కాశ్మీర్ లేని చర్చలు మాకెందుకు: నవాజ్
ఇస్లామాబాద్: భారత్ తో చర్చలు జరపడానికి పాకిస్థాన్ కు ఇష్టం లేదని మరో సారి వెలుగు చూసింది. పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ స్వయంగా కాశ్మీర్ అంశం ఉంటేనే చర్చలు జరుగుతాయని అన్నారు. ఈ విషయం పాకిస్థాన్ కు చెందిన డాన్ పత్రిక పేర్కొంది.
సోమవారం నవాజ్ షరీఫ్ కేబినెట్ సమావేశం నిర్వహించారు. ఆ సందర్బంలో భారత్ తో చర్చల విషయంపై సుధీర్ఘంగా చర్చించారు. భారత్, పాకిస్థాన్ చర్చల్లో కాశ్మీర్ వేర్పాటువాద నేతలది కీలక భూమికేనని నవాజ్ షరీఫ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

భారత్, పాక్ చర్చలలో కాశ్మీర్ వేర్పాటువాద నేతలను మూడో వర్గంగా పరిగణించబోమన్నారు. కాశ్మీర్ అంశంలేని ఏ చర్చలైనా ఫలప్రదం కాబోవని నవాజ్ షరీఫ్ కుండలు బద్దలు కొట్టినట్లు చెప్పారు.
కాశ్మీర్ నేతలను సంప్రదించకుండా, వారి అభిప్రాయాలు తెలుసుకోకుండ వారి భవితవ్యాన్ని నిర్ణయించలేమని నవాజ్ షరీఫ్ తన కేబినెట్ బేటీలో అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇంత కాలం భారత్ తో చర్చలకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పుకున్న పాక్ ఇప్పుడు కాశ్మీర్ పాట పాడుతుంది.












Click it and Unblock the Notifications