వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Earthquake: భూంకంపం ధాటికి ఛిన్నాభిన్నం: కుప్పకూలిన భవనాలు - సునామీ భయాందోళనలు..!!

|
Google Oneindia TeluguNews

తైపే: తైవాన్‌లో పెను భూకంపం సంభవించింది. తూర్పు తైనన్ ప్రావిన్స్‌లో సంభవించిన ఈ భూకంపం తీవ్రత భారీగా ఉంటోంది. పలు భవనాలు కంపించాయి. ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. రోడ్ల మీదికి పరుగులు తీశారు. ప్రధాన భూకంపం తరువాత కూడా స్వల్పంగా ప్రకంపనలు సంభవించాయి. ఫలితంగా- తమ ఇళ్లల్లోకి వెళ్లడానికి ప్రజలు భయపడ్డారు. ప్రాణనష్టం సంభవించినట్లు ఇప్పటివరకు సమాచారం లేదు.

తైవాన్ తూర్పు ప్రాంతంలోని తైనన్ ప్రావిన్స్‌లో గల యూజింగ్ సిటీ సమపీంలో భారత కాలమానం ప్రకారం.. ఈ మధ్యాహ్నం 12:14 నిమిషాలకు భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.2గా రికార్డయింది. యూజింగ్ సిటీకి 85 కీలోమీటర్ల దూరంలో గల ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించారు. ఉపరితలం నుంచి 18 కిలోమీటర్ల లోతున ఫలకాల్లో మార్పుల వల్ల భూకంపం సంభవించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియాలాజికల్ సర్వే (యూఎస్‌జీఎస్) తెలిపింది.

An earthquake of magnitude 7.2 has hit Taiwans Yujing

రెండు రోజుల వ్యవధిలో సంభవించిన అతి భారీ భూకంపం ఇది. రిక్టర్ స్కేలుపై 6.5 తీవ్రతతో శనివారం భూమి కంపించింది. తైవాన్ తీర ప్రాంత నగరం తైటుంగ్‌కు ఉత్తర దిశగా 50 కిలోమీటర్ల దూరంలో ఇది సంభవించింది. సరిగ్గా 24 గంటలు కూడా గడవక ముందే 7.2 తీవ్రతతో భూమి కంపించడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఈ రెండు రోజుల వ్యవధిలో 80 నుంచి 90 సార్లు భూమి ప్రకంపించినట్లు యూఎస్‌జీఎస్ పేర్కొంది.

భూప్రకంపనలు సంభవించిన వెంటనే స్థానిక అధికారులు అప్రమత్తం అయ్యారు. డిజాస్టర్ మేనేజ్‌మెంట్, ఇన్వెస్టిగేషన్ అండ్ రెస్క్కూ విభాగం అధికారులు రంగంలోకి దిగారు. పలుచోట్ల భవనాలు ధ్వంసం అయ్యాయి. అవి బీటలు వారాయి. కిటీకి అద్దాలు పగిలిపోయాయి. పలు చోట్ల రహదారులు చీలిపోయాయి. కొన్ని రైళ్లు సైతం పట్టాలు తప్పినట్లు సమాచారం అందింది. దీని తరువాత అధికారులు సునామీ హెచ్చరికలను జారీ చేశారు. తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

English summary
The epicenter of the earthquake was reported to be 85 km east of Yujing district in Taiwan. The quake was intense and it hit at around 12.14 pm.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X