200 మందికి ఎయిడ్స్ ఎక్కించాడు: 25 ఏళ్ల జైలు
పినోమ్ పెన్: వైద్యం చేయించుకుందామని వెళ్లిన వారు ఇప్పుడు ఎయిడ్స్ వ్యాపించి మృత్యువుతో పోరాడుతున్నారు. ఎలాంటి అనుభవం లేకుండా, వైద్య విద్యను అభ్యసించకుండానే ఆ కిరాతకుడు 200 మందికి ఎయిడ్స్ రావడానికి కారణం అయ్యాడు.
యెమ్ చరిన్ (57) అనే కిరాతకుడికి గురువారం కాంబోడియా కోర్టు 25 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. బట్టామాబాంగ్ ఫ్రావిన్స్ లోని రేఖా అనే ప్రాంతంలో గ్రామీణ తెగల వారు నివాసం ఉంటున్నారు. యెమ్ చరిన్ వారికి వైద్యం చేసి డబ్బు సంపాధించాలని ప్లాన్ వేశాడు.
అనుకున్నట్లు గానే ఆ తెగల వారిని నమ్మించి వారికి వచ్చిరాని వైద్యం చెయ్యడం మొదలు పెట్టాడు. 15 నుంచి 50 ఏళ్లలోపు వారికి వైద్యం చేశాడు. అయితే అందరికి ఒకే నీడిల్ (సిరంజ్) ఉపయోగించి సూది వేశాడు.

ఇలా ఒకరికి ఉపయోగించిన నీడిల్ మరొకరికి ఉపయోగించడం వలన అందరికి హెచ్ఐవీ వ్యాపించింది. ఇప్పటికే 10 మంది మరణించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆరా తీశారు. ఇంత జరగడానికి కారణం యెమ్ చరిన్ అని గుర్తించారు.
2014 చివరిలో అతనిని అరెస్టు చేశారు. అప్పటి నుంచి కేసు విచారణ జరుగుతున్నది. 200 మందికి పైగా హెచ్ఐవీ వ్యాపించిందని వెలుగు చూసింది. అందరి ప్రాణాలతో చెలగాటం ఆడుకున్న యెమ్ చరిన్ కు 25 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించారు.












Click it and Unblock the Notifications