వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'భారీ' సేల్: విమానంలో 7 రోజులు చక్కెర్లు కొట్టాకే

By Srinivas
|
Google Oneindia TeluguNews

సిడ్నీ: ఆస్ట్రేలియాకు చెందిన ఓ పశుపోషక కుటుంబం భూమి మీదనే అతిపెద్ద ల్యాండ్ ప్రాపర్టీని అమ్మేందుకు సిద్ధమైంది. దీని విలువ 325 మిలియన్ల డాలర్ల వరకు ఉండనుంది. వారు అమ్మనున్న ఆ ల్యాండ్ ఇంగ్లాండ్ దేశంతో పోల్చుకుంటే ఆ దేశంలోని 75 శాతం కంటే ఎక్కువగానే ఉంటుంది.

23,000 స్క్వేర్ కిలో మీటర్లు ఉంటుంది. ఆ భూమిని కొనేందుకు పలువురు ముందుకు వస్తున్నారు. ఈ ల్యాండ్‌ను చూసేందుకు కొనడానికి వచ్చే వారు దాదాపు వారం రోజుల పాటు విమానంలో చక్కెర్లు కొట్టి మరీ చూడాలి.

ఈ భూమిని కొనేందుకు 30 మంది బిడ్ వేశారు. వ్యవసాయం చేసే ఇతర కుటుంబాలు, స్థానికులు, ఇతర దేశాలకు చెందిన పెట్టుబడిదారులు, మాంసం కంపెనీలు ఇలా ఎందరో ముందుకు వచ్చారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి వస్తున్నారు.

An Australian cattle dynasty is selling the largest land property on Earth

ఇదిలా ఉండగా, స్థానిక ప్రజాప్రతినిధులు, ఇతరులు మాత్రం దీనిని విదేశీ ప్రభుత్వాలకు, ఫారెన్ స్టేట్ ఓన్ కంపెనీలకు అమ్మడాన్ని బ్యాన్ చేయాలని కోరుతున్నారు. పశుపోషక ల్యాండ్ అమ్ముతున్నది ఎస్ కిడ్మన్ అండ్ కో. అయితే, దీనికి నటి నికోలక్ కిడ్మన్‌కు సంబంధం లేదు.

దీనిని అమ్ముతున్న యజమానికి 1,85,000 పశువులు ఉన్నాయి. ఆస్ట్రేలియాలో 1.3 శాతం బీఫ్ వీరే సరఫరా చేస్తున్నారు. ఆంతేకాదు, జీవించి ఉన్న పశువులను పెద్ద ఎత్తున ఆసియా దేశాలకు ఎగుమతి చేస్తుంటారు.

English summary
An Australian cattle dynasty is selling the largest land property on Earth
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X