అంతర్జాతీయంగా మరో షాక్-భారత సైనికుల్ని దేశం వదిలి పొమ్మన్న మాల్దీవులు..!
అంతర్జాతీయంగా భారత్ కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. నిన్న ఇజ్రాయెల్ కు గూఢచర్యం వ్యవహారంలో ఎనిమిది మంది మాజీ భారత నేవీ అధికారులకు గల్ఫ్ దేశం ఖతార్ మరణశిక్ష విధించగా.. దాన్నుంచి కోలుకోక ముందే మాల్దీవులు తమ దేశం నుంచి భారత సైనికుల్ని వెళ్లిపోవాలని ఆదేశించింది. దీంతో రెండు రోజుల వ్యవధిలో భారత్ కు రెండో ఎదురుదెబ్బ తగిలినట్లయింది.
మాల్దీవులు పూర్తిగా స్వతంత్రంగా ఉండాలని భావిస్తోందని, కాబట్టి తమ ద్వీప దేశంలో ఉన్న భారతీయ దళాలను వెనక్కి వెళ్లిపోవాలని కోరుతున్నట్లు తాజాగా అధ్యక్షుడిగా ఎన్నికైన మొహమ్మద్ మొయిజు తెలిపారు. మాల్దీవులపై పట్టు కోసం భారత్, చైనా పోటీ పడుతున్న నేపథ్యంలో ఆ దేశానికి కొత్త అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయం మనకు ఎదురుదెబ్బగా మారనుంది.
తాజాగా జరిగిన మాల్దీవుల ఎన్నికల ప్రచారంలోనూ తమ దేశంపై భారత్ నియంత్రణ ఉండటాన్ని మొయిజు తీవ్రంగా తప్పుబట్టారు.

ఇప్పటివరకూ మాల్దీవుల అధ్యక్షుడిగా ఉన్న ఇబ్రహీం సోలిహ్.. ద్వీప దేశం యొక్క వ్యవహారాలపై భారతదేశం నియంత్రణ లేకుండా అధికారాన్ని అనుమతించారని, భారతీయ దళాలను అక్కడ ఉంచడానికి అనుమతించడం ద్వారా దేశ సార్వభౌమత్వాన్ని అప్పగించారని ఆరోపించారు. తాను అధికారంలోకి వస్తే ఆ నిర్ణయాన్ని సమీక్షిస్తానని హామీ ఇచ్చారు. అన్నట్లుగానే వచ్చీ రాగానే మెయిజు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ హిందూ మహాసముద్ర ద్వీపసమూహానికి కొత్తగా ఎన్నికైన అధిపతి మొయిజు.. తాజాగా బ్లూమ్‌బెర్గ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ... ఇది ఇక్కడ భారతీయ సైనికుల ఉనికి కొనసాగుతోందని, భారతే కాదు మరే దేశానికి చెందిన సైనికులు అయినా తమ దగ్గర ఉంటే తమ స్పందన ఇలాగే ఉంటుందన్నారు. దాదాపు 70 మంది భారతీయ సైనిక సిబ్బంది ఇక్కడి రాడార్ స్టేషన్లు, నిఘా విమానాలను నడిపిస్తున్నారు. అలాగే భారత యుద్ధనౌకలు మాల్దీవుల ప్రత్యేక ఆర్థిక జోన్‌లో గస్తీకి సాయంచేస్తున్నాయి.
భారత సైనికుల్ని వెనక్కి పంపే విషయంపై ఇప్పటికే ఆ దేశంతో చర్చలు జరిపామని, అవి విజయంవంతం అయినట్లు కొత్త అధ్యక్షుడు మొయిజు ప్రకటించారు. పరస్పర ప్రయోజనకరమైన ద్వైపాక్షిక సంబంధాన్ని తాము కోరుకుంటున్నామని ఆయన తెలిపారు. భారతీయ సైనికుల స్థానంలో ఇతర దేశాల నుండి దళాలు రావని కూడా తెలిపారు. సైనిక సిబ్బందిని తొలగించమని భారతదేశాన్ని కోరడం చైనా లేదా మరేదైనా ఇతర దేశాలు తమ సైనిక దళాలను ఇక్కడికి తీసుకురావడానికి తాను అనుమతించినట్లు కాదన్నారు.
మొయిజు విజయం వ్యూహాత్మకంగా ఉన్న హిందూ మహాసముద్రంపై ప్రభావం కోసం చైనా, భారత్ మధ్య సాగుతున్న వార్ ను మరింత విస్తరించినట్లయింది. అయితే ఇప్పటికే అక్కడ భారత్, చైనా రెండూ భారీగా పెట్టుబడులు పెట్టాయి. అంతే కాదు వీటిలోనూ పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో మాల్దీవుల నిర్ణయం భారత్ కు ఎదురుదెబ్బగా మారింది.
-
తెలుగులో ప్రింటు ఖర్చులు కూడా రాలేదుగా అన్నా.. -
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!!












Click it and Unblock the Notifications