Apple: యాపిల్ కంపెనీని 17 మిలియన్ డాలర్లకు మోసం చేసిన భారతీయుడు.. మూడేళ్ల శిక్ష..
టెక్ దిగ్గజం Appleని మోసం చేయడంతో పాటు సంబంధిత పన్ను నేరాలకు పాల్పడిన యాపిల్ మాజీ ఉద్యోగి, భారతీయ వ్యక్తి ధీరేంద్ర ప్రసాద్‌కు మూడేళ్ల జైలు శిక్ష పడింది. కోర్టు ధీరేంద్రకు శిక్షతో పాటు 19 మిలియన్ డాలర్ల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. రూ.138 కోట్ల కుంబకోణం కేసులో ఈ శిక్షను ఖరారు చేసినట్లు యూనిటైడ్ స్టేట్స్ అటార్నీ ఆఫీస్ కార్యాలయం అధికారిక ప్రకటన చేసింది. భారత్‌కు చెందిన ధీరేంద్ర ప్రసాద్ అమెరికాలోని యాపిల్ గ్లోబల్ సర్వీస్ సప్లై చైన్ విభాగంలో 2008 నుంచి 2018 వరకు పని చేశారు.
మెయిల్, వైర్ ఫ్రాడ్ స్కీమ్‌ల ద్వారా ఐఫోన్ తయారీదారు నుంచి సుమారు $17 మిలియన్లు మోసం చేసినట్లు మార్చి 2022లో అతనిపై అభియోగాలు మోపారు. శాన్ జోక్విన్ కౌంటీలోని మౌంటెన్ హౌస్‌కు చెందిన ధీరేంద్ర ప్రసాద్ 55 గత ఏడాది నవంబర్‌లో సైతం ట్యాక్స్ సంబంధిత నేరాలకు పాల్పడినట్లు నేరాన్ని అంగీకరించారు. జస్టిస్ డిపార్ట్‌మెంట్ ప్రకారం ప్రసాద్ యాపిల్ సంస్థకు కావాల్సిన ఆయా ప్రొడక్ట్‌ల విడి భాగాల్ని ఇతర సంస్థల నుంచి కొనుగోలు చేసే అధికారం ధీరేంద్రకు ఉంది.

అతను తన పదవిని అడ్డం పెట్టుకొని సంస‍్థకు కావాల్సిన విడిభాగాలను ఆర్డర్ పెట్టడం.. కంపెనీకి తెలియకుండా వాటిని ఇతర సంస్థలకు అమ్మడం చేశాడు.ఇక అక్రమ లావాదేవీల్లో పాలుపంచుకున్నందుకు గాను సదరు సంస్థలకు చెల్లింపులు చేయడం, ప్రొడక్ట్‌లను దొంగిలించడం, తప్పుడు ఇన్‌వాయిస్‌లను తయారు చేయడం వంటివి చేశాడు. ఇందుకు గాను రెండు వెండర్ కంపెనీల యజమానులతో కలిసి కుట్ర పన్నాడడంతో పాటు ఆదాయంపై పన్ను ఎగవేసినట్లు ధీరేంద్ర ఒప్పుకున్నాడు.

ధీరేంద్ర పనుల వల్ల యాపిల్ కంపెనీకి సుమారు 17 మిలియన్లకు పైగా నష్టం వచ్చింది. ధీరేంద్ర ప్రసాద్ సంస్థలో నేరాలకు పాల్పడే ఉద్యోగుల్ని యాపిల్ సంస్థ ఎలా కనిపెడుతుందో తెలుసుకొని జాగ్రత్త పడ్డారు. "అదనంగా, ప్రసాద్ కంపెనీ మోసం-గుర్తింపు సాంకేతికతలకు సంబంధించి తన అంతర్గత సమాచారాన్ని ఉపయోగించి తన నేరపూరిత పథకాలను గుర్తించకుండా నిరోధించడానికి రూపొందించాడు" అని DOJ తెలిపింది. ధీరేంద్ర ప్రసాద్ ఆయా నేరాలకు పాల్పడినందుకు ప్రసాద్‌కు 3 ఏళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్లు కోర్టు పేర్కొంది.












Click it and Unblock the Notifications