5 లక్షల మంది చావడం ఖాయం..? కరోనాతో.. ఎక్కడ, ఎప్పుడంటే: డబ్ల్యుహెచ్‌వో
కరోనా అంటేనే భయపడే పరిస్థితి.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కేసులు తగ్గుముఖం పట్టాయి. కానీ జనవరి నుంచి అంతటా కేసులు పెరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ మరో ఛేదు నిజం తెలియజేసింది. ఫిబ్రవరిలో కరోనా తన తడఖా చూపిస్తోందని వివరించింది. అయితే దీని ప్రభావం కొన్ని దేశాల్లో మాత్రమే ఉంటుందని చెప్పింది.

కరోనా కలవరం
వాస్తవానికి కొన్ని దేశాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ... మరికొన్ని దేశాల్లో నమోదవుతున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. యూరప్‌లో పెరుగుతున్న కరోనా కేసులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.యూరోపియన్ రీజియన్ పరిధిలో ఉన్న 53 దేశాల్లో ప్రస్తుతం కరోనా వ్యాపిస్తున్న తీరును పరిశీలిస్తే... వచ్చే ఏడాది ఫిబ్రవరికల్లా మరో 5 లక్షల మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని సంచలన విషయాన్ని వెల్లడించింది. కరోనా వ్యాప్తి కట్టడికి తగు చర్యలు తీసుకోవాలని సూచించింది. ప్రజలు కూడా బాధ్యతగా వ్యవహరించాలని కోరింది. డబ్ల్యూహెచ్ఓ యూరోపియన్ రీజియన్‌లో 53 దేశాలు, టెర్రిటరీలతోపాటు మధ్య ఏసియాలో కొన్ని దేశాలు కూడా ఉన్నాయి.

అప్పుడే ప్రభావం
వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే. వైరస్‌ను జయించేందుకు రెండు డోసులతోపాటు బూస్టర్ డోస్ టీకా కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే అందరికీ సెకండ్ డోసు ఇస్తున్నారు. ఇది పూర్తయితే దేశంలో చాలా మంది రెండు డోసులు తీసుకున్నట్టు అవుతుంది. దీంతోపాటు బూస్టర్ డోసు వేసుకోవాలని నిపుణులు సూచన చేస్తున్నారు. దీనిపై ప్రకటన రాలేదు.

భయం.. భయం
ఇటు డేల్టా వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. డేల్టా ప్లస్ వేరియంట్ మరింత ప్రమాదకరం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దీంతో కరోనా కోసం మరింత పకడ్బందీగా ఉండాల్సిందే. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు డిసెంబర్ వరకు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. జనవరి నుంచి ఏప్రిల్ వరకు థర్డ్ వేవ్ ఇంపాక్ట్ ఉంటుందని హెచ్చరిస్తున్నారు. దానిని దాటేస్తే గానీ.. పరిస్థితి ఏంటో చెప్పలేమని ఒకవిధంగా వార్నింగ్ ఇస్తున్నారు.
Recommended Video

జనవరి టెన్షన్
ప్రస్తుతం కరోనా కేసులు కాస్త తక్కువగానే వస్తున్నాయి. నిపుణులు మాత్రం జనవరిలో థర్డ్ వేవ్ స్టార్ట్ అవుతుందని అంచనా వేస్తున్నారు. దీనిని బట్టి మళ్లీ వేసవి ఎలా ఉంటుందోననే ఆందోళన ఉంది. కానీ ఇప్పటికే చాలా మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. ఎక్కడో.. ఎవరో కొందరు తీసుకోలేదు. దాదాపుగా చాలా మంది రెండు డోసులు కూడా తీసుకున్నారు. అంతా వ్యాక్సిన్ తీసుకుంటే కరోనా దరి చేరదని విశ్వసించవచ్చు.












Click it and Unblock the Notifications