున్నామని చెప్పారు. బన్‌శ్రీ లాల్‌ను విడిపించే విషయంలో విదేశాంగ శాఖ అధికారులు ఖతర్ ప్రభుత్వ సహాయాన్ని తీసుకుంటారని తెలుస్తోంది.

వందలాది మంది నిరసన ప్రదర్శనలు..

కాగా- తాలిబన్లకు వ్యతిరేకంగా ఆప్ఘనిస్తాన్‌లో పలు చోట్ల స్థానికులు ఉద్యమిస్తోన్నారు. నిరసన ప్రదర్శనలను నిర్వహిస్తున్నారు. ఆందోళన కార్యక్రమాలను చేపడుతున్నారు. తాలిబన్లకు వ్యూహాత్మకంగా కీలక నగరమైన కాందహార్‌లో వందలాది మంది స్థానికులు నిరసన ప్రదర్శనలను చేపట్టారు. ఫిర్ఖా ఆర్మీ డివిజన్ ప్రాంతానికి చెందిన స్థానికులు వారంతా. కాందహార్‌లో కొన్ని చోట్ల నిరసన శిబిరాలను కూడా ఏర్పాటు చేసినట్లు సమాచారం.

  AP Economic Advisor గా Former SBI Chief Rajnish Kumar | AP CM Jagan || Oneindia Telugu

  కాందహార్‌లో ఉద్రిక్తత..

  వారందరినీ మూడు రోజుల్లోగా ఇళ్లను ఖాళీ చేయాలంటూ తాలిబన్ ఫైటర్లు ఆదేశించడంతో వారంతా నిరసన ప్రదర్శనలకు దిగినట్లు స్థానిక న్యూస్ ఏజెన్సీ అసవ్కా తెలిపింది. ఇంటింటినీ తనిఖీ చేయడాన్ని అడ్డుకున్నందుకే తాలిబన్ ఫైటర్లు స్థానికులపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నట్లు స్పష్టం చేసింది. ఈ ప్రదర్శనకారులను బెదిరించడానికి కాందహార్‌లో తాలిబన్ ఫైటర్లు గాల్లో కాల్పులు జరిపారని తెలిపింది. ప్రదర్శనకారులు మాత్రం వెనక్కి తగ్గట్లేదని పేర్కొంది.

  English summary
  Afghan origin Hindu who has been abducted in Kabul. The victim is a Chemist running his business in Kabul since last two decades.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X