Iran Israel War: ఇరాక్ నూ కెలికిన ఇజ్రాయెల్? ఇరాన్ ఉమ్మడి పోస్టుపై దాడి-పోరు తీవ్రం..!
ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య జరిగిన యుద్దం తాలూకు పరిణామాలు ఇప్పుడు పశ్చిమాసియా మొత్తానికీ వ్యాపిస్తున్నాయి. ఇప్పటికే పాలస్తీనాకు మద్దతుగా సిరియా, లెబనాన్, ఇరాన్ వంటి దేశాల్లో మిలిటెంట్లు చేస్తున్న పోరును తిప్పికొడుతూ ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు దేశాల మధ్య యుద్దంగా మారిపోయింది. ఇదే క్రమంలో సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ చేసిన దాడి, అనంతరం ఇజ్రాయెల్ పై ఇరాన్ డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడటం జరిగిపోయాయి.
ఇప్పుడు దీనికి కొనసాగింపుగా తాజాగా ఇరాన్ పై ఇజ్రాయెల్ ప్రతిదాడులు కూడా చేసింది. అయితే వీరిద్దరికీ మధ్యవర్తిగా ఉన్న అమెరికా సూచనతో ఈ దాడిపై ఇరుదేశాలూ నోరుమెదపకుండా ఉండిపోయాయి. అయితే పరోక్షంగా మాత్రం దాడులు చేసుకుంటూనే ఉన్నాయి. ఇందులో భాగంగా తాజాగా ఇరాక్ లోని ఇరాన్ ఉమ్మడి మిలిటరీ స్ధావరంపై దాడులు జరిగాయి. ఇందులో ముగ్గురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ పోరులో ఇరాక్ ను కూడా ఇజ్రాయెల్ కెలికినట్లయింది.

పైకి మాత్రం ఇజ్రాయెల్ ఈ దాడి చేయించలేదని చెప్పుకుంటున్నా అమెరికాకు కూడా ఇది వారిపనేనని తెలుసు. అయితే ఇరాన్ మాత్రం దీనిపై తీవ్రంగానే స్పందించింది. ఇరాక్ లో ఉమ్మడి సైనిక స్ధావరంపై జరిగిన దాడిలో ఇజ్రాయెల్ పాత్రపై ఇప్పటివరకూ ఆధారాలు లభించలేదని, ఒకవేళ ఆ దేశం పాత్ర ఉందని తేలితే మాత్రం వెంటనే గరిష్ట దాడి చేస్తామని ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
ఇరాన్ తాజాగా ఇజ్రాయెల్ పై దాడి చేసినా ఆ తర్వాత ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడి చేసినా ఆగ్రరాజ్యాలు అమెరికా, బ్రిటన్ నేరుగా జోక్యం చేసుకునేందుకు ఇష్టపడటం లేదు. దీనికి కారణం ఇరాన్ పై ఈగ వాలినా తాము రంగంలోకి దిగుతామని రష్యా, చైనా చేస్తున్న హెచ్చరికలే. దీంతో ఈ పోరు మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసే అవకాశం ఉన్నందున ఎవరికి వారు మౌనం వహిస్తున్నారు. అయితే తెరవెనుక జరుుగుతున్న ఈ దాడులు ఏదో ఒక రోజు అనుకున్నంత పనీ చేసినా ఆశ్చర్యం లేదు.












Click it and Unblock the Notifications