వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనాలో మరో వైరస్.. నాలుగేళ్ల బాలుడిలో లక్షణాలు: ఏంటీ పరిస్థితి..?

|
Google Oneindia TeluguNews

కరోనా మహమ్మారి పుట్టిన చైనా దేశంలో రోజుకో కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చి చైనాకు ఆందోళనకర పరిస్థితులు తీసుకువస్తున్నాయి. ప్రస్తుతం కూడా కరోనా కేసులతో సతమతమౌతున్న చైనాకు మళ్లీ కొత్త ఆందోళన మొదలైంది. డ్రాగన్ కంట్రీ చైనాను మరో కొత్త వైరస్ భయపెడుతోంది.

చైనా లో ఏవియన్ ఫ్లూ యొక్క H3N8 మొదటి మానవ కేసు

చైనా లో ఏవియన్ ఫ్లూ యొక్క H3N8 మొదటి మానవ కేసు


ఏవియన్ ఫ్లూ యొక్క H3N8 జాతికి సంబంధించిన మొట్టమొదటి మానవ కేసును చైనా ధృవీకరించింది. అయితే ప్రజలలో విస్తృతంగా వ్యాపించే ప్రమాదం తక్కువగా ఉందని ఆరోగ్య అధికారులు చెబుతున్నారు. H3N8 ఉత్తర అమెరికా వాటర్‌ఫౌల్‌లో మొదటిసారి ఉద్భవించిన తర్వాత 2002 నుండి దీని వ్యాప్తి కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇది గుర్రాలు, కుక్కలు మరియు సీల్స్‌కు సోకుతుంది, కానీ ఇంతకు ముందు మానవులలో కనుగొనబడలేదు.

నాలుగేళ్ల బాలుడిలో ఏవియన్ ఫ్లూ H3N8

నాలుగేళ్ల బాలుడిలో ఏవియన్ ఫ్లూ H3N8

సెంట్రల్ హెనాన్ ప్రావిన్స్‌లో నివసిస్తున్న నాలుగేళ్ల బాలుడు జ్వరం మరియు ఇతర లక్షణాలతో ఈ నెల ప్రారంభంలో ఆసుపత్రిలో చేరిన తర్వాత H3N8 స్ట్రెయిన్‌కు పాజిటివ్ పరీక్షించినట్లు చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ మంగళవారం తెలిపింది. బాలుడి కుటుంబం ఇంట్లో కోళ్లను పెంచింది. అడవి బాతులు నివసించే ప్రాంతంలో వారు ఉండేవారు. దీంతో బాలుడు నేరుగా పక్షుల ద్వారా వ్యాధి బారిన పడ్డాడని పేర్కొన్నారు. H3N8 జాతికి "మానవులకు సమర్థవంతంగా సోకే సామర్థ్యం" ఉన్నట్లు కనుగొనబడలేదని కమిషన్ తెలిపింది.

 బాలుడి దగ్గర ఉన్న వారిలో ఎలాంటి లక్షణాలు లేవు.. అయినా అలెర్ట్

బాలుడి దగ్గర ఉన్న వారిలో ఎలాంటి లక్షణాలు లేవు.. అయినా అలెర్ట్

బాలునికి దగ్గరగా ఉన్న వారిలో ఎవరికీ ఏ విధమైన అసాధారణతలు పరీక్షలలో కనుగొనబడలేదని వెల్లడించారు. చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ బాలుడి కేసులో వన్-ఆఫ్ క్రాస్-స్పీసీస్ ట్రాన్స్‌మిషన్, మరియు పెద్ద ఎత్తున ప్రసారమయ్యే ప్రమాదం తక్కువగా ఉందని చెప్పారు. అయినప్పటికీ చనిపోయిన లేదా జబ్బుపడిన పక్షులకు దూరంగా ఉండాలని మరియు జ్వరం లేదా శ్వాసకోశ లక్షణాలకు తక్షణమే చికిత్స పొందాలని ప్రజలను హెచ్చరించారు.

కోళ్ళు, జంతువులలో సంభవించే ఏవియన్ ఫ్లూ H3N8.. మానవులలో తొలి కేసు

కోళ్ళు, జంతువులలో సంభవించే ఏవియన్ ఫ్లూ H3N8.. మానవులలో తొలి కేసు

ఏవియన్ ఇన్ఫ్లుఎంజా ప్రధానంగా అడవి పక్షులు మరియు పౌల్ట్రీలలో సంభవిస్తుంది. మనుషుల మధ్య వ్యాపించే కేసులు చాలా అరుదు. యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ప్రకారం, బర్డ్ ఫ్లూ యొక్క H5N1 మరియు H7N9 జాతులు వరుసగా 1997 మరియు 2013లో కనుగొనబడ్డాయి. అవి ఏవియన్ ఇన్ఫ్లుఎంజా నుండి మానవ అనారోగ్యానికి కారణమయ్యాయి. కానీ H3N8 జాతికి సంబంధించిన మొట్ట మొదటి కేసు మాత్రం మనుషులలో ప్రస్తుతం చైనాలో నమోదయింది.

English summary
China has confirmed the first human case of the H3N8 strain of avian flu. But health officials say the risk of it spreading widely among the public is low.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X